E-Paper
Advertisement

Flight Ticket Booking: ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఆ టైమ్ లో భారీ తగ్గింపు లభిస్తుంది తెలుసా?

Flight  Ticket Booking: ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఆ టైమ్ లో భారీ తగ్గింపు లభిస్తుంది తెలుసా?
Advertisement

Flight  Ticket Booking Tips: విమాన టికెట్ల ధరలు సాధారణంగా డైనమిక్ గా మారుతుంటాయి. అంటే, డిమాండ్ కు అనుగుణంగా టికెట్ల ధర పెంపు ఉంటుంది. ఎయిర్లైన్స్ డిమాండ్, సీట్ల లభ్యత ఆధారంగా ధరలు మారుతుంటాయి. అయితే, తక్కువ ధరలకు టికెట్లు పొందాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి టైమింగ్. తక్కువ బుకింగ్ ఉండే సమయంలో టికెట్లు బుక్ చేయడం వల్ల చీప్ గా దొరికే అవకాశం ఉంటుందంటారు నిపుణులు. ఇంతకీ తక్కువ ధరకు టికెట్లు బుక్ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ధరలు నిజంగానే రోజూ మారుతాయా?

నిజానికి విమాన టికెట్ ధరలు తరచుగా మారుతుంటాయి. కొన్నిసార్లు రోజుకు చాలాసార్లు మారుతుంటాయి. ఒకే విమానానికి ఉదయం, రాత్రి, మధ్యాహ్నం ఒక్కో ధర ఉంటుంది. అయితే రాత్రి సమయంలో టికెట్ల బుకింగ్ ధరలు కాస్త తగ్గుతాయంటున్నారు నిపుణులు. లేట్ నైట్. ఎర్లీ మార్నింగ్ సమయంలో కాస్త ధరలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తెల్లవారుజామన 2 నుంచి 2.30 గంట మధ్య తక్కువ ధరలు టికెట్లు లభించే అవకాశం ఉందంటున్నారు. అయితే, ఈ రూల్ అన్ని రూట్లకు వర్తించదు.

నివేదికలు ఏం చెప్తున్నాయంటే?

Advertisement

సాధారణంగా రాత్రి పూట టికెట్ల బుకింగ్ కు సంబంధించి తక్కువ ధరలు చూపిస్తాయి. సుమారు సగటున 6 % తగ్గింపు లభించే అవకాశం ఉంటుంది. Skyscanner లాంటి వెబ్‌ సైట్ల డేటా ప్రకారం రాత్రి 9  గంటల నుంచి 12 గంటల మధ్య బుకింగ్ లో ఎక్కువగా ధరలు తగ్గినట్లుగా వెల్లడించాయి. ఇంకా రెండు గంటల సమయంలో మరికాస్త తగ్గినట్లు తెలిపాయి.

ముందుగానే బుక్ చేస్తే తక్కువ ధరకే టికెట్లు!  

వాస్తవానికి విమాన టికెట్ల ధరలు సాధారణంగా ట్రావెల్ తేదీకి దగ్గరవుతున్న కొద్దీ పెరుగుతాయి. దేశీయ టికెట్లు ప్రయాణానికి నెల నుంచి మూడు నెలల ముందుగానే టికెట్లు బుక్ చేయడం వల్ల తక్కువ ధరకే టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ టికెట్లు కోసం 90 రోజుల నుంచి 180 రోజులు ముందు బుక్ చేసుకోవడం మంచిది.

Advertisement

Read Also: IRCTC దుబాయ్ టూర్, తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేయండి గురూ!

వారంలో ఏ రోజు టికెట్ల ధరలు తక్కువగా ఉంటాయంటే?

వారంలో సాధారణంగా మంగళవారం, బుధవారం నాడు విమాన టికెట్ల ధరలు కాస్త తక్కువగా ఉంటాయని ట్రావెల్ అనాలిసిస్‌లు వెల్లడిస్తున్నాయి. శుక్రవారం, ఆదివారం విమాన టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే, ఫేర్ అలర్ట్స్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ధరలు ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి. తక్కువ ధరలో లభించే సమయంలో బుక్ చేసుకోవాలి. కూపన్స్, డిస్కౌంట్స్ కూడా తక్కువ ధరలకు టికెట్లు పొందేలా చేస్తాయి. కుకీస్ ఆధారంగా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు కుకీస్ క్లియర్ చేయాలి. వీలైనంత వరకు ప్రయాణానికి సుమారు నెల రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల తక్కువ ధరకు విమాన టికెట్లు పొందవచ్చు.

Read Also: సంక్రాంతి వేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్తున్నారా? అయితే, మీకో అలర్ట్!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×