E-Paper
Advertisement

Tragedy in Uttar Pradesh: సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా మంటలు.. నలుగురు చిన్నారులు దుర్మరణం!

Tragedy in Uttar Pradesh: సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా మంటలు.. నలుగురు చిన్నారులు దుర్మరణం!
Advertisement

4 Children Died due to Short Circuit: ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతిచెందారు. మీరట్ లోని వల్లవపురం గ్రామంలో జరిగిందీ విషాద ఘటన. జానీ – బబిత దంపతులకు సారిక (10), నిహారిక (8), సంస్కార్ (6), కలు (4)అనే నలుగురు పిల్లలున్నారు.

Advertisement

Also Read : హోలీ.. రంగుల కేళి.. మీ మిత్రులు, శ్రేయోభిలాషులకు ఇలా విష్ చేయండి..

శనివారం (మార్చి 24) రాత్రి మొబైల్ ఫోన్ కు ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన తల్లి బబిత పరిస్థితి విషమంగా ఉంది. ఆ సమయంలో జానీ కూలిపనికి వెళ్లడంతో.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం బబిత ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి బెడ్ షీట్ కు అంటుకోవడంతోనే చిన్నారులంతా మరణించారని తండ్రి జానీ పోలీసులకు తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

Big Stories

Advertisement
×