BigTV English

Twitter : ట్విటర్‌ టిక్ మార్క్ సేవలు షురూ.. సేఫ్టీ కౌన్సిల్ రద్దు..

Twitter : ట్విటర్‌ టిక్ మార్క్ సేవలు షురూ.. సేఫ్టీ కౌన్సిల్ రద్దు..

Twitter : ట్విటర్ ఎలాన్ మస్క్ చేతికి రాగానే ఆ సంస్థలో పెనుమార్పులొచ్చాయి. ఉద్యోగులను ఇంటికి సాగనంపే చర్యలతో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకేకాదు మస్క్ అటు ట్విటర్ యూజర్లకు షాక్ ఇచ్చారు. బ్లూటిక్ వెరిఫికేషన్ కు డబ్బులు కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత కొన్నిరోజులు ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ట్విటర్ టిక్ మార్క్ సేవలను మస్క ప్రారంభించారు.


సోషల్‌ మీడియా ప్లాట్ ట్విటర్‌ అకౌంట్‌ వెరిఫికేషన్‌ ను ప్రారంభించింది. ఇప్పటిదాకా ఉన్న వెరిఫికేషన్‌ మార్క్‌ బ్లూ టిక్ ..ఇపుడు మూడు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం వెబ్ యూజర్లు నెలకు 8 డాలర్లు చెల్లించాలి. ఐఫోన్‌ యూజర్లు మాత్రం 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ట్విట్టర్ యాజమాన్యం గతంలోనే ప్రకటించింది.

బ్లూ చెక్‌మార్క్‌తోపాటు, ప్రత్యేక ఫీచర్లు ఉన్న ట్విటర్‌ బ్లూ టిక్ సేవలు పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది. బ్లూ టిక్ సేవలను ప్రత్యేక రుసుం చెల్లిస్తే ఎవరికైనా ఇస్తారు. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది.


ట్విటర్‌ టేకోవర్‌ తర్వాత ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో ప్రధానమైనది వెరిఫికేషన్‌ ఫీజు. అలాగే ఆయా వర్గాల వారీగా టిక్‌ కలర్‌ మార్పు. ఇప్పటివరకు వెరిఫికేషన్ కు బ్లూ టిక్ మాత్రమే ఉంది. తాజా మార్పులతో సెలబ్రిటీల వ్యక్తిగత ఖాతాలకు బ్లూ టిక్ ఇస్తారు. ప్రభుత్వ సంస్థలకు గ్రే కలర్ టిక్ ఇస్తారు. వ్యాపార సంస్థలకు గోల్డ్ కలర్‌ టిక్‌ను కేటాయిస్తామని మస్క్‌ ప్రకటించారు.

మరోవైపు ట్విటర్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్‌ ‘ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ కౌన్సిల్‌’ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్వేష ప్రసంగాలు, బాలలపై ఆకృత్యాలు, ఆత్మహత్యలు లాంటి సమస్యలను ట్విటర్‌ లో సమర్థంగా ఎదుర్కొనేందుకు 2016లో అప్పటి యాజమాన్యం ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. దీంట్లో 100 మంది స్వతంత్ర సభ్యులు ఉన్నారు. పలు పౌర, మానవతా సంస్థలకు చెందిన వ్యక్తులు సేవల్ని అందించేవారు. ఈ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్నట్లు మస్క్‌ బృందం సభ్యులకు మెయిల్‌ పంపింది. ట్విటర్‌ ను మరింత భద్రమైన, సమాచారంతో కూడిన వేదికగా తీర్చిదిద్దుతామని పేర్కొంది. ఈ కౌన్సిల్‌ ఇప్పటి వరకు ఒక స్వతంత్ర బృందంగా వ్యవహరిస్తూ వచ్చింది. హింస, ద్వేషం సహా ఇతర సమస్యలను ఎదుర్కోవడానికి కావాల్సిన సలహాలు, సూచనలకు ట్విటర్‌కు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండేది. కానీ నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం ఉండేది కాదు. ఇప్పుడు మస్క నిర్ణయంతో ట్విటర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ కౌన్సిల్ రద్దైంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×