BRS MLA Harishrao: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ డబ్బులను, రైతుబంధు డబ్బులను పెంచాలన్నారు. ఈ ప్రభుత్వం మాటలకే పరిమితమైందన్నారు. పెన్షన్ పెంపుడు పక్కనపెడితే.. రెండు నెలల నుంచి పింఛనే రావట్లేదంటూ ఆయన ఆరోపించారు.
Also Read: ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్‌లను ప్రారంభించనున్న సీఎం రేవంత్
‘కల్యాణ లక్ష్మీ డబ్బులు ఇవ్వాలి. గ్రామాల్లో చెత్త పేరుకుపోతున్నది. మధ్యాహ్న భోజనం కార్మికులకు జీతాలు ఇవ్వడంలేదు. వెంటనే వారికి జీతాలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పని చేసే కార్మికులకు జీతాల్లేవు. గ్రామాల్లో కుక్కలు, వసతి గృహాల్లో ఎలుకలు దాడి చేస్తున్నాయి’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.