BigTV English

OTT Movie : యాక్షన్ సినిమాలో పొట్ట చెక్కలయ్యే కామెడీ… కడుపుబ్బా నవ్వించే తమిళ స్పోర్ట్స్ డ్రామా

OTT Movie : యాక్షన్ సినిమాలో పొట్ట చెక్కలయ్యే కామెడీ… కడుపుబ్బా నవ్వించే తమిళ స్పోర్ట్స్ డ్రామా

OTT Movie : కామెడీ ఎంటర్టైన్మెంట్ తో వచ్చే సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఇటువంటి సినిమాలు ఫ్యామిలీతో కలసి చూసే విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. జపాన్ కి చెందిన తాషిరో అనే మల్ల యోధుడి చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

శివ (శివ సుందరం) అనే వ్యక్తి చెన్నై సముద్రతీరంలో ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తూ ఉంటాడు. ఒక రోజు ఉదయం అతను సముద్రతీరంలో స్పృహలేని ఒక విదేశీయుడిని (యోషినోరి తాషిరో) చూస్తాడు. ఈ వ్యక్తి ఒక జపనీస్ సుమో రెజ్లర్ గా ఉండేవాడని శివ తెలుసుకుంటాడు. తాషిరో సముద్రంలో కొట్టుకుపోవడం వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. వైద్య పరీక్షలో అతనికి 1.5 సంవత్సరాల పిల్లవాడి మానసిక స్థితి ఉన్నట్లు తెలుస్తుంది. శివ, తన స్నేహితులతో కలిసి, ఈ సుమో రెజ్లర్‌కు సహాయం చేయాలని అనుకుంటాడు. తాషిరో జపాన్‌కు చెందిన సుమో ఛాంపియన్ అని తెలుసుకున్న తర్వాత, అతని గత జీవితాన్ని గౌరవాన్ని తిరిగి పొందేందుకు శివ అతన్ని జపాన్‌కు తీసుకెళ్తాడు.


ఈ ప్రయాణంలో వాళ్ళు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. వీటిలో కొందరు తాషిరోను జపాన్‌కు తిరిగి వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించే ఒక గ్యాంగ్ కూడా ఉంటుంది. ఈ సినిమా మొదటి సగం కామెడీ, సరదా సన్నివేశాలతో నిండి ఉంటుంది.  అయితే రెండవ సగం ఎమోషన్స్ తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా జపాన్‌లోని సుమో రింగ్‌లో జరిగే చివరి ఫైట్ ఈ సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్తుంది. చివరికి తాషిరో సముద్ర తీరంలో కొట్టుకు రావడానికి గల కారణం ఏమిటి ? అతన్ని వెంబడిస్తున్న గ్యాంగ్ ఎవరు ? ఎందుకు వెంబడిస్తున్నారు ? అతనికి గతం ఎలా గుర్తుకి వస్తుంది. ఈ స్టోరీ చివరికి ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ తమిళ స్పోర్ట్స్ కామెడీ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : కొత్త ఇల్లు కొందామని వెళ్ళి అడ్డంగా బుక్కయ్యే జంట… పార్ట్స్ ప్యాక్ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్

 

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్ 

ఈ తమిళ స్పోర్ట్స్ కామెడీ సినిమా పేరు ‘సుమో’ (Sumo). 2025 లో వచ్చిన ఈ మూవీకి ఎస్.పీ. హోసిమిన్ దర్శకత్వం వహించారు. ఇందులో శివ, ప్రియా ఆనంద్, యోషినోరి తాషిరో, యోగి బాబు, వీటీవీ గణేష్, సతీష్ వంటి నటులు నటించారు. ఈ మూవీ 2025 మే 23 నుంచి Sun NXT, Amazon Prime Video, Tentkotta లలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×