E-Paper
Advertisement

క్రైమ్ నుంచి కామెడీ దాకా ఏకంగా 6 సినిమాలు… ఒక్కో ఓటీటీలో ఒక్కో తెలుగు మూవీ

క్రైమ్ నుంచి కామెడీ దాకా ఏకంగా 6 సినిమాలు… ఒక్కో ఓటీటీలో ఒక్కో తెలుగు మూవీ
Advertisement

Telugu Movies on OTT:  ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు తెలుగు సినిమాల జాతరే నడుస్తోంది. ఒకవైపు యూత్‌ఫుల్ లవ్ స్టోరీస్, మరోవైపు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్, ఇంకోవైపు హారర్, సైకలాజికల్ థ్రిల్లర్… ఇలా ఒక్కో జోనర్‌కు ఒక్కో సినిమా రెడీగా ఉంది. అంతేకాదు, చాలా కాలం తర్వాత మళ్లీ చూడాలనుకునే ఒక తెలుగు క్లాసిక్ కూడా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ వీకెండ్‌లో థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చూడగలిగే ఆ 6 తెలుగు సినిమాలు ఏంటి ? ఏ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

Mr. Work From Home 

ముందుగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా పూర్తిగా యూత్‌ను టార్గెట్ చేసే కథతో సాగుతుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల జీవితాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో ఎదురయ్యే సరదా సమస్యలు, ఆఫీస్ వర్క్‌కు వ్యక్తిగత జీవితం కలిసిపోయినప్పుడు వచ్చే గొడవలు, వాటి మధ్య పుట్టే ప్రేమ చుట్టూ కథ తిరుగుతుంది. సీరియస్ థ్రిల్లర్స్ మధ్య కాస్త లైట్‌గా నవ్వుకుంటూ సినిమా చూడాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. ఈ సినిమాను Sun NXT, Aha Videoలో చూడవచ్చు.

Nijame Rujuvainadhi

Advertisement

ఇక సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారి కోసం నిజమే రుజువైంది ఉంది. ఒక మర్డర్ మిస్టరీతో మొదలయ్యే ఈ కథలో అసలు నేరం చేసింది ఎవరు? హత్య వెనుక ఉన్న కారణం ఏంటి? అనే సస్పెన్స్ చివరి వరకు కొనసాగుతుంది. పోలీసులు చేసే దర్యాప్తు, అనుమానితుల చుట్టూ తిరిగే కథనం, మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను చివరి వరకు సస్పెన్స్‌లో ఉంచేలా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ వరకు అసలు నిందితుడిని అంచనా వేయడం కష్టంగా ఉండే ఇన్వెస్టిగేషన్ డ్రామా కావడంతో క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌కు ఇది మంచి వీకెండ్ వాచ్. ఈ సినిమాను ETV Winలో చూడవచ్చు.

Vadala

హారర్ సినిమాలు ఇష్టపడేవారి కోసం ఈ లిస్ట్‌లో ‘వదల’ అనే సినిమా ఉంది. భయపెట్టే విజువల్స్, టెన్షన్ పెంచే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సస్పెన్స్‌తో నడిచే కథ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కథ ముందుకు వెళ్లే కొద్దీ అసలు ప్రమాదం ఏంటి? పాత్రలకు ఎదురవుతున్న భయానక పరిస్థితుల వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అనే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. వీకెండ్‌లో లైట్స్ ఆఫ్ చేసి ఒక హారర్ మూవీ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునేవారు ఈ సినిమాను ట్రై చేయవచ్చు. Amazon Prime Videoలో ఇది అందుబాటులో ఉంది.

Forest Guard

Advertisement

అడవి బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు మాత్రం ‘ఫారెస్ట్ గార్డ్’ను మిస్ అవ్వకండి. కథిర్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఒక అడవిలో జరిగే సంఘటన చుట్టూ తిరుగుతుంది. ఫ్రెండ్స్ అంతా కలిసి అడవిలోకి వెళ్లిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. మొదట సరదాగా మొదలైన వారి ప్రయాణం… క్రమంగా అనుమానాలు, పాత గొడవలు, భయం, ద్రోహాలతో ప్రమాదకరంగా మారుతుంది. చివరకు ఒకరినొకరు నమ్మలేని పరిస్థితికి చేరుకున్న ఆ వ్యక్తులు ప్రాణాల కోసం చేసే పోరాటమే ఈ సినిమా అసలు కథ. అడవిలోని ప్రమాదం కంటే మనుషుల మైండ్ మరింత ప్రమాదకరంగా మారినప్పుడు ఏం జరుగుతుందనే కోణంలో వచ్చే సైకలాజికల్ ట్విస్టులు సినిమాకు హైలైట్. ఆహాలో ఈ సినిమాను చూడవచ్చు.

Premadesam

ఇక కాలేజీ లైఫ్, ఫ్రెండ్‌షిప్, ప్రేమ, ఎమోషన్స్‌తో కూడిన క్లీన్ యూత్‌ఫుల్ సినిమా చూడాలనుకుంటే ‘ప్రేమదేశం’ మంచి ఛాయిస్. త్రిగుణ్, మేఘా ఆకాష్, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా యువత జీవితాల్లో ప్రేమ, స్నేహం ఎలా మార్పులు తీసుకొస్తాయి అనే అంశాల చుట్టూ సాగుతుంది. కాలేజీ రోజుల జ్ఞాపకాలు, ఫ్రెండ్‌షిప్, ప్రేమలో వచ్చే ఎమోషనల్ మలుపులు సినిమాకు ప్రధాన బలం. మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడగలిగే యూత్‌ఫుల్ లవ్ స్టోరీ కోసం చూస్తున్నవారు ETV Winలో ఈ సినిమాను చూడవచ్చు.

Gamyam 

ఇక ఈ ఆరు సినిమాల్లో చాలా కాలం తర్వాత మళ్లీ చూడాలనుకునేవారికి మరో స్పెషల్ మూవీ ‘గమ్యం’. శర్వానంద్, అల్లరి నరేష్, కమలినీ ముఖర్జీ నటించిన ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఇది కేవలం ఒక రోడ్ జర్నీ కథ కాదు. ముగ్గురు వ్యక్తులు చేసే ప్రయాణం ద్వారా జీవితం, మనుషుల విలువ, స్నేహం, ప్రేమ, మనం ఎంచుకునే మార్గాల గురించి చెప్పే ఎమోషనల్ డ్రామా. ముఖ్యంగా గాడ్సే పాత్రలో అల్లరి నరేష్ నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే స్థాయిలో ఉంటుంది. ప్రయాణం సాగేకొద్దీ పాత్రల జీవితాల్లో వచ్చే మార్పులు, చివర్లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఒక మంచి తెలుగు క్లాసిక్‌ను మళ్లీ చూడాలనుకునేవారు ETV Winలో గమ్యాన్ని చూడవచ్చు.

ఇలా ఈ వారం ఓటీటీలో ఒకే జోనర్ కాకుండా… ప్రేమ, కామెడీ, క్రైమ్, హారర్, సైకలాజికల్ థ్రిల్, ఎమోషనల్ క్లాసిక్ ఇలా అన్ని రకాల సినిమాలు తెలుగు ప్రేక్షకుల కోసం రెడీగా ఉన్నాయి. లైట్‌గా నవ్వుకోవాలంటే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, క్రైమ్ మిస్టరీ కావాలంటే నిజమే రుజువైంది, హారర్ కోసం వదల, సైకలాజికల్ థ్రిల్ కోసం ఫారెస్ట్ గార్డ్, యూత్‌ఫుల్ లవ్ స్టోరీ కోసం ప్రేమదేశం, మంచి తెలుగు క్లాసిక్ కోసం గమ్యం… ఇలా మీకు నచ్చిన జోనర్‌లో ఈ వారం సినిమాలు చూడవచ్చు.

Read Also: గర్ల్ ఫ్రెండ్ తో బెస్ట్ ఫ్రెండ్ ప్రేమను చెడగొట్టాలని చూశాడు… చివరికి అతనే బుక్కయ్యాడు

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×