E-Paper
Advertisement

తమిళనాడులో కొత్త కూటమి.. ఆ దిశగా సీఎం విజయ్ అడుగులు, విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర భగ్నం

తమిళనాడులో కొత్త కూటమి.. ఆ దిశగా సీఎం విజయ్ అడుగులు, విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర భగ్నం
Advertisement

Chennai: తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా? కొత్త కూటమి దిశగా సీఎం విజయ్ అడుగులు వేస్తున్నారా? ఉపఎన్నికలు-స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మిత్రులతో సీఎం విజయ్ కీలక భేటీ ఏర్పాటు చేశారా? ఈ సమావేశాలు సాధారణమే అని చెబుతున్నారా? దీంతో తమిళనాడులో పొలిటికల్‌ స్ట్రక్చర్‌ మారబోతుందా? సీఎం విజయ్ నిర్ణయాలు చూస్తుంటే నిజమేనని అనిపిస్తోంది.

తమిళనాడు రాజకీయాల్లో కొత్త కూటమి.. ఆ దిశగా సీఎం విజయ్ అడుగులు

Advertisement

తమిళనాడు రాజకీయాల పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు టీవీకే అధినేత, సీఎం విజయ్. తమిళనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు నెలలు కావడంతో అధికార తమిళగ వెట్రి కజగం-టీవీకే నాయకత్వంలో కొత్త ‘లౌకిక’ కూటమిని ఏర్పాటు చేయడానికి అడుగులు వేసింది. ఈ కూటమిలో డీఎంకేకి చెందిన మాజీ మిత్రపక్షాలను భాగస్వాములుగా చేర్చుకుంది.

టీవీకే సీనియర్ నాయకులు ఆనంద్, ఆదావ్ అర్జున వివిధ రాజకీయ పార్టీల కీలక నేతలను వ్యక్తిగతంగా కలిశారు. రాష్ట్రంలో బలమైన పార్టీగా టీవీకే మరింత ఎదిగేందుకు కోవలంలో అత్యంత కీలకమైన కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, ఎండీఎంకే నేతలు హాజరుకాబోతున్నారు.

Advertisement

విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర భగ్నం.. ఏకాకిగా మారనున్న డీఎంకె

వామపక్ష పార్టీలు ఈ భేటీకి దూరంగా ఉన్నాయి. తాము బయట నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెబుతోంది. ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు రాజకీయాల్లో రాబోయే పెను మార్పులకు ఈ సమావేశం వేదిక కావడం ఖాయమనే చర్చ అప్పుడే మొదలైంది. ఇటీవల మాజీ సీఎం స్టాలిన్ మాట్లాడుతూ రాబోయే మూడు నుంచి ఆరు నెలల్లో విజయ్ ప్రభుత్వం కూలిపోవచ్చని చెప్పుకొచ్చారు.

డిఎంకె మాజీ మిత్రపక్షాలను ఎప్పుడైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కోరవచ్చనే వార్తల నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం ద్వారా డీఎంకేకు మిత్రులు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశం ద్వారా డీఎంకే ఏకాకి కావచ్చని టీవీకే పార్టీ పెద్దల అంచనా. లౌకిక కూటమిలో చేరడానికి కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, ఎండీఎంకే పార్టీలు రెడీగా ఉన్నట్లు సమాచారం.

ALSO READ: శ్రీరామ మందిర విరాళాల కేసు.. హుండీ లెక్కింపులో కొత్త విషయాలు 

ఇదిలా వుండగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర భగ్నమైంది. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు సహా ముగ్గురు అరెస్ట్ అయ్యారు. దీనివెనుక మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పాత్రపై అనుమానాలు లేకపోలేదు. ఈ పొలిటికల్ కుట్రపై తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారుల దర్యాప్తు చేస్తున్నారు.

Related News

రేషన్‌ కార్డు‌దారులకు బిగ్ అలర్ట్.. కోటిన్నర కార్డులు రద్దు? 6 నెలలుగా రేషన్ తీసుకోకుంటే

జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

Big Stories

Advertisement
×