Big Stories

Kerala : మందుబాబులకు వెరైటీ శిక్ష..వెయ్యిసార్లు ఇంపోజిషన్‌.. ఎక్కడంటే?

Kerala : మనదేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. హైవేలపై ప్రమాదాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఘటనలకు ప్రధానం కారణం నిబంధనలు పాటించకపోవడం. కొందరు హెల్మెట్లు ధరించకుండానే బైక్ లపై రయ్ మంటూ దూసుకుపోతున్నారు. సిగ్నల్ వద్ద కాసేపు వాహనాన్ని నిలిపేందుకు కొందరు ఇష్టపడరు. వేగంగా దూసుకుపోతుంటారు. ఇలాంటి సమయాల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొందరు మద్యం సేవించి వాహనాలు నడుపుతారు. ఈ మత్తులో ప్రమాదాల బారిన పడుతున్నారు. మందుబాబుల వాహన వేగానికి అమాయకులు బలవుతున్నారు.

- Advertisement -

డ్రంక్ అండ్ డ్రైవ్ లు చేపడుతున్నా మందు కొట్టి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గడంలేదు. అందుకే కేరళ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కొచ్చి పోలీసులు వెరైటీ శిక్ష వేశారు. పాఠశాల విద్యార్థుల తరహాలో వారితో ఇంపోజిషన్‌ రాయించారు.

- Advertisement -

ఇటీవల కొచ్చిలో ఓ ప్రైవేట్‌ బస్సు ఢీకొనడంతో ఓ బైకర్ మృతిచెందాడు. ఈ ఘటనపై హైకోర్టు జోక్యం చేసుకుంది. ప్రమాదానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. కేరళలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి త్రిపునితుర పోలీసులు వినూత్న శిక్ష వేశారు. ఇకపై తాగి డ్రైవింగ్‌ చేయను అని వారితో వెయ్యిసార్లు రాయించారు. అసలే మద్యంమత్తులో ఉన్న వారు ఇంపోజిషన్‌ రాసేందుకు నానా తిప్పలు పడ్డారు. ఇంపోజిషన్ రాసినా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వారికి శిక్ష తప్పదని పోలీసులు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News