Action Crime Thriller on OTT: ఒక చిన్న టౌన్‌కు ప్రశాంతమైన జీవితం కోసం వచ్చిన షెరీఫ్‌కు… అక్కడి బ్యాంక్‌లో జరిగిన జరిగిన ఓ చిన్న దోపిడీ వెనుక భారీ క్రైమ్ నెట్‌వర్క్ ఉందని తెలిస్తే? ఊరంతా మంచివాళ్లలా కనిపిస్తున్నా… ఒక్కొక్కరి వెనుక ఒక్కో రహస్యం ఉంటే? చివరకు ఆ షెరీఫ్‌ను చంపేందుకు ఊరంతా ఒక్కటైపోతే? తనను తాను కాపాడుకోవడమే కాదు… ఆ ఊరి అసలు ముఖాన్ని బయటపెట్టేందుకు అతను చేసే పోరాటం ఎలా ఉంటుంది? ‘జాన్ విక్’, ‘నోబడీ’ తరహా యాక్షన్ టచ్‌తో తెరకెక్కిన హాలీవుడ్ యాక్షన్-కామెడీ క్రైమ్ డ్రామా ‘నార్మల్’ (Normal 2026). మరి ఈ సినిమా కథేంటి? ఏ ఓటీటీలో చూడవచ్చు? తెలుగులో ఉందా? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
యులిసెస్ ఓ పోలీస్ ఆఫీసర్. ఎన్నో ఏళ్లుగా డ్యూటీలో ఎదురైన కఠినమైన పరిస్థితులు, కొన్ని చేదు సంఘటనలు, వాటి కారణంగా జరిగిన గాయాలు అతడిని మానసికంగా బాగా అలసిపోయేలా చేస్తాయి. వ్యక్తిగత జీవితంలోనూ వైవాహిక సమస్యలు ఎదురవుతుండటంతో… తనకు కాస్త ప్రశాంతత కావాలని భావిస్తాడు. అందుకే మిన్నెసోటాలోని ‘నార్మల్’ అనే చిన్న పట్టణానికి తాత్కాలిక షెరీఫ్‌గా బదిలీపై వస్తాడు.
పట్టణం పేరు ‘నార్మల్’. చుట్టూ చూస్తే కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రశాంతమైన వీధులు, పెద్దగా నేరాలు లేని వాతావరణం… యులిసెస్‌కు కావాల్సిన ప్రశాంతమైన జీవితం ఇక్కడ దొరికేసిందని అనిపిస్తుంది. తన గతాన్ని పక్కన పెట్టి కొత్తగా జీవితం మొదలు పెట్టవచ్చని అనుకుంటాడు. కానీ ఈ నిశ్శబ్దం ఎంతోకాలం ఉండదు. ఒకరోజు పట్టణంలోని బ్యాంక్‌లో జరిగిన ఓ దోపిడీ యులిసెస్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. సాధారణంగా కనిపించే ఈ బ్యాంక్ రాబరీ వెనుక ఏదో పెద్ద విషయం ఉందని అతడికి అనుమానం వస్తుంది. కేసును పరిశీలిస్తున్న కొద్దీ… బయటకు కనిపించే దానికంటే ఈ పట్టణం చాలా ఉందని అర్థమవుతుంది.
యులిసెస్‌కు ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు తెలుస్తుంటాయి. పట్టణంలోని కొంతమంది ముఖ్య వ్యక్తులు, స్థానిక పోలీసులు, రాజకీయ నాయకులు… ఇలా చాలామందికి ఒక అంతర్జాతీయ క్రైమ్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడుతుంది. ఆయుధాలు, డ్రగ్స్, దొంగిలించిన డబ్బు… ఇలా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఎన్నో ఏళ్లుగా ఈ ప్రశాంతమైన పట్టణం ముసుగులో జరుగుతున్నాయని అతడికి అర్థమవుతుంది. ఈ వ్యవహారం వెనుక యాకూజా నెట్‌వర్క్ కూడా ఉందని తెలిసినప్పుడు యులిసెస్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే అతడు ఇప్పుడు కేవలం ఓ బ్యాంక్ దోపిడీ కేసును దర్యాప్తు చేయడం లేదు. ఊరి మొత్తం వ్యవస్థనే కదిలించేంత పెద్ద నేర సామ్రాజ్యాన్ని తవ్వి బయటకు తీస్తాడు.
మేయర్ కిబ్నర్ వింక్లర్) కూడా ఈ వ్యవహారంలో భాగమేనని యులిసెస్‌కు అనుమానం బలపడుతుంది. తాను నమ్మిన వ్యక్తుల్లోనే కొందరు ఈ నేర వ్యవస్థకు సహకరిస్తున్నారని తెలుసుకున్న తర్వాత… అతడు ఎవరిని నమ్మాలో కూడా తెలియని పరిస్థితిలో పడిపోతాడు. ఒక చిన్న పట్టణంలో నిజాయితీగా పనిచేయాలనుకున్న షెరీఫ్‌కు… ఇప్పుడు ప్రతి అడుగు ప్రమాదమే. యులిసెస్ దర్యాప్తు ఆపకపోవడంతో అతడి గురించి క్రైమ్ నెట్‌వర్క్‌కు కూడా సమాచారం చేరుతుంది. విషయం బయటకు రావడం తమకు ప్రమాదమని గ్రహించిన పట్టణంలోని నేరస్థులు… అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంటారు. ప్రశాంతంగా కనిపించిన ‘నార్మల్’ పట్టణం ఒక్క రాత్రిలోనే యులిసెస్‌కు యుద్ధభూమిగా మారిపోతుంది.
చుట్టూ శత్రువులు. నమ్మడానికి మనుషులు లేరు. పోలీస్ వ్యవస్థలో కూడా ఎవరు తనవాళ్లో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో యులిసెస్‌కు బార్టెండర్ మొయిరా, కొందరు చిన్న స్థాయి నేరస్థుల నుంచి అనూహ్యమైన సహాయం లభిస్తుంది. వాళ్ల సాయంతో ఆ రాత్రి తనను చంపేందుకు వచ్చిన గ్యాంగ్‌లను ఎదుర్కొంటూ… తనపై ఉన్న ముప్పు నుంచి బయట పడేందుకు యులిసెస్ చేసే పోరాటమే సినిమాను యాక్షన్ వైపు తీసుకెళ్తుంది. అసలు ఆ బ్యాంక్ దోపిడీ వెనుక ఎంత పెద్ద నెట్‌వర్క్ ఉంది ? ‘నార్మల్’గా కనిపించే ఆ పట్టణం ఎప్పటి నుంచి క్రైమ్‌కు అడ్డాగా మారింది ? యులిసెస్‌ను చంపేందుకు వచ్చిన వారిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు ? చివరకు ఆ పట్టణంలోని నేర సామ్రాజ్యాన్ని అతడు బయటపెట్టగలిగాడా ? అనేదే ‘నార్మల్’లో చూడాల్సిన స్టోరీ.
బాబ్ ఓడెన్‌కిర్క్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో లీనా హెడే (Game of Thrones ఫేమ్), హెన్రీ వింక్లర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. బెన్ వీట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి John Wick, Nobody చిత్రాల సృష్టికర్త డెరెక్ కోల్‌స్టాడ్ కథ అందించారు. దీంతో యాక్షన్‌తో పాటు క్రైమ్, డార్క్ కామెడీ, సస్పెన్స్ అంశాలు కూడా సినిమాలో కనిపిస్తాయి. థియేటర్లలో విడుదలైన ‘నార్మల్’ చిత్రం ఆగస్టు 14 నుంచి HBO Max ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాను ఇంగ్లీష్ లో చూడవచ్చు. తెలుగు డబ్బింగ్ లేదు. చిన్న టౌన్, పెద్ద క్రైమ్ నెట్‌వర్క్, ఒంటరిగా పోరాడే పోలీస్ అనే కాన్సెప్ట్‌తో పాటు యాక్షన్ సీన్స్, డార్క్ హ్యూమర్ నచ్చేవాళ్లు ‘నార్మల్’ను ఓటీటీలో ఒకసారి ట్రై చేయొచ్చు.
Read Also: చావుతో దాగుడుమూతలు ఆడే ఫ్రెండ్స్… కింద పడితే గేమ్ ఓవర్… ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అడ్వెంచర్