E-Paper
Advertisement

బోర్డర్లో వైట్ కోట్ వారియర్స్ స్టోరీ… సైనికుల ప్రాణాల కోసం డాక్టర్ల పోరాటం

బోర్డర్లో వైట్ కోట్ వారియర్స్ స్టోరీ… సైనికుల ప్రాణాల కోసం డాక్టర్ల పోరాటం
Advertisement

Army Medical Drama Series: సరిహద్దుల్లో తుపాకులు పేలుతున్నప్పుడు దేశాన్ని కాపాడేందుకు సైనికులు పోరాడుతుంటారు. కానీ అదే సమయంలో గాయపడిన ఒక్కో సైనికుడి ప్రాణాన్ని కాపాడేందుకు ఆర్మీ హాస్పిటల్‌లో వైద్యులు చేసే పోరాటం ఎలా ఉంటుంది ? చేతిలో ఆయుధానికి బదులు స్టెతస్కోప్… యుద్ధభూమికి బదులు ఆపరేషన్ థియేటర్.. ప్రాణాలను కాపాడేందుకు ప్రతి సెకనుతో పోటీ పడే వైద్యుల జీవితం ఎలా ఉంటుందో తెరపై ఆవిష్కరిస్తుంది సరికొత్త మెడికల్ డ్రామానే ‘108 బేస్ హాస్పిటల్ – ఉరి’ (108 Base Hospital – Uri). జమ్మూ కాశ్మీర్‌లోని సున్నితమైన ఉరి ప్రాంతంలోని ఆర్మీ బేస్ హాస్పిటల్‌ను కథకు నేపథ్యంగా తీసుకున్న ఈ సిరీస్‌లో దేశభక్తి, వైద్యం, ప్రేమ, బాధ్యత, భావోద్వేగాలు కలగలిసిన కథను చూపించారు. మరి ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి ప్రాంతం అంటేనే సున్నితమైన సరిహద్దు ప్రాంతం. ఇక్కడ విధులు నిర్వహించే సైనికులకు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో చెప్పలేం. కాల్పులు, ఉగ్రదాడులు, యుద్ధ పరిస్థితుల్లో గాయపడిన సైనికులను క్షణాల్లో ఆసుపత్రికి తీసుకురావాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులకు కొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఉంటుంది.

Advertisement

అలాంటి పరిస్థితుల్లో పని చేసే వైద్యుల జీవితాన్ని ఈ కథలో చూడవచ్చు. ఉరిలోని 108 బేస్ హాస్పిటల్‌లో విధులు నిర్వహించే డాక్టర్లకు ప్రతి రోజు ఒక కొత్త సవాలే. అత్యవసర పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకోవడం, క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడం, ప్రాణాలతో పోరాడుతున్న సైనికుడిని ఎలాగైనా కాపాడటం… వారి రోజువారీ జీవితంలో భాగంగా మారుతుంది.

ఈ కథలో మేజర్ నైనా, మేజర్ అనిరుద్ధ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఇద్దరూ ప్రతిభావంతులైన ఆర్మీ వైద్యులే అయినప్పటికీ, వైద్య విధానం, నిర్ణయాలు తీసుకునే విషయంలో వారి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒకరి ఆలోచనలను మరొకరు అంగీకరించని సందర్భాలు కూడా ఎదురవుతాయి. దీంతో ఆసుపత్రిలో వారి మధ్య వృత్తిపరమైన పోటీ ఆసక్తిని పెంచుతుంది.

Advertisement

కానీ ఒక సైనికుడి ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. వ్యక్తిగత అభిప్రాయాలు, వృత్తిపరమైన పోటీ అన్నింటినీ పక్కన పెట్టి ఇద్దరూ కలిసి పని చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో తీసుకునే ఒక్క నిర్ణయం ఒక సైనికుడి జీవితాన్ని మార్చగలదు. అందుకే ఈ డాక్టర్ల పోరాటం కూడా ఒక రకమైన యుద్ధంగానే అనిపిస్తుంది.

మరోవైపు ఆసుపత్రిలోని అత్యవసర పరిస్థితులు వారి వ్యక్తిగత జీవితాలపై కూడా ప్రభావం చూపుతుంటాయి. రోజూ మరణాన్ని దగ్గరగా చూస్తూ పని చేయడం, బాధ్యతల ఒత్తిడి, సహచరులతో ఏర్పడే బంధాలు.. ఇవన్నీ వారి భావోద్వేగాలపై ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు కూడా కథలో కీలకంగా మారతాయి.

ఒకవైపు ప్రాణాలతో పోరాడుతున్న సైనికులు.. మరోవైపు వారిని బతికించేందుకు సమయంతో పోటీ పడుతున్న వైద్యులు.. ఈ రెండు ప్రపంచాల మధ్యే ‘108 బేస్ హాస్పిటల్ – ఉరి’ కథ సాగుతుంది. సరిహద్దులో జరుగుతున్న పోరాటం మాత్రమే కాదు.. ఆర్మీ హాస్పిటల్‌లో ప్రతి రోజు జరిగే ప్రాణాల పోరాటం కూడా ఎంత తీవ్రమైనదో ఈ సిరీస్ లో చూడవచ్చు.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?

యుద్ధం అంటే సరిహద్దుల్లో తుపాకులతో జరిగే పోరాటం మాత్రమే కాదు… ఆసుపత్రిలో ఒక ప్రాణాన్ని కాపాడేందుకు వైద్యులు చేసే పోరాటం కూడా అంతే కీలకం. దేశభక్తి, మెడికల్ డ్రామా, ఎమోషన్స్, మానవ సంబంధాలను కలిపిన సిరీస్ ‘108 బేస్ హాస్పిటల్ – ఉరి’. ఆర్మీ నేపథ్యంలోని కథలను ఇష్టపడేవారికి ఇది ఆసక్తికరమైన సిరీస్‌గా నిలిచే అవకాశం ఉంది.

ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటివరకు ఎక్కువగా సైనికుల పోరాటం, యాక్షన్, దేశభక్తి కథలనే చూశాం. కానీ సైనికుల ప్రాణాలను కాపాడే ఆర్మీ వైద్యుల జీవితాన్ని కేంద్రంగా చేసుకున్న కథ చాలా భిన్నంగా అనిపిస్తుంది. మెడికల్ ఎమర్జెన్సీలు, ఆపరేషన్ థియేటర్ సన్నివేశాలు, సైనికుల త్యాగాలు, డాక్టర్ల వ్యక్తిగత సంఘర్షణలు, ఎమోషన్స్‌తో పాటు దేశభక్తిని కూడా మిళితం చేయడం ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

‘108 బేస్ హాస్పిటల్ – ఉరి’ సిరీస్ ఆగస్టు 15 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ అవుతుంది. అదే రోజు నుంచి COLORS టీవీలో ప్రతి శని, ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. మేజర్ నైనా పాత్రలో ఎరికా ఫెర్నాండెజ్, మేజర్ అనిరుద్ధ్‌గా గష్మీర్ మహాజని నటించారు. నిఖిల్ ఖురానా, హితెన్ తేజ్వానీ, స్మితా బన్సాల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సీరీస్ హిందీలోనే ఉంది.

Read Also: రొనాల్డోతో బంధం నుంచి ఫెర్గూసన్ ఆఫర్ వరకు… మౌరిన్హో సీక్రెట్స్ బయటపెట్టిన డాక్యుమెంటరీ

Tags

Related News

ఒక హత్యతో మొదలై… పోలీస్ శాఖనే కుదిపేసిన కుట్ర… పోలీసులను వేటాడుతున్న ఆ కిల్లర్ ఎవరు?

మనుషుల్ని బానిసలుగా మార్చి.. ఊచకోతకు ఉసిగొల్పిన క్రిమినల్ మైండ్… బయటపడిన మాన్సన్ రహస్యాలు

నమ్మినవాడే వెన్నుపోటు.. డ్రాగన్లతో రణరంగం.. చివర్లో ఊహించని విషాదం

40 ఏళ్ల పెళ్లి బంధం… ఒక్క ట్రిప్‌తో బయటపడ్డ షాకింగ్ నిజం

హీరో సిద్ధార్థ్ కి భారీ షాక్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్!

ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి వెళ్తుంటే యాక్సిడెంట్… రెండు ప్రేమకథల ఎమోషనల్ జర్నీ

హిందీలో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మా ఇంటి బంగారం.. ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×