E-Paper
Advertisement

ఓటీటీలో ఇరగదీస్తున్న యాక్షన్ సినిమాలు… ఒక్కో సీన్ మెంటల్ మాస్

ఓటీటీలో ఇరగదీస్తున్న యాక్షన్ సినిమాలు… ఒక్కో సీన్ మెంటల్ మాస్

Action Thriller Movies on OTT : ఓటీటీలో అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ సినిమాల కోసం వెతుకుతున్నారా? అయితే ఈ లిస్ట్ మీకోసమే. కేవలం ఫైట్లు మాత్రమే కాదు, ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో ఈ సినిమాలు మిమ్మల్ని మెంటల్ ఎక్కించేస్తాయి. అలాంటి టాప్ 5 సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

1. కిల్ (Kill – 2024)

ఈ సినిమా పేరుకు తగ్గట్టే థియేటర్లలో రచ్చ లేపింది. ఇప్పుడిది జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఒక ట్రైన్ జర్నీలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో హింస ఏ రేంజ్‌లో ఉంటుందో మాటల్లో చెప్పలేం. మనిషిని నరికే విధానం, క్లోజ్ కాంబాట్ సీన్స్ చూస్తుంటే ఊపిరి ఆగిపోయినంత పని అవుతుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ వైలెంట్ మూవీస్ ఒకటిగా నిలిచిన ఈ సినిమాను అస్సలు మిస్ కావద్దు.

2. రెబెల్ రిడ్జ్ (Rebel Ridge – 2024)

పెద్దగా ప్రచారం లేకుండా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఒక మాజీ మెరైన్ ఆఫీసర్ తన తమ్ముడిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఇందులో హీరో చేసే యాక్షన్ సీన్స్ చాలా లాజికల్‌గా, ప్రాక్టికల్‌గా ఉంటాయి. అనవసరమైన బిల్డప్‌లు లేకుండా రియలిస్టిక్ గా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ.

3. జాన్ విక్: చాప్టర్ 4 (John Wick: Chapter 4 – 2024)

యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ ‘జాన్ విక్’ ను చెప్పుకోవచ్చు. కీను రీవ్స్ హీరోగా వచ్చిన ఈ నాలుగో పార్ట్ యాక్షన్ ప్రియులకు పూనకాలు తెప్పిస్తుంది. ఇందులో పారిస్ రోడ్ల మీద ట్రాఫిక్ మధ్యలో జరిగే ఫైట్ సీన్, ఆ తర్వాత మెట్ల మీద చేసే పోరాటం సినిమాకే హైలైట్. ఇందులో గన్ ఫైట్స్, స్టంట్స్ చూస్తుంటే ప్రతి సీన్ ఒక మాస్టర్ పీస్‌లా అనిపిస్తుంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో అందుబాటులో ఉంది.

4. టాప్ గన్: మావెరిక్ (Top Gun: Maverick – 2023)

టామ్ క్రూజ్ అంటేనే బ్రాండ్ అని చెప్పచ్చు. 60 ఏళ్ల వయసులో కూడా ఆయన చేసిన రియల్ ఎయిర్ స్టంట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఇక ఈ సినిమాలో గాలిలో ఫైటర్ జెట్స్ మధ్య జరిగే పోరాటాలు, ఆ విజువల్స్ చూస్తుంటే మనమే విమానంలో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇదొక క్లాసిక్ యాక్షన్ ఎంటర్టైనర్. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

5. మిషన్: ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ (Mission: Impossible – Dead Reckoning – 2023)

టామ్ క్రూజ్ఈ సినిమాలో కూడా యాక్షన్ ఇరగదీశాడు. ఇందులో కొండ పైనుంచి బైక్‌తో దూకే సీన్ చూస్తే గుండె జారిపోయినంత పని అవుతుంది. హైటెక్ విలన్, అద్భుతమైన ఛేజింగ్ సీన్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్‌లో నిలబెట్టాయి. యాక్షన్ సినిమాల్లో దీనిని టెక్నికల్ వండర్ అని చెప్పొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఇది అందుబాటులో ఉంది.

Read Also : పరాయి స్త్రీ కోసం పరితపించే రక్త పిశాచి… వణుకు పుట్టిస్తున్న వింత స్టోరీ

Tags

Related News

Friday OTT Releases : ఓటీటీ లవర్స్ కు పండగే.. శుక్రవారం ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్..!

జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ కొరియన్ డ్రామాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

Big Stories

×