E-Paper
Advertisement

Action Thriller OTT: కొడుకు కిడ్నాప్ తో తల్లడిల్లే తల్లి… ఇరగదీసే హాలీ బెర్రీ యాక్షన్

Action Thriller OTT: కొడుకు కిడ్నాప్ తో తల్లడిల్లే తల్లి… ఇరగదీసే హాలీ బెర్రీ యాక్షన్
Advertisement

Action Thriller OTT : సస్పెన్స్ తో సాగే ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూసేయండి. ఈ సినిమాలో హాలీవుడ్ నటి హాలీ బెర్రీ యాక్టింగ్ ఇరగదీసింది కూడా. ఒక కిడ్నాప్ చుట్టూ సాగే ఈ కథలో చేసింగ్ సీన్స్ అబ్బురపరుస్తాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2017లో వచ్చిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘కిడ్నాప్’ (Kidnap). లూయిస్ ప్రిటో దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటి హాలీ బెర్రీ లీడ్ రోల్ లో నటించింది. ఆమె స్వయంగా ఈ సినిమాకు ఒక నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాను సుమారు $21 మిలియన్ల (భారత కరెన్సీలో దాదాపు ₹170 కోట్లు) బడ్జెట్‌తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సుమారు $35 మిలియన్ల వసూళ్లను సాధించింది. కిడ్నాప్ నేపథ్యంలో హాలీ బెర్రీ నటించిన రెండో సినిమా ఇది. దీనికంటే ముందు ఆమె ‘ది కాల్’ (The Call) అనే కిడ్నాప్ థ్రిల్లర్‌లో నటించారు. 95 నిమిషాలు నిడివి ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక సాదాసీదా మిడిల్ క్లాస్ తల్లి అయిన కార్లా (హాలీ బెర్రీ), తన కొడుకుతో కలిసి సరదాగా ఒక పార్కుకి వెళ్తుంది. అక్కడ కాసేపు ఫోన్ కాల్ మాట్లాడుతుంటే, ఎవరో ఆగంతకులు కన్నుగప్పి ఆ పిల్లాడిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోతారు. అది చూసిన కార్లా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. వెంటనే గట్టిగా అరిచి చుట్టుపక్కల వాళ్లని అడిగే లోపే ఆ కిడ్నాపర్లు కారును స్పీడ్‌గా తీసేస్తారు. పోలీసుల కోసం వెయిట్ చేస్తే టైం వేస్ట్ అవుతుందని కార్లా అనుకుంటుంది. తన దగ్గర ఫోన్ కూడా లేకపోవడంతో, వెంటనే తన కారు స్టార్ట్ చేసి ఆ కిడ్నాపర్ల కారు వెనకాలే పడుతుంది.

ఇక రోడ్ల మీద, హైవేల మీద ప్రాణాలకు తెగించి ఆ కారును వెంటాడుతుంది. మధ్యలో పెట్రోల్ అయిపోవడం, టైర్లు పగిలిపోవడం లాంటి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్లను వదలదు. చివరికి ఆ కిడ్నాపర్లు ఒక ఊరి బయట ఉన్న పాడుబడిన ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్లు ఒక పెద్ద కిడ్నాప్ ముఠా అని, పిల్లలను అమ్ముతుంటారని కార్లాకు అర్థమవుతుంది. ఒంటరిగా ఉన్నా సరే, భయం వదిలేసి ఒక ఆ కిడ్నాపర్లతో ఆమె తలపడుతుంది. చివరికి కార్లా తన కొడుకును కాపాడుకుందా ? కిడ్నాపర్ల చేతిలో బలవుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : 30 సంవత్సరాల తరువాత ఓటీటీలోకి హాలీవుడ్ హిట్ మూవీ సీక్వెల్‌… ఫ్యామిలీ ఎమోషన్స్ తో

Related News

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×