Wedding in Hospital| నిజమైన ప్రేమకు హద్దులు లేవని నిరూపించాడో ఓ యువకుడు. సినీమాను తలపించే భావోద్వేగంగా సాగింది అతని వివాహం. తను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడానికి అతను విధితో సైతం పోరాడాడు. అందుకే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నా అన్నీ తానై ఆమెకు తోడుగా నిలిచాడు. ఈ ఆదర్శ వివాహం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సినిమా వివాహ్ స్టోరీ నిజంగా జరిగింది. ఆ సినిమాలో వివాహం నిశ్చయమైన తరువాత యువతి అగ్ని ప్రమాదానికి గురవుతుంది. ఆమె శరీరం తీవ్రంగా కాలిపోయి ఆస్పత్రిలో ఉంటుంది. అయితే ఆ యువతిని పెళ్లి చేసుకోబోయే యువకుడు అందరూ ఇక వివాహం రద్దు చేసుకోవాలని చెప్పినా అతను మాత్రం ఆమె తన భార్య అని ఆమె పక్షాన నిలబడతాడు. ఆస్పత్రిలో అన్నీ తానై చూసుకుంటాడు. ఆమెకు సేవలు చేస్తాడు. చివరికి తాళి కట్టి ఏడు అడుగులు వేయాల్సిన సమయంలో ఆ పెళ్లి కూతురు నడవలేని స్థితిలో ఉంటే ఆమెను ఎత్తుకొని అగ్నిసాక్షిగా ఏడు అడుగలు వేస్తాడు. అచ్చం ఇదే తరహా కథ నిజజీవితంలో జరిగింది. ఆ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ లోని రాజ్ గడ్ జిల్లా కుంభ్‌రాజ్ గ్రామానికి చెందిన ఆదిత్య సింగ్ అనే యువకుడు అదే గ్రామంలో నివసించే నందిని సోలంకి యువతిని ప్రేమించాడు. వారిద్దరి కుటుంబాలు దూర బంధువులు కావడంతో వారి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే వారి వివాహానికి అంగీకారం తెలిపారు. అయితే వివాహం అక్షయ తృతీయ నాడు మంచి ముహూర్తం ఉందని తెలుసుకున్నపెద్దలు వారి పెళ్లికి అదే ముహూర్తం నిశ్చయించారు. కానీ పెళ్లికి వారం రోజుల ముందు నందిని అనారోగ్యం చేసింది. ఆమెకు వేసవిలో వడదెబ్బకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో తీసుకెళ్లగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం గ్రామం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బియావోరా పట్టణానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో నగరానికి తీసుకువచ్చారు. డాక్టర్లు ఆమె పూర్తిగా బెడ్ రెస్ట్ చేయాలని లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని సూచించారు. దీంతో పెళ్లి వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి.
Also Read: స్విగ్గీలో బంగారం డెలివరీ.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ గార్డ్‌తో.. నిజమా?
కానీ వారి జాతకాల దృష్ట్యా మంచి ముహూర్తాలు మరో రెండు సంవత్సారాల వరకు లేవని తెలిసి నందిని కుటుంబం విచారం వ్యక్తం చేసింది. మరోవైపు నందినికి ప్రాణహాని కూడా ఉంది. ఆమెకు ఏమైనా అయితే అవివాహితగానే చనపోతుందనే భయం వారికి కలిగింది. దీంతో వరుడు ఆదిత్య సింగ్ ఈ సమస్య తీర్చడానికి ముందు వచ్చాడు. ముందు అనుకున్న అక్షయ తృతీయ ముహూర్తానికే తాను నందినిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకోసం ఆస్పత్రిలోనే వివాహం చేయాలని అందరూ నిశ్చయించారు. ఈ సమస్య మొత్తం ఆస్పత్రి యజమాన్యానికి చెప్పడంతో వారి అనుమతిలో ఆస్పత్రి వార్డులో కొంతభాగం పెళ్లి మండపంగా మార్చారు. పేషెంట్ గా ఉన్న నందిని పెళ్లికూతురుగా తయారైంది. కానీ ఆమె లేచి నిలబడలేని పరిస్థితి అందుకే వరుడు ఆదిత్య సింగ్ ఆమెను తన కౌగిలిలో ఎత్తుకొని అగ్నిసాక్షిగా ఏడు అడుగులు నడిచాడు. ఆ తరువాత మంగళసూత్రమైన తాళిని నందిని మెడలో కట్టి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంత చాలా మంది నెటిజెన్లు ఈ వీడియోని చూసి తెగ లైక్ చేస్తున్నారు.
ఒక యూజర్ అయితే.. ఈ వీడియోపై కామెంట్ చేస్తూ.. “ప్రేమ ప్రతి అసంభవాన్ని సంభవం చేస్తుంది.” అని రాశాడు.
Saath phere in hospital see video pic.twitter.com/C1vdaHPhRi
— Viral Info (@3Chandrayaan) May 2, 2025