Survival Action Thriller : ఒక అదిరిపోయే సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇది థియేటర్లకు వెళ్ళకుండా నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఒక అడవిలో క్రూరమైన వేటగాడి చేతికి చిక్కిన హీరోయిన్, తన ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ కథ. ఇందులో హీరోయిన్ రాక్ క్లైంబర్ కావడంతో, ఎత్తైన కొండల మీద ఆమె చేసే సాహసాలు, విలన్ నుండి తప్పించుకోవడానికి పడే తాపత్రయం మనల్ని సీట్ ఎడ్జ్ కు తెసుకెళ్ళేలా ఉంటాయి. థ్రిల్లర్ ఫ్యాన్స్ అస్సలు మిస్ కాకూడాని సినిమా. దీని పేరు ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? అనే వివరాల్లోకి వెళ్తే..
ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘అపెక్స్’ (Apex). ప్రముఖ దర్శకుడు బాల్టాసర్ కోర్మాకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ షార్లిజ్ థెరాన్, టారన్ ఎగర్టన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు ఎరిక్ బానా కూడా కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా 2026 ఏప్రిల్ 24న నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో విడుదల కానుంది. ఆస్ట్రేలియాలోని బ్లూ మౌంటైన్స్ వంటి అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరించబడిన ఈ సినిమా, కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా మనిషిలోని పోరాట పటిమను చూపిస్తుంది. షార్లిజ్ థెరాన్ తన పాత్ర కోసం అత్యంత కఠినమైన సాహశాలను, తానే స్వయంగా చేయడం ఈ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
సాషా (షార్లిజ్ థెరాన్) అనే ఒక రాక్ క్లైంబర్, తన జీవితంలోని ఒక విషాదం నుండి బయటపడటానికి ఆస్ట్రేలియాలోని మారుమూల వాండరా నేషనల్ పార్క్‌కు వెళ్తుంది. అక్కడ ఆమెకు బెన్ (టారన్ ఎగర్టన్) అనే ఒక క్రూరమైన సైకో కిల్లర్ ఎదురవుతాడు. అతను కేవలం వినోదం కోసం మనుషులను చంపే స్వభావం ఉన్నోడు. అదికూడా వేటాడుతూ చంపడం అంటే అతనికి చాలా ఆనందంగా ఉంటుంది. చుట్టుపక్కల మనుషులు కూడా ఉండని ఆ ప్రాంతంలో, బెన్ నుండి ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక భీకర పోరాటమే చేస్తుంది. చివరికి ఆమె ఆ సైకో కిల్లర్ నుంచి ప్రాణాలతో బయట పడుతుందా ? ఆ సైకో కి బలి అవుతుందా ? అనే విషయాలను, ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : బెడ్‌రూమ్ వరకు చేరిన ఆఫీస్ పరిచయం… తప్పు అని తెలిసినా తప్పని తిప్పలు