BigTV English

Gadchiroli Encounter: ఎన్నికల వేళ గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి..!

Gadchiroli Encounter: ఎన్నికల వేళ గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి..!

Encounter in Gadchiroli During the Elections 2024: సార్వత్రిక ఎన్నికల వేళ గడ్చిరోలి నెత్తురోడింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు నక్సల్స్‌ను భద్రతా బలగాలు హతమార్చాయి.


పెరిమిలి దళానికి చెందిన కొందరు నక్సలైట్లు భామ్రాగడ్ తాలూకాలోని కాట్రంగాట్ట గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో క్యాంప్ చేస్తున్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. వ్యూహాత్మక కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ (TCOC) సమయంలో విధ్వంసకర కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

గడ్చిరోలి పోలీసుల ప్రత్యేక పోరాట విభాగమైన సి-60 కమాండోల రెండు యూనిట్లను వెంటనే ఆ ప్రాంతంలోకి పంపినట్లు పోలీసు సూపరింటెండెంట్ నీలోత్పాల్ తెలిపారు.


Also Read: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోలు హతం!

సెర్చ్ ఆపరేషన్ సమయంలో, నక్సల్స్ భద్రతా అధికారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, దానికి సి-60 సిబ్బంది ప్రతీకారం తీర్చుకున్నారని అధికారి తెలిపారు. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలం నుంచి ఇద్దరు మహిళా సహా ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిలో ఒకరిని పెరిమిలి దళం ఇన్‌చార్జి, కమాండర్ వాసుగా గుర్తించినట్లు అధికారి తెలిపారు.

ఆ ప్రాంతంలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నక్సలైట్లు మార్చి-జూన్ నుంచి TCOCని చేపట్టి తమ కేడర్‌ను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు పేర్కొన్నారు.

Also Read: Supreme Court: యోగా కోసం మంచి చేశారు, కానీ పతంజలీ..? బాబా రాందేవ్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య..

గత కొన్ని నెలల్లో ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది. రెండు రోజులు క్రితం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. అంతకుముందు దండకారణ్యంలో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. నాలుగు నెలల్లో దాదాపు వంద మంది మావోలను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

Tags

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×