E-Paper
Advertisement

గురువుతో గొడవ పెట్టుకున్న స్టూడెంట్… టీవీ లైవ్‌లో రచ్చ రచ్చ.. అసలు గుట్టేంటి భయ్యా?

గురువుతో గొడవ పెట్టుకున్న స్టూడెంట్… టీవీ లైవ్‌లో రచ్చ రచ్చ.. అసలు గుట్టేంటి భయ్యా?
Advertisement

Aakhri Sawal on OTT: ఒక ప్రొఫెసర్‌కి, అతని విద్యార్థికి మధ్య మొదలైన చిన్న అకడమిక్ గొడవ… చివరకు దేశం మొత్తం చర్చించే స్థాయికి వెళ్తే ? ఒక క్లాస్‌రూమ్‌లో మొదలైన ప్రశ్నలు రాజకీయాలు, సిద్ధాంతాలు, చరిత్రను కదిలిస్తే ? పైగా ఆ ప్రశ్నల వెనుక ఏళ్లుగా దాగి ఉన్న ఓ మిస్టరీ ఉంటే ? సంజయ్ దత్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఆఖ్రీ సవాల్’ (Aakhri Sawal) కథ ఇలాంటి ఆసక్తికరమైన మేధోపరమైన సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే… 

ప్రొఫెసర్ గోపాల్ నడ్కర్ణి (సంజయ్ దత్) విద్యారంగంలో ఎంతో గౌరవం ఉన్న సీనియర్ మేధావి. తన సిద్ధాంతాల విషయంలో చాలా కచ్చితంగా ఉండే వ్యక్తి. ఆయన దగ్గర విక్కీ హెగ్డే (నమషి చక్రవర్తి) అనే ప్రతిభావంతుడైన రీసెర్చ్ స్కాలర్ చదువుతుంటాడు. విక్కీ తెలివైనవాడే అయినా… తన ఆలోచనలను నేరుగా బయటపెట్టే దూకుడు స్వభావం అతనికి ఉంటుంది. ఓ సందర్భంలో విక్కీ సమర్పించిన థీసిస్‌ను ప్రొఫెసర్ నడ్కర్ణి తిరస్కరిస్తాడు. తనపై కావాలనే పక్షపాతం చూపించారని విక్కీ భావిస్తాడు. మొదట ఇది కాలేజీకి పరిమితమైన ఓ చిన్న వివాదంగానే కనిపిస్తుంది. కానీ విక్కీ ఈ విషయాన్ని అక్కడితో వదిలి పెట్టడు. ప్రొఫెసర్ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రశ్నించడం మొదలు పెడతాడు.

Advertisement

విషయం బయటకు రావడంతో మీడియా దృష్టి ఈ వివాదంపై పడుతుంది. కొందరు రాజకీయ నాయకులు కూడా తమ ప్రయోజనాల కోసం ఈ గొడవను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. దీంతో ప్రొఫెసర్, విద్యార్థి మధ్య జరిగిన అకడమిక్ వివాదం కాస్తా జాతీయ స్థాయి చర్చగా మారుతుంది. చివరకు ఇద్దరూ ఓ టీవీ లైవ్ డిబేట్‌ లో ఎదురెదురుగా కూర్చోవాల్సి వస్తుంది. అక్కడ విక్కీ అడిగే ప్రశ్నలు ఒక్కోటి ప్రొఫెసర్‌ ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తాయి. భారత చరిత్రలో వివాదాస్పదంగా మారిన ఎన్నో అంశాలను అతను తెరపైకి తీసుకొస్తాడు. గాంధీ హత్య నుంచి ఎమర్జెన్సీ వరకు… బాబ్రీ మసీదు కూల్చివేత నుంచి ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర వరకు… చరిత్రలోని అనేక సంఘటనలపై ప్రొఫెసర్‌ ను ప్రశ్నిస్తాడు.

ప్రొఫెసర్ కూడా వెనక్కి తగ్గడు. తనకు తెలిసిన చరిత్ర, తన సిద్ధాంతాలు, తన అనుభవంతో విక్కీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాడు. దీంతో ఆ డిబేట్ సాధారణ టీవీ చర్చలా కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఓ యుద్ధంలా మారుతుంది. కానీ విక్కీ అసలు ఉద్దేశం కేవలం చరిత్రపై చర్చించడం కాదని క్రమంగా అర్థమవుతుంది. అతను ప్రొఫెసర్ గతాన్ని ఎందుకు తవ్వుతున్నాడు ? ఎందుకు ఇంత పట్టుదలగా ఆయనను ప్రశ్నిస్తున్నాడు ? అనే విషయాల వెనుక మరో పెద్ద కథ దాగి ఉంటుంది.

Advertisement

గతంలో కేరళలో జరిగిన ఓ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య, అలాగే ప్రొఫెసర్‌కు సన్నిహితంగా ఉన్న పాత సహోద్యోగి పల్లవి మీనన్ (సమీరా రెడ్డి) అనుమానాస్పదంగా అదృశ్యం కావడం… ఈ రెండు సంఘటనలు విక్కీ దర్యాప్తులో కీలకంగా మారతాయి. ప్రొఫెసర్ గత జీవితానికి, ఈ సంఘటనలకు ఏదైనా సంబంధం ఉందా అనే అనుమానం అతనిలో బలపడుతుంది. విక్కీకి ఇన్వెస్టిగేటర్ ఆదిత్య రావు (అమిత్ సాద్) కూడా సహకరిస్తాడు. ఇద్దరూ కలిసి ప్రొఫెసర్ గతాన్ని పరిశీలించడం మొదలు పెడతారు. బయటకు చూస్తే ఎంతో గౌరవంగా కనిపించే ప్రొఫెసర్ జీవితంలో నిజంగా ఏం జరిగింది ? పల్లవి మీనన్ అదృశ్యం వెనుక అసలు కారణం ఏమిటి ? కేరళలో జరిగిన హత్యతో ప్రొఫెసర్‌కు ఉన్న సంబంధం ఏంటి ? అనే ప్రశ్నలు కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి.

ఒక దశలో ఇది కేవలం గురువు, విద్యార్థి మధ్య సిద్ధాంతాల గొడవ కాదని తెలుస్తుంది. ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ మైండ్ గేమ్ వెనుక వ్యక్తిగత కక్షలు, రాజకీయ సిద్ధాంతాలు, చరిత్రలో దాగిపోయిన నిజాలు కూడా ఉన్నాయనే అనుమానం మొదలవుతుంది. అక్కడి నుంచి ప్రొఫెసర్ నడ్కర్ణి గతం ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలవుతుంది. విక్కీ అడిగే ప్రతి ప్రశ్న వెనుక ఓ ఉద్దేశం ఉంటుంది. ప్రొఫెసర్ చెప్పే ప్రతి సమాధానం వెనుక కూడా ఓ రహస్యం దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. చివరకు విక్కీ తెలుసుకోవాలనుకుంటున్న అసలు నిజం ఏంటి ? ప్రొఫెసర్ నడ్కర్ణి దాచిన రహస్యం ఏమిటి ? పల్లవి మీనన్ అదృశ్యానికి, గతంలో జరిగిన హత్యకు అసలు సంబంధం ఎవరిది ? అన్నింటికంటే ముఖ్యంగా… విక్కీ అడిగే ‘ఆఖ్రీ సవాల్’ ఏంటి ? దానికి ప్రొఫెసర్ ఇచ్చే సమాధానం వారి జీవితాలను మాత్రమే కాదు.. చుట్టూ ఉన్న రాజకీయ, సామాజిక వ్యవస్థను కూడా ఎలా ప్రభావితం చేస్తుంది ? అనేదే సినిమా చివరి భాగంలో ఆసక్తిని పెంచే అంశం.

తెలుగులో ఉందా ?

‘ఆఖ్రీ సవాల్’ సాధారణ పొలిటికల్ సినిమా కంటే భిన్నంగా… ఒక క్లాస్‌రూమ్ వివాదాన్ని దేశవ్యాప్త మేధోపరమైన సంఘర్షణగా మార్చే ప్రయత్నం చేస్తుంది. చరిత్ర, రాజకీయాలు, సిద్ధాంతాలు, వ్యక్తిగత నమ్మకాలు వంటి అంశాలు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమాను చూడాల్సిందే. ప్రస్తుతం Lionsgate Playలో హిందీ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేదు.

Read Also: బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓటీటీలోకి… ఎక్కడ చూడొచ్చంటే ?

Related News

ఆర్టిస్టులకు ‘గుడ్ లక్’ చెబితే ఇంత ఘోరమా ? ఈ నమ్మకం వెనకున్న అసలు స్టోరీనే ఈ మూవీ

హాస్పిటల్ లో ఉగ్రవాదుల ఉన్మాదం… పసిపిల్లల కోసం నర్సులు చేసిన సాహసం చూస్తే కన్నీళ్లాగవు

బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓటీటీలోకి… ఎక్కడ చూడొచ్చంటే ?

ఓటీటీలోకి రాబోతున్న ఉన్మాదం..తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సందడి.. ఆ రెండు మస్ట్ వాచ్..!

10 ఏళ్లలో 55 బదిలీలు… చివరికి ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా వదలని కానిస్టేబుల్ కథ

పైలెట్ కావాల్సిన కుర్రాడు రెడ్ లైట్ ఏరియాలో ప్రేమంటూ… ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే

Big Stories

Advertisement
×