E-Paper
Advertisement

చావుతో దాగుడుమూతలు ఆడే ఫ్రెండ్స్… కింద పడితే గేమ్ ఓవర్… ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అడ్వెంచర్

చావుతో దాగుడుమూతలు ఆడే ఫ్రెండ్స్… కింద పడితే గేమ్ ఓవర్… ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అడ్వెంచర్
Advertisement

Adventure Movie: పర్వతాలు… ఆకాశం… గాల్లో పక్షిలా ఎగరాలనే పిచ్చి… ప్రాణాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సాహస క్రీడల్లో ఒకటైన వింగ్‌సూట్ బేస్ జంపింగ్‌ను ఎంచుకున్న కొందరు యువకుల కథే ‘టు ది మాక్స్’ (To The Max). రియల్ లైఫ్ అడ్వెంచర్ నుంచి స్ఫూర్తి పొందిన ఈ సినిమా, అడ్వెంచర్‌తో పాటు స్నేహం, ప్రేమ, నష్టం, భయం, మళ్లీ నిలబడే ధైర్యాన్ని కూడా చూపిస్తుంది. మరి ఇంతకీ సినిమా స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనేది వివరంగా తెలుసుకుందాం పదండి.

 

కథలోకి వెళ్తే…

Advertisement

కార్లోస్ సువారెజ్‌కు చిన్నప్పటి నుంచే కొండలు, క్లైంబింగ్ అంటే ఎంతో ఇష్టం. కానీ ఒక దశలో తనకు తెలిసిన ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చి మరింత ఉత్కంఠభరితమైన అనుభవం కోసం వెతుకుతుంటాడు. అదే సమయంలో అర్మాండో డెల్ రే, డారియో బారియో, అల్వారో బుల్టో వంటి సాహసికులు అతని జీవితంలోకి వస్తారు. వాళ్లు సాధారణంగా కొండలు ఎక్కేవాళ్లు కాదు. ప్రత్యేకమైన వింగ్‌సూట్‌లు ధరించి, భారీ పర్వతాలపై నుంచి దూకి గాల్లో వేగంగా ప్రయాణించే ప్రమాదకరమైన బేస్ జంపింగ్‌లో నిపుణులు.

మొదట ఈ క్రీడను చూసిన కార్లోస్‌కు భయం కలుగుతుంది. కానీ అదే సమయంలో ఆకాశంలో ఎగిరే అనుభూతి అతన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. కొంతకాలానికే అతను కూడా వాళ్ల బృందంలో చేరి శిక్షణ తీసుకోవడం మొదలుపెడతాడు. ఒకసారి ఆకాశంలోకి దూకిన తర్వాత కలిగే అడ్రినలిన్ అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక సాధారణ జీవితం అతనికి బోర్‌గా అనిపిస్తుంది. మరింత ఎత్తైన కొండలు, మరింత వేగం, ప్రమాదకరమైన జంప్‌లు… ఇదే వారి జీవితంగా మారుతుంది.

Advertisement

స్పెయిన్ నుంచి స్విట్జర్లాండ్ వరకు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో వాళ్లు సాహసాలు చేస్తుంటారు. ప్రతి జంప్ తర్వాత తాము సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ వాళ్లకు తెలియని నిజం ఒక్కటే… ఈ ఆటలో రెండో అవకాశం ఉండదు. ఒక చిన్న పొరపాటు… గాలి వేగంలో స్వల్ప మార్పు… టైమింగ్‌లో కొన్ని సెకన్ల తేడా చాలు, ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. అలాంటి ప్రమాదాల్లో కార్లోస్‌కు అత్యంత సన్నిహితులైన స్నేహితులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతారు. అల్వారో బుల్టో, డారియో బారియో, మనోలో చానా మరణాలు కార్లోస్‌ను తీవ్రంగా కుదిపేస్తాయి.

ఇంతమంది స్నేహితులను కళ్లముందే కోల్పోయిన తర్వాత కూడా కార్లోస్ ఆ ప్రపంచం నుంచి పూర్తిగా బయటపడలేకపోతాడు. అతని ప్రేయసి మైరియమ్ మాత్రం ఈ ప్రమాదకరమైన జీవితాన్ని ఇక చాలించమని కోరుతుంది. ఆమెకు కార్లోస్ అంటే ప్రేమ. కానీ ప్రతి సారి అతను ఆకాశంలోకి దూకుతున్నప్పుడు తిరిగి వస్తాడో లేదో అనే భయం ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. ఒకవైపు స్నేహితులను కోల్పోయిన బాధ… మరోవైపు వాళ్లతో కలిసి పంచుకున్న కలలను వదులుకోలేని పరిస్థితి… ఈ రెండింటి మధ్య కార్లోస్ తీవ్ర మానసిక సంఘర్షణలో చిక్కుకుంటాడు. అతను ఎదుర్కొంటున్నది కేవలం బయట ఉన్న ప్రమాదం కాదు. తనలో ఉన్న భయాన్ని, నేరభావాన్ని, స్నేహితుల జ్ఞాపకాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

చివరికి తన స్నేహితులకు నిజమైన నివాళి అర్పించాలంటే, వాళ్లతో కలిసి తాను ప్రేమించిన ఆకాశంలోకి మరోసారి వెళ్లాలని కార్లోస్ నిర్ణయించుకుంటాడు. కానీ ఈసారి అది మరో రికార్డు కోసం చేసే జంప్ కాదు. తనను తాను తిరిగి కనుగొనడానికి, తన స్నేహితుల జ్ఞాపకాలను గౌరవించడానికి చేసే ప్రయాణం. అలా కార్లోస్ మరోసారి వింగ్‌సూట్ ధరిస్తాడు. అతని ముందు కనిపించేది అంతులేని ఆకాశం… వెనుక మిగిలింది స్నేహితుల జ్ఞాపకాలు.. ఇక ముందున్నది ప్రాణాంతకమైన ఒక చివరి సాహసం. ఆ చివరి జంప్‌లో కార్లోస్ తన భయాన్ని జయించాడా ? అతని ప్రయాణం ఎక్కడ ముగిసింది ? అనేదే సినిమా భావోద్వేగభరితమైన ముగింపు.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

‘టు ది మాక్స్’లో యాక్షన్ కంటే ఎక్కువగా కనిపించేది స్నేహితులను కోల్పోయిన తర్వాత ఒక మనిషి ఎదుర్కొనే భావోద్వేగ పోరాటం. నిజ జీవిత వింగ్‌సూట్ బేస్ జంపర్ల కథల నుంచి స్ఫూర్తి పొందడం వల్ల సినిమా అడ్వెంచర్ సీన్లకు మరింత వెయిట్ వస్తుంది. ముఖ్యంగా పర్వతాల మధ్య వింగ్‌సూట్‌తో చేసే జంప్‌లను చూపించిన విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అన్నింటికంటే విషాదకరమైన విషయం ఏమిటంటే… ఈ సినిమాకు స్టంట్ కోఆర్డినేటర్‌గా పని చేసిన నిజ జీవిత సాహసికుడు కార్లోస్ సువారెజ్ కూడా 2025లో షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించాడు. దీంతో ఈ సినిమా ఒక అడ్వెంచర్ డ్రామాగా మాత్రమే కాకుండా, నిజమైన సాహసికులకు ఒక నివాళిగా కూడా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా Netflixలో అందుబాటులో ఉంది.

Read Also: పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుల జీవితం… కానీ ఈ అమ్మాయి చేసిన పని తెలిస్తే దిమాక్ కరాబ్

Tags

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×