BigTV English

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Musheer Khan scores a brilliant century in Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీలో నాలుగు జట్లు ఆట మొదలెట్టాయి. ఇందులో ఒక్కడు బయటకు వచ్చాడు. అతనే ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్. ఇండియా బీ నుంచి ఆడుతున్న ముషీర్.. తొలిరోజు సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. రెండో రోజు అదే జోరుతో ఆడాడు. 373 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్ ల సాయంతో 181 పరుగులు చేసి.. డబుల్ సెంచరీ ముందు అవుట్ అయ్యాడు.


బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముషీర్ ఖాన్ కొట్టిన సిక్సర్ ఒకటి స్టేడియం పై స్టాండ్ ని తాకింది. ఇప్పుడిది నెట్టింట వైరల్ గా మారింది. అయితే అదే ఉత్సాహంతో మరో బాల్ ని అలాగే షాట్ కొట్టి.. లాంగ్ ఆన్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కొంచెం సంయమనం పాటించి ఉంటే డబుల్ సెంచరీ అయిపోయేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. మళ్లీ ముంబయి బ్యాటర్ వచ్చాడ్రా అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ముంబయి అంటే తెలుసు కదా.. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగసర్కార్, పాలీ ఉమ్రీగర్, విజయ్ మర్చంట్ లాంటి ఎందరో గొప్ప గొప్ప ప్లేయర్లు అక్కడ నుంచే వచ్చారు. ముషీర్ ఖాన్ వీరి వారసత్వాన్ని అందుకుంటాడా? అని ఎక్కడెక్కడికో లెక్కలు వేస్తున్నారు.


Also Read: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇండియా బీ జట్టును ముషీర్ ఖాన్ ఆదుకున్నాడు. ఒక్కడూ ఒంటరిగా పోరాడాడు. అయితే టెయిలెండర్ నవ్‌దీప్ సైనీ (56) తోడ్పాటు అందించడంతో  8వ వికెట్‌కు 205 పరుగులు జోడించాడు. దాంతో ఇండియా-బీ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఏ…త్వరత్వరగా 2 వికెట్లు కోల్పోయినా నిలకడగానే ఆడుతున్నారు.  ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(36), శుభ్‌మన్ గిల్ (25) ఒక మాదిరిగా ఆడి అవుట్ అయ్యారు . తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (27 నాటౌట్), కేఎల్ రాహుల్(23 నాటౌట్) ఇద్దరూ కలిసి ఆచితూచి ఆడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 134 పరుగులతో  ఉంది.  ఓపెనర్లు ఇద్దర్నీ నవ్‌దీప్ సైనీ అవుట్ చేశాడు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×