గ్రేటర్ పరిధిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేసి వారిని గ్రిప్‌లో పెట్టుకునేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ వ్యూహం పన్నినట్టు తేలింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సహా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా వదలకుండా ట్యాపింగ్‌కు పాల్పడినట్టు బయటపడింది. ఇందులో కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సభ్యులను టార్గెట్ చేసినట్టు తెలిసింది. గత ఎన్నికల సమయంలో మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్‌రావు, ఆయన స్నేహితుడు, బిజినెస్ పార్ట్‌నర్ ఫోన్ నంబర్‌ను కూడా ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టీమ్ ట్యాప్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి సందీప్‌రావుతో పాటు మరొకరి స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కొత్త అస్త్రాలు.. నయా స్ట్రాటజీ ఫలిస్తుందా?
ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో.. 2023 నవంబర్15 నుంచి 30వ తేదీ వరకు 415 ఫోన్ నంబర్స్ ట్యాప్ చేసినట్టు గుర్తించారు. వీటిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు సహా… మండలస్థాయి లీడర్ల ఫోన్లను ప్రణీత్‌రావు టీమ్ ట్యాప్ చేసిందని సిట్ గుర్తించింది.ఫోరెన్సిక్స్ ల్యాబ్ రిపోర్ట్ మేరకు.. ట్యాపింగ్ జరిగిన ఫోన్ నంబర్లకు సిట్అధికారులు కాల్ చేసి వారిని పిలిపించి స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. ఇక ట్యాంపరింగ్ వ్యవహారానికి సంబంధించి పలు కీలక విషయాలు తెలియాల్సి ఉంది. ఆ దిశగా సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది.