BigTV English

Minister Giriraj Singh Attack: కేంద్ర మంత్రిపై దాడి.. ప్రజా కార్యక్రమంలో ఉండగా పంచ్ చేసిన యువకుడు!

Minister Giriraj Singh Attack: కేంద్ర మంత్రిపై దాడి.. ప్రజా కార్యక్రమంలో ఉండగా పంచ్ చేసిన యువకుడు!

Minister Giriraj Singh Attack: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఒక ప్రజా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు ఆయనపై ఓ యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన బిహార్ రాష్ట్రం లోని బెగుసరాయ్ నగరంలో శనివారం రాత్రి జరిగింది. బెగుసరాయ్ నియోజకవర్గం నుంచి గిరిరాజ్ సింగ్ ఎన్నికల్లో విజయం సాధించారు.


రాజధాని పట్ననుంచి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెగుసరాయ్ నగరంలో శనివారం మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం జనతా దర్బార్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. కార్యక్రమం చివర్లో ఉండగా.. ప్రజల్లో నుంచి ఒక యువకుడు ఒక్కసారిగా వచ్చి మంత్రి వద్ద నుంచి మైక్ లాగేసుకున్నాడు. ఆ తరువాత మంత్రి గిరిరాజ్ పై ముష్టి ఝాతాలు కురిపించబోయాడు. కానీ భద్రతా సిబ్బంది, పార్టీ కార్యకర్తలు మంత్రిగారిని కాపాడి.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ముస్లింలపై తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే గిరిరాజ్ సింగ్ పై బహిరంగ కార్యక్రమంలో దాడి జరగడంతో ఆయన మళ్లీ వార్తల్లో నిలిచారు.

తనపై జరిగిన దాడి గురించి మంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ”నేను కార్యక్రమం ముగించే సమయంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా వచ్చాడు. నా మైక్ ని బలపూర్వకంగా లాగేసుకొని.. నన్ను కొట్టేందుకు ప్రయత్నించాడు. ఒక వేళ అతని చేతిలో తుపాకీ ఉండి ఉంటే నన్నుహత్య చేసేందుకు ప్రయత్నించేవాడేమో. అతని ప్రవర్తన అంత హింసాత్మకంగా కనిపించింది. అతను అసభ్యంగా మాట్లాడాడు. శివరాజ్ సింగ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాడు. అయినా అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.


నేను ఇలాంటి దాడులకు భయపడను. నా పేరు గిరిరాజ్ సింగ్. ఇలాంటి ఉగ్రవాదులు నన్నేమి చేయలేరు. నేనెప్పుడూ సమాజం హితం కోసమే మాట్లాడుతాను. మన సమాజంలో శాంతి భద్రతలకు భంగం కల్పించే వారికి వ్యతిరేకంగా నేను గళం విప్పుతూనే ఉంటాను.” అని తీవ్ర స్వరంతో చెప్పారు.

మంత్రిపై దాడి చేసిన ఆ యువకుడని పోలీసులకు అప్పగించినట్లు మంత్రి గిరిరాజ్ సెక్యూరిటీ సిబ్బంది తెలిపింది. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని.. విచారణ చేస్తున్నామని తెలిపారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బిజేపీ నాయకులలో నటి కంగనా రనౌత్ కూడా ఒకరు. ఉత్తరా ఖండ్ రాష్ట్రం మండి నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా రనౌత్ పై జూన్ నెలలో చండీగడ్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా సిబ్బంది గా పనిచేసే ఒక మహిళా కానిస్టేబుల్ దాడి చేసింది. ఎంపీ కంగనా రనౌత్ చండీగడ్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు విమానాశ్రయం వచ్చినప్పుడు.. అక్కడ పనిచేసే సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెపై దాడి చేసింది. బిజేపీ ఎంపీ తన తల్లిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేసినందుకే ఆమె చెంప చెళ్లుమనేలా కొట్టానని ఆ మహిళా కానిస్టేబుల్ కారణం తెలిపింది.

Also Read: ట్రైన్ లో వృద్ధుడిపై దాడి చేసిన అల్లరిమూకలు.. బీఫ్ తీసుకెళుతున్నాడని అనుమానంతో..!

ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీ నిరసనలను చేసిన రైతులను కించపరిచేలా కంగన రనౌత్ వ్యాఖ్యలు చేశారు. అక్కడ నిరసన చేసేవారంతా డబ్బులు తీసుకొని కూర్చున్నవారే నని ఆమె అన్నారు. అయితే ఆ నిరసనల్లో మహిళలు కూడా పాల్గొన్నారు. వారిలో ఆ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తల్లి కూడా ఉందని ఆమె తెలిపింది.

ఎంపీ కంగనా రనౌత్ పై దాడి చేసినందుకు కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి.. ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఆమెను బెంగుళూరులోని సిఐఎస్ఎఫ్ రిజర్వ బెటాలియన్ కు ట్రాన్స్‌ఫర్ చేశారు.

Also Read: లేటు వయసులో సోగ్గాడి వేషాలు.. యువతులు కావాలని ఆ రిటైర్డ్ ఉద్యోగి ఏం చేశాడంటే..

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×