Union Budget 2025: లోక్ సభలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏటా బడ్జెట్ ప్రవేశ పెట్టే క్రమంలో కేంద్రమంత్రి ధరించిన చీరలపై ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఈ సారి కూడా నిర్మలమ్మ చీర ఎంపికలో తన మార్క్‌ను చూపించారు. ఏటా బడ్జెట్ రోజున ధరించే చీరల విషయంలో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. 2019లో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నప్పటి నుంచి బడ్జెట్ సమావేశాలకు చేనేత చీరనే ధరిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా ఆమె బంగారు అంచుతో ఉన్న గోధుమవర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజ్, శాలువాతో కనిపించారు. చీరపై ఉన్న చేపల ఆర్ట్ ఆకట్టుకుంది.
ఈసారి కేంద్ర మంత్రి ధరించిన చీరకు మరో ప్రత్యేకత కూడా ఉంది. కేంద్ర మంత్రి నిర్మల బిహార్ లోని మధుబనికి వెళ్లినపుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి ఆమెను కలుసుకున్నారు. తాను డిజైన్ చేసిన చేనేత చీరను కేంద్ర మంత్రికి బహుకరించారు. బడ్జెట్ వేళ ఈ చీరను ధరించాలని కోరారు. పద్మశ్రీ దులారీదేవికి ఇచ్చిన మాట ప్రకారమే కేంద్ర మంత్రి ఈ చీరను ధరించారు.
కేంద్ర బడ్జెట్ 2019
2019లో తొలిసారి బడ్డెట్ సమావేశంలో గులాబీరంగు, బంగారు అంచుతో ఉన్న చీరకట్టుకున్నారు. గులాబీ రంగు వినూత్న విధానాన్ని చూస్తుండగా.. బంగారు అంచు భారదేశపు గొప్ప వస్త్ర వారసత్వానికి నివాళి అర్పించింది.
కేంద్ర బడ్జెట్ 2020
2020 లో బడ్జట్ ప్రవేశపెట్టే సమయంలో నీలం రంగు అంచుల్లో, పసుపు పచ్చ బంగారం వనంలో ఉన్న చీరతో.. సమావేశాలకు హాజరయ్యారు. ఇది కష్ట సమయంలో ఆశ, ఆర్ధిక వృద్ధిని సూచిస్తుంది.
కేంద్ర బడ్జెట్ 2021
2021లో ఎరుపు, గోధుమ రంగు కలగలిసిన భూదాన్ పోచం పల్లి చీరలో మెరిసారు. ఇది ప్రభుత్వం వృద్ది, పునరుజ్జీవనంపై దృష్టి సారించడాన్ని సూచిస్తుంది.
Also Read: బడ్జెట్ లో బీహార్ కు భారీ వరాలు.. ఏపీ సంగతి ఏంటి అంటున్న ప్రతిపక్షాలు..
కేంద్ర బడ్జెట్ 2022
కేంద్ర బడ్జెట్ 2022 సమావేశాల్లో మెరూన్ కలర్ ఒడిస్సా చేనేత చీరను ధరించారు. ఇవి గొప్ప సాంస్కృతిక కథలను వివరించే సంక్లిష్టమైన.. నమూనాలకు ప్రసిద్ధి చెందినవిగా చెబుతారు.
కేంద్ర బడ్జెట్2023
2023లో టెంపుల్ డిజైన్‌తో నలుపు బంగారు వర్ణాల అంచుతో ఎరుపు రంగు చీరలో ఆకట్టుకున్నారు. ఇది ప్రతి ఒక్కటి వారసత్వం, శక్తి స్థితిస్థాపకతను సూచిస్తుంది.
కేంద్ర బడ్జెట్ 2024
2024లో కాంతా కుట్లు, ఆకులు పూల సాంప్రదాయ నమూనాలతో పాటు బెంగాలీ కళా నైపుణ్యాన్ని అందంగా ప్రదర్శించింది.