E-Paper
Advertisement

సమంత, తాప్సీ సూపర్ హిట్ సినిమాలకు డిలీట్ డేట్ ఫిక్స్… ఓటీటీలో చూసేందుకు ఇదే చివరి ఛాన్స్

సమంత, తాప్సీ సూపర్ హిట్ సినిమాలకు డిలీట్ డేట్ ఫిక్స్… ఓటీటీలో చూసేందుకు ఇదే చివరి ఛాన్స్
Advertisement

Superhit Movies Leaving Netflix Soon: ఓటీటీలోకి వచ్చిన సినిమా ఎప్పటికీ అందులో అలాగే ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ వాస్తవానికి ప్రతి సినిమాకు స్ట్రీమింగ్ హక్కులకు ఒక గడువు ఉంటుంది. ఆ గడువు పూర్తయిన తర్వాత ఆయా చిత్రాలు ప్లాట్‌ఫామ్ నుంచి డిలీట్ కావడం కొత్త విషయం కాదు. ఇప్పటికే ఎన్నో ప్రముఖ చిత్రాలు ఇలా ఓటీటీలకు గుడ్‌బై చెప్పాయి. ఇప్పుడు అదే జాబితాలో మరో రెండు సూపర్ హిట్ సినిమాలు చేరబోతున్నాయి.

దక్షిణాది ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన సమంత నటించిన ‘ఓ బేబీ’ (Oh Baby), తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గేమ్ ఓవర్’ (Game Over) త్వరలో నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీ నుంచి డిలిట్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలు మహిళా ప్రధాన కథలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి ఆ సినిమాలు ఎప్పటి వరకు ఓటీటీలో ఉంటాయో తెలుసుకుందాం పదండి.

ముందుగా ‘గేమ్ ఓవర్’కు గుడ్‌బై

Advertisement

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఓవర్’ 2026 ఆగస్టు 12 నుంచి నెట్‌ఫ్లిక్స్లో అందుబాటులో ఉండదు. మైండ్ బెండింగ్ స్క్రీన్‌ప్లే, అదిరిపోయే థ్రిల్లర్ ఎలిమెంట్స్, సీట్ ఎడ్జ్ సస్పెన్స్‌తో ఈ సినిమా విడుదల సమయంలో మంచి ప్రశంసలు అందుకుంది.

పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడే యువతిగా తాప్సీ నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ‘గేమ్ ఓవర్’ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఇప్పటికీ బెస్ట్ ఛాయిస్‌.

సెప్టెంబర్‌లో ‘ఓ బేబీ’ కూడా కనుమరుగు

Advertisement

సమంత కెరీర్‌లోనే బెస్ట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘ఓ బేబీ’ కూడా త్వరలో నెట్‌ఫ్లిక్స్ కు గుడ్‌బై చెప్పనుంది. 2026 సెప్టెంబర్ 2 నుంచి ఈ సినిమా ప్లాట్‌ఫామ్‌లో కనిపించదు.

దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం కొరియన్ హిట్ మూవీ ‘మిస్ గ్రానీ’కి అధికారిక రీమేక్. 70 ఏళ్ల వృద్ధురాలు అనూహ్యంగా 24 ఏళ్ల యువతిగా మారితే ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ఫాంటసీ కామెడీ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది.

సమంత తన నటన, కామెడీ టైమింగ్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగా… లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నాగశౌర్య తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ‘ఓ బేబీ’ బాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయం సాధించింది.

ఎందుకు తొలగిస్తున్నారు ?

సాధారణంగా నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ సంస్థలు నిర్మాతలతో 5 నుంచి 7 సంవత్సరాల వరకు స్ట్రీమింగ్ హక్కుల ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఆ గడువు పూర్తయిన తర్వాత కొత్త ఒప్పందం కుదరకపోతే ఆయా సినిమాలను లైబ్రరీ నుంచి తొలగిస్తారు.

‘గేమ్ ఓవర్’ ఆగస్టు 12 నుంచి, ‘ఓ బేబీ’ సెప్టెంబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండవు. తెలుగు, తమిళం ఒరిజినల్ వెర్షన్లతో పాటు ఇతర డబ్బింగ్ వెర్షన్లను కూడా తొలగించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ మళ్లీ రెన్యూ చేస్తుందా లేదా అనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ రెన్యువల్ జరగకపోతే, ఈ సినిమాలు మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు ‘ఓ బేబీ’, ‘గేమ్ ఓవర్’ చూడకపోయినా లేదా మరోసారి రీవాచ్ చేయాలని అనుకుంటున్నా, ఇదే సరైన సమయం. సమంత ఎమోషనల్ ఫాంటసీ కామెడీ అయినా, తాప్సీ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ అయినా… రెండూ తమ తమ జానర్‌లో ప్రత్యేకమైన సినిమాలే. కాబట్టి నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీ నుంచి శాశ్వతంగా తొలగిపోకముందే మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకుని చూసేయండి.

Read Also: కిడ్నాప్ వెనుక క్రిమినల్ నెట్‌వర్క్… కూతురి కోసం బ్లడీ బ్లడ్ బాత్

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×