Bengaluru Stampede| బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4, 2025న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ విజయోత్సవ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరణించిన 21 ఏళ్ల భూమిక్ లక్ష్మణ్ అనే యువకుడు చనిపోయాడు. అతని తండ్రి బీటీ లక్ష్మణ్.. హాసన్ జిల్లాలో తన కొడుకు సమాధి వద్ద విలపిస్తూ కనిపించాడు. ఆ సమాధిని పట్టుకొని అక్కడే ఉండిపోతానని కన్నీరు పెడుతూ కనిపిస్తన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని కర్ణాటక బీజేపీ షేర్ చేసింది.
ఒక వీడియోలో.. లక్ష్మణ్ సమాధి నేలపై పడి, దుఃఖంతో ఏడుస్తూ.. కన్నీరు ఆపుకోలేకపోయాడు. ఆ ఎమోషనల్ వీడియో చూస్తే ఎవరికైనా మనసు కలచివేస్తుంది. “నేను కూడా ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, ఇప్పుడు ఎక్కడికీ వెళ్లాలని లేదు,” అని అతను బాధతో చెప్పాడు. అతని చుట్టూ కొందరు ఓదార్చే ప్రయత్నం చేస్తూ కనిపించారు.
కర్ణాటక బీజేపీ తమ అధికారిక ట్విట్టర్ ‘X’ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ దుర్ఘటనను “రాష్రమే నిర్వహించింది” అని నిందించింది. “తన కొడుకు సమాధి ముందు కూర్చొని ఏడుస్తున్న ఈ తండ్రికి తన కొడుకును తిరిగి ఇవ్వగలరా?” అని పోస్ట్‌లో ప్రశ్నించారు. బీజేపీ మరో పోస్ట్‌లో ఇలా రాసింది.. “మీరు మనసు పెట్టి ఉంటే, మీ పిల్లలు, మనవళ్లతో లగ్జరీ హోటల్‌లో ఎంజాయ్ చేస్తూ.. ఫోటో తీసుకుని ఉండేవారు. కానీ, విధాన సౌధ మెట్లపై ఫోటో తీసుకోవాలనే మీ పట్టుదల 11 కుటుంబాలను ప్రతిరోజూ కన్నీళ్లలో ముంచెత్తింది.” అని ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
ఈ తొక్కిసలాట.. స్టేడియం వెలుపల వేలాది మంది అభిమానులు ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం కోసం గుమిగూడినప్పుడు సంభవించింది. అయితే కార్యక్రమం నిర్వహణలో లోపాలు, సరైన ప్రణాళిక లేకపోవడం ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 56 మంది గాయపడ్డారు.
ఈ ఘటనపై స్పందిస్తూ.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షల నుండి రూ.25 లక్షలకు పెంచారు. గురువారం (జూన్ 5, 2025) RCB, ఈవెంట్ నిర్వాహకులైన DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)పై FIR నమోదైంది. బెంగళూరులో ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన అత్యంత ఘోరమైన తొక్కిసలాటల్లో ఒకటిగా ఈ ఘటనను పరిగణిస్తున్నారు.
Also Read: ఫ్యాన్స్ చనిపోయినా పట్టించుకోరా?.. సోషల్ మీడియాలో ఆర్సీబీ విజయోత్సవాలపై ట్రోలింగ్..
ఈవెంట్ నిర్వహణలో తప్పిదాల ఆరోపణలపై ఇద్దరు ఆర్సీబీ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) ప్రెసిడెంట్ రఘురామ్ భట్, ఇతర అధికారులు తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని రద్దు చేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
ಕೊಲೆಗಡುಕ ಸಿಎಂ @siddaramaiah ಅವರೆ, ಕೊಲೆಗಡುಕ ಡಿಸಿಎಂ @DKShivakumar ಅವರೆ,
ನೀವು ಮನಸ್ಸು ಮಾಡಿದ್ದರೆ ಐಷಾರಾಮಿ ಹೋಟೆಲ್ನಲ್ಲಿ ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಹಾಗೂ ಮೊಮ್ಮಕ್ಕಳೊಂದಿಗೆ ಕಪ್ ಜೊತೆ ಫೋಟೋ ತೆಗೆಸಿಕೊಳ್ಳಬಹುದಿತ್ತು. ಆದರೆ ವಿಧಾನಸೌಧದ ಮೆಟ್ಟಿಲುಗಳ ಮೇಲೆಯೇ ಫೋಟೋ ತೆಗೆಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬ ನಿಮ್ಮ ಹಠ 11 ಕುಟುಂಬಗಳು ಪ್ರತಿನಿತ್ಯ… pic.twitter.com/l27yBoeiiX
— BJP Karnataka (@BJP4Karnataka) June 7, 2025