Etela Rajender : మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి తరువాత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోటలోనే బీజేపీ సత్తా చాటిందన్నారు. మునుగోడులో మంత్రులు ఎమ్మెల్యేలంతా వాలిపోయారన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నాయుకులు ఎన్నో దాడులు చేశారన్నారు.
ఎన్నికల టైంలో కేసీఆర్ ఎంతకైనా తెగించి దిగజారుతారన్నారు ఈటెల. హుజురాబాద్‌లో తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేశారన్నారు. 35వేల గొల్లకురుమ ఓట్ల కోసం బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారన్నారు. కమ్మునిస్టులను గతంలో తోక పార్టీలన్న కేసీఆర్..మునుగోడులో ఓటమి భయంతోనే కమ్యునిస్టులను మచ్చిక చేసుకున్నారన్నారు.