E-Paper
Advertisement

ఇదేందయ్యా ఇది.. స్కూటీ రేటు రూ.లక్ష.. పెండింగ్ చలాన్లు మాత్రం రూ.10 లక్షలు!

ఇదేందయ్యా ఇది.. స్కూటీ రేటు రూ.లక్ష.. పెండింగ్ చలాన్లు మాత్రం రూ.10 లక్షలు!
Advertisement

Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.వందల్లో, రూ. వేలల్లో చలానాలు పడటం సాధారణమే. కానీ ఒకే ఒక్క స్కూటీపై ఏకంగా రూ. 10 లక్షల ఫైన్ పడిందంటే నమ్ముతారా? వినడానికి కాస్త వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికి నిజం. ఏకంగా 96 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి.. రూ. 10 లక్షల పెండింగ్ చలానాలు కలిగి ఉన్న స్కూటర్‌ను, దాని యజమానిని పోలీసులు పట్టుకున్నారు.

అసలేం జరిగిందంటే?

హర్యానాలోని గురుగ్రామ్‌లో రాజీవ్ చౌక్ వద్ద ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జోనల్ ఆఫీసర్ ఏఎస్ఐ విజయ్ సింగ్ తన బృందంతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుడంగా.. అటుగా వస్తున్న ఒక స్కూటర్‌ పై వారి దృష్టి పడింది. దాన్ని ఆపి సంబంధించిన పత్రాలను చూపించాలని డ్రైవర్‌ను కోరారు. అయితే ఆ వాహనదారుడు ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

స్కూటర్‌పై 96 చలానాలు

Advertisement

దీంతో ఆ స్కూటర్ నంబర్ ఆధారంగా రికార్డులను ఆన్‌లైన్‌లో తనిఖీ చేశారు. అందులో కనిపించిన ఫైన్ల లిస్ట్ చూసి ట్రాఫిక్ పోలీసులే అవాక్కయ్యారు. ఆ స్కూటర్‌పై మొత్తం 96 చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసి షాక్ కు గురయ్యారు. వీటిలో ఒక్కటి మాత్రమే ఈ-చలాన్ మిషన్ ద్వారా వేయగా.. మిగిలినవన్నీ రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా నమోదు కావడం గమనార్హం. అవన్నీ కలిపి ఏకంగా రూ. 10 లక్షల జరిమానాగా తేలాయి.

చలాన్లకు కారణాలు

ఈ స్కూటర్‌పై పడిన చలానాల్లో ఎక్కువ భాగం హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, ఇన్సూరెన్స్ లేకపోవడం, పొల్యూషన్ (PUC) సర్టిఫికెట్ లేకపోవడం, ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించినవేనని అధికారులు తెలిపారు. మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం.. భారీ స్థాయిలో చలానాలు పెండింగ్‌లో ఉండటంతో అధికారులు వెంటనే ఆ స్కూటర్‌ను సీజ్ చేసి.. స్టేషన్ కు తరలించారు.

Advertisement

Also Read: ఫిలిప్స్, షావోమీ, నోవా.. రూ. 1,500 లోపు ఏ ట్రిమ్మర్ కొంటే బెటర్?

పోలీసులు ఏమన్నారంటే?

మరోవైపు ఈ విచిత్ర ఘటనపై గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. వాహనదారులు తమ ఇన్సూరెన్స్, పీయూసీ సహా అన్ని పత్రాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. పెండింగ్ చలానాలను ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. రోడ్డు భద్రత నిమిత్తం కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

Also Read: విజయ్ మార్క్ బడ్జెట్.. పెళ్లికి బంగారు నాణెం.. పుట్టిన పాపాయికి గోల్డ్ రింగ్!

Tags

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×