E-Paper
Advertisement

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!
Advertisement

Uttar Pradesh Wolf Attacks| ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తోడేళ్లు మానవ నివాస ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 7 మంది చిన్న పిల్లలే ఉండడం ఆందోళనకర పరిస్థితులను సూచిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక 8 ఏళ్ల బాలుడుపై తోడేళు దాడి చేసింది. ఈ దాడిలో ఆ పిల్లాడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్ లోని భైరాచ్, ఝాన్సీ ప్రాంతాల్లో తోడేళ్లు మనుషులపై విరుచుకుపడుతున్నాయి. దీంతో ఫారెస్ట్ విభాగం అధికారులు తోడేళ్లను పట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పటివరకు 7 తోడేళ్లను పట్టకుని జూ పార్క్ లకు తరలించినట్లు తెలిపారు. అయినా దాడులు ఆగడం లేదు.

Advertisement

ఈ ఘటనలపై ఉత్తర్ ప్రదేశ్ మహిళా మంత్రి బేబీ రాని మౌర్యను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తోడేళ్లు దాడులు ఆపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? అని విలేకరులు ప్రశ్నించగా.. మంత్రి బేబీ రాని మాట్లాడుతూ.. ‘తోడేళ్లను అంత సులువుగా పట్టుకోలేం. ఎందుకంటే ఆ జంతువులు ప్రభుత్వం కంటే తెలివనవి’ అని సమాధానమిచ్చారు.

”తోడేళ్ల కోసం చాలా మంది అటవీ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మేము వాటిని పట్టుకుంటామ. కానీ సమయం కావాలి. ఎందుకంటే తోడేళ్లు ప్రభుత్వం కంటే తెలివైన జంతువులు. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. త్వరలోనే తోడేళ్లను పట్టకుంటాం. అటవీ శాఖ మంత్రి స్వయంగా ఈ సమస్యను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.” అని వ్యాఖ్యానించారు.

Advertisement

Also Read: కాల్ గర్ల్ తల నరికి యువతి సోదరుడి ఇంట్లో పెట్టిన ప్రియుడు.. ఎందుకు చేశాడంటే..

శుక్రవారం భైరాచ్ నగరంలో మహ్ సీల్ మండలంలో ఒక 8 ఏళ్ల బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా అనుకోకుండా ఒక తోడేలు పిల్లాడిపై దాడి చేసిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. తోడేలు.. బాలుడి ముఖంపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. గత రెండు నెలలుగా జరుగుతున్న తోడేలు దాడుల్లో ఇప్పటివరకు 8 మంది చనిపోగా 36 మంది గాయపడ్డారని అధికారిక సమాచారం.

30 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఉత్తర్ ప్రదేశ్ లో తోడేళ్లు మనుషులపై దాడుల చేశాయి. ఆ సమయంలో 9 నెలల కాలంలో దాదాపు 30 మంది పిల్లలను తోడేళ్లు చంపేశాయి. 1996 -97 సంవత్సరాలలో జరిగిన తోడేలు దాడులపై వైల్డ్ లైఫ్ సైంటిస్ట్, ఫారెస్ట్ ఆఫీసర్ అధ్యయనం చేయగా.. షాకింగ్ విషయాలు తెలిశాయి.

ఈ దాడులన్నీ ఒకే తోడేలు చేస్తోందని.. దాడి చేసిన ప్రతీసారి.. తదుపరి దాడి కోసం ఇతర గ్రామాలకు వెళ్లిపోతుందని తేలింది. అందువల్లే ఘటన జరిగిన ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆ ప్రత్యేక తోడేలు కనిపించలేదని తెలిసింది. ఈ దాడులు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్ పూర్, ప్రతాప్ గడ్, సుల్తాన్ పూర్ జిల్లాల్లో జరిగాయి. ఆ తోడేలు.. ఒంటరిగా ఉన్న మానవులపై ఒక్కసారి దాడి చేసి వారిని అడవిలోకి ఈడ్చుకెళుతుంది. ఆ తరువాత శవంలోని కొన్ని భాగాలు తీసుకెళ్లి తన గుంపులోని తోడేళ్లకు ఆహారంగా ఇస్తోందని పరిశోధనలో బయటపడింది.

Related News

‘సీఈసీ జ్ఞానేష్ కుమార్ దేశద్రోహి.. తక్షణమే రాజీనామా చేయాలి’.. రాహుల్ సంచలన డిమాండ్!

జ్ఞానేష్ గేట్ నిజంగానే స్కామా? 13 కోట్ల ఓట్ల తొలగింపు వెనుక అసలేం జరిగింది?

వీరమణి పోక్సో కేసులో మరో బిగ్ ట్విస్ట్.. ఫోన్‌లో విస్తుపోయే వీడియోలు.. కీలక అనుచరుడు అరెస్ట్!

48 గంటల్లో CEC రాజీనామా చేయాలి.. లేకపోతే నిరసనలు: CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

Big Stories

Advertisement
×