E-Paper
Advertisement

Vande Bharat Train Chennai To Mysore : సౌత్ ఇండియాలో వందేభారత్‌ ట్రైన్ ట్రయిల్ రన్ స్టార్ట్.. హైస్పీడ్‌తో కొత్త అనుభూతి..

Vande Bharat Train Chennai To Mysore : సౌత్ ఇండియాలో వందేభారత్‌ ట్రైన్ ట్రయిల్ రన్ స్టార్ట్.. హైస్పీడ్‌తో కొత్త అనుభూతి..
Advertisement

Vande Bharat Train Chennai To Mysore : దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ సోమవారం ప్రారంభమైంది. చెన్నై నుంచి మైసూర్ వరకు నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ చెన్నైలోని ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభం అయింది. దేశంలో 5వ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 11వ తేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.

న్యూఢిల్లీ -కాన్పూర్- అలహాబాద్-వారణాసి మార్గంలో మొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు కేంద్రం జాతికి అంకితం చేస్తోంది. దేశంలో నలుమూలలను కలిపేలా 75 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతామని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోటపై ప్రకటించారు. స్పీడ్, సేఫ్టీ, సర్వీసులతో కూడిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలను చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే ఉత్పత్తి యూనిట్ తయారు చేసింది.

Advertisement

గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు కొత్త ప్రయాణ అనుభూతిని ఇస్తున్నాయి. ఈ రైళ్లతో ప్రయాణ కాలం సగానికి పైగా తగ్గింది. ఈ రైలు బోగీల్లో ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ బేస్ డ్ ఆడియో, విజువల్ ప్యాసింజర్ సమాచార వ్యవస్థ, వైఫై, అనుకూల సీటింగ్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛైర్లు, బయోవ్యాక్యూమ్ టాయ్ లెట్లు సదుపాయాలు కల్పించారు. పాంట్రీతోపాటు వేడి వేడి భోజనం, చల్లటి శీతల పానీయాలను ప్రయాణికులకు అందించేలా ఏర్పాట్లు చేశారు.వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో 1128 మంది ప్రయాణికులు కూర్చునేలా సీట్లు ఏర్పాటు చేశారు.

Tags

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×