Nindu Noorella Saavasam Serial Today Episode : అమర్ కాల్ కట్ చేశాక మిస్సమ్మ.. డాక్టర్ ఏం చెప్పారండి అని అడుగుతుంది. అంజును డీఎన్ఏ టెస్టుకు తీసుకెళ్లాడట అని అమర్ చెప్పగానే మిస్సమ్ షాక్ అవుతుంది. అసలు రణవీర్ అంజుకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించాల్సిన అవసరం ఏముంది..? అసలు ఏం జరగుతుంది అని మిస్సమ్మ అడుగుతుంది. దీంతో అమర్ తెలియదు భాగీ కానీ కచ్చితంగా ఇంట్లో జరుగుతున్న వాటికి రణవీర్‌కు సంబంధం ఉందనిపిస్తుంది అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ ఏవండి వెంటనే వెల్లి ఆ రణవీర్‌ను అడుగుదాం. ఇవాళ నిజం తెలుసుకుందాం పదండి అంటుంది.
దీంతో అమర్ వద్దు ఎదుటి వాడి గురించి పూర్తిగా తెలియకుండా ముందడుగు వేయడం తెలివైన పని కాదు. రణవీర్ గురించి పూర్తిగా తెలుసుకుని రమ్మని రాథోడ్ ను కోల్ కతా పంపించాను అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ ఏవండి రణవీర్ కోల్‌కతా నుంచి వచ్చాడు. మీరు అంజును కోల్ కతాలో దత్తత తీసుకున్నారు అంటే.. అని అనుమానం వ్యక్తం చేస్తుంటే.. అంజు కోసమే రణవీర్ వచ్చాడా..? అసలు రణవీర్‌కు అంజుకు ఏంటి సంబంధం అని అమర్ మనసులో అనుకుంటాడు. మిస్సమ్మ ఏవండి నాకు ఎందుకో భయంగా ఉందండి అంటుంది. దీంతో ఏం భయపడకు భాగీ నువ్వు నాతో రా.. ఒక ఇరవై నాలుగు గంటల్లో మొత్తం తెలుసుకుంటాను. అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను. మన అనుమానమే నిజమయ్యి రణవీరే అంజును కిడ్నాప్ చేయబోయాడని తెలిస్తే.. రణవీర్‌ను అసలు వదలను అని చెప్పి వెళ్లిపోతాడు అమర్.
మరోవైపు రణవీర్ లాయరు వచ్చి మీరు కలిసి లేరు కాబట్టి కోర్టుకు మనోహరి రాకపోయినా పర్వాలేదు. కానీ మీరు దుర్గ కచ్చితంగా రావాలి. అది కూడా రేపే రావాలి. గుర్తుంది కదా రణవీర్ ఇదే మనకు ఉన్న ఆఖరి ఆవకాశం. ఈసారి మిస్ అయితే ఆస్తి మొత్తం ట్రస్ట్ కు వెళ్లిపోతుంది అని చెప్పగానే.. రణవీర్ కోపంగా ఆస్తి నా చేయి జారిందంటే నా ప్రాణం పోయినట్టే లాయర్. ఎలాగైనా అంజలిని తీసుకెళ్లిపోవాలి అంటాడు. దీంతో మనోహరి కోపంగా ఏంటి అంజలిని తీసుకెళ్తావా..? ఎక్కడికి తీసుకెళ్తావు.. ఎలా తీసుకెళ్తావు. అమర్‌ను చూశావు కదా తన కూతురిని కిడ్నాప్ చేసిన వాళ్ల ప్రాణాలు తీయడానికి రెడీ అవుతున్నాడు.
అంజలి నిన్ను చూసిన విధానం చూస్తే కిడ్నాప్ చేసింది నువ్వేమోనని కనిపెట్టిందేమోనని భయంతో చస్తున్నాను. ఇలాంటి టైంలో నువ్వు అంజలిని తీసుకెళ్లడం అంటే ఎంత ప్రమాదమో తెలుసా..? అంటుంది. దీంతో రణవీర్ కోపంగా అంజలిని తీసుకెళ్లకపోయినా ప్రాణాలు పోతాయి మనోహరి. ఆస్థి నాకు ఎంత ముఖ్యమో నీకు తెలుసు కదా..? అంటాడు. దీంతో మనోహరి అంజలి ప్లేస్‌లో వేరే వాళ్లను తీసుకెళ్లలేమా..? అని అడుగుతుంది. దీంతో లాయరు కుదరదండి ఆల్ రెడీ అంజలికి చెందిన అన్ని డీటెయిల్స్ కోర్టు వారికి సబ్‌మిట్ చేశాం అని చెప్తాడు. దీతో మనోహరి అంజలిని కొద్ది రోజులు అమర్ బయటకు పంపించడు.
ఇంక నువ్వు ఆ ఇంట్లోకి వెళ్లి అంజలిని కిడ్నాప్ చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా మానేసుకో.. అది అసలు జరగదు అని చెప్తుంది. దీంతో రణవీర్ కోపంగా జరగాలి మనోహరి ఏదో ఒకటి నేనే చేయాలి. లాయరు రేపు పొద్దున్నే ప్లైట్‌కు నీకు, నాకు, అంజలికి టికెట్స్ బుక్ చేయ్.. మనం అంజలిని తీసుకుని కోల్‌కతా వెళ్తున్నాం అని చెప్పగానే.. లాయరు అలాగే చేస్తాను రణవీర్ అంటూ వెళ్లిపోతాడు. ఏం చేసినా బాగా ఆలోచించి చేయ్ రణవీర్. అమర్ దెబ్బ తిన్న ఆవేశంలో ఉన్నాడు. ఇప్పుడు కానీ అంజలి కిడ్నాప్ వెనక ఉన్నది నువ్వే అని తెలిస్తే మాత్రం నిన్ను ప్రాణాలతో వదలడు టైం అయింది నేను వెళ్తున్నాను అంటూ మనోహరి వెళ్లిపోతుంది.
హాల్లో కూర్చుని నిర్మల టీవీ చూస్తుంది. పక్కనే కూర్చున్న శివరాం మాత్రం మిస్సమ్మ, అంజు కిడ్నాప్ సంఘటనలు గుర్తు చేసుకుంటాడు. గుడిలో భాగీని చంపాలనుకున్నారు. ఈరోజు పిల్లలు అందరూ కలిసి సరదాగా గడపాలనుకుని బయటికి వెళ్తే అక్కడ అంజలిని కిడ్నాప్ చేయబోయారు. అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటాడు. ఎందుకు జరుగుతుందో మాత్రం నాకు తెలుసండి అంటుంది నిర్మల. తెలుసా..? ఎందుకు జరుగుతుంది అని శివరాం అడుగుతాడు.
అరుందతి చనిపోయి మనం ఆ అస్థికలను నదిలో కలపలేదు. స్వామిజీ చెప్పారు కదండి అస్థికలు నదిలో కలపకపోతే అరిష్టం జరుగుతుందని.. నాకెందుకో ఇదంతా ఆ అరిష్టం వల్లనే జరుగుతుందని అనిపిస్తుందండి అంటుంది. దీంతో శివరాం నువ్వు చెప్తుంటే నాకు అది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడే అమర్, భాగీని పిలచి మాట్లాడదాం అని ఇద్దరిని పిలిచి విషయం చెప్తారు. దీంతో అమర్ ఇదంతా జరగడానికి ఆస్థికలు కాదు నాన్నా ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు. వాళ్లెవరో కనిపెడితేనే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి అంటాడు అమర్.
తర్వాత పిల్లలో కలిసి అనామిక రూంలో ఆడుకుంటుంటే మంచం కింద అనామికి ఆరు ఫోటో దొరుకుతుంది. అరే ఫోటో ఎవరిది ఇది అంటూ తెలియనట్టు అనామిక పిల్లలను అడుగుతుంది. అమ్ము ఆ ఫోటో తీసుకుని చూసి ఇది మా అమ్మ ఫోటో నిన్న మిస్సమ్మకు చూపిద్దామని వెతికితే దొరకనే లేదు. ఇప్పుడే వెళ్లి మిస్సమ్మకు అమ్మ ఫోటో చూపిస్తాను అంటుంది అమ్ము. దీంతో అనామిక మిస్సమ్మకు మీ అమ్మ ఫోటో చూపించడం ఏంటి అని అడుగుతుంది.
అమ్మ ఫోటో మిస్సమ్మ ఎప్పుడూ సరిగ్గా చూడలేదట అందుకే అడిగింది. ఇప్పుడే చూపిస్తాను అంటూ అమ్ము బయటకు వెళ్తుంది. ఇంతలో అనామిక అంతా గుర్తుకు వచ్చి అయ్యో ఇప్పుడు మిస్సమ్మ ఆ ఫోటో చూస్తే నిజం తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా అని కంగారు పడుతుంది. కింద లాన్ లో ఉన్న మిస్సమ్మను డోర్ దగ్గర నుంచి అమ్ము పిలుస్తూ మిస్సమ్మ అమ్మ ఫోటో దొరికింది అని చెప్తుంది. మిస్సమ్మ వెంటనే హ్యాపీగా అమ్ము వైపు పరుగెత్తుకు వస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?