Non Monogamy Trend: ఒక చిన్న పట్టణం.. జనాభా కేవలం 2 లక్షలు. ఇంతవరకు ఇది పట్టు చీరలతోనే పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఒక వింత కారణంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైలను కూడా దాటేసి టాప్ ట్రెండ్ అవుతున్న ఈ పట్టణం వెనుక రహస్యమేంటి? అసలు విషయం తెలుసుకుంటే.. ఔరా అనేస్తారు.
తమిళనాడులోని కాంచీపురం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది పట్టుచీరలే. కానీ ఇప్పుడు ఈ చిన్న పట్టణం మరో కారణంతో దేశవ్యాప్తంగా చర్చకు వస్తోంది. కేవలం 2 లక్షల జనాభా కలిగిన ఈ పట్టణం, భారతదేశంలోనే నాన్-మోనోగమీ అంటే ఒకే వ్యక్తితో కాకుండా ఇతర వ్యక్తులతో కూడా సంబంధాలను కలిగి ఉండటంలో హాట్‌స్పాట్‌గా మారిందట. ఇది సాధారణ గాలి వార్త కాదు, ప్రపంచ ప్రసిద్ధ డేటింగ్ యాప్ Ashley Madison జూన్ 2025 రిపోర్ట్ చెబుతున్న మాట.
❄ మెట్రో నగరాలకన్నా కాంచీపురం టాప్!
ఇప్పటివరకు ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలే ఈ తరహా యాప్‌లలో యాక్టివ్‌గా ఉంటాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మొత్తం తలకిందులైపోయింది. Ashley Madison డేటా ప్రకారం, రెండవ, మూడవ స్థాయి నగరాలు మెట్రోలను మించి రికార్డు సాధిస్తున్నాయి. గతేడాది కాంచీపురం 17వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది నేరుగా 1వ స్థానానికి దూసుకుపోయింది. దీనికి కారణం ఏమిటో ఆ యాప్ కూడా స్పష్టంగా చెప్పలేకపోయింది.
❄ భారతదేశం – బ్రెజిల్ పోటీ!
ఏప్రిల్‌లో YouGov సర్వేలోనూ షాకింగ్ ఫలితాలే వచ్చాయి. ఇండియా, బ్రెజిల్ దేశాలు అఫైర్స్ విషయంలో టాప్ అని ఆ సర్వే చెబుతోంది. దాదాపు సగం మందికిపైగా సర్వేలో పాల్గొన్నవారు తమకు ఎప్పుడో ఒకసారి ఎక్స్‌ట్రా రిలేషన్ ఉందని అంగీకరించారు. Ashley Madison చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పాల్ కీబుల్ మాట్లాడుతూ.. ఇది ఆధునిక సంబంధాల దిశలో ఒక మార్పు. ఇండియాలో నాన్-మోనోగమీకి అంగీకారం పెరుగుతోందన్నారు.
❄ ముంబై టాప్ 20లో లేదు!
అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ముంబై లాంటి మహానగరం ఈ జాబితాలోనే లేదు. కానీ ఘజియాబాద్, జైపూర్, రాయగఢ్, కమ్రూప్, చండీగఢ్ లాంటి నగరాలు ఈ లిస్టులో ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ – ఎన్సీఆర్ నుంచి 9 నగరాలు టాప్ 20లో చోటు దక్కించుకున్నాయి. అంటే మెట్రో లైఫ్ కంటే ఇప్పుడు చిన్న పట్టణాల్లో నాన్ – మోనోగమీ యాక్టివిటీ ఎక్కువగా ఉందన్న మాట.
❄కాంచీపురం రికార్డు వెనక అసలు కారణం?
కాంచీపురం ఎందుకు ఇంత పెద్ద మార్పు చూసిందో స్పష్టంగా చెప్పలేం. కానీ సోషల్ మీడియా ప్రబలడం, కొత్తగా వస్తున్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్ములు, వ్యక్తిగత జీవన విధానాల్లో మార్పులు ఇవన్నీ కారణాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు ఇలాంటి విషయాలు చాలా సైలెంట్‌గా జరిగేవి. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో సంబంధాల రూపం పూర్తిగా మారిపోయింది.
❄ Ashley Madison.. యాప్ ప్రత్యేకత
ఈ యాప్ మొదట్లో ఎక్స్‌ట్రా మ్యారిటల్ కనెక్షన్స్ కోసం డిజైన్ చేయబడింది. సీక్రెట్‌గా రిజిస్టర్ అయి సంబంధాలు కలిగి ఉండాలని భావించే వారికి ఇది సౌకర్యం కల్పిస్తుంది. ఇప్పుడు భారతదేశంలో దీని ప్రాచుర్యం వేగంగా పెరుగుతోందని డేటా చెబుతోంది. ముఖ్యంగా మెట్రోలను మించిన చిన్న పట్టణాల నుంచి ఎక్కువ మంది యూజర్లు వస్తున్నారనేది ఒక కొత్త ట్రెండ్.
❄ సమాజంలో మారుతున్న పరిస్థితులే కారణమా?
ఇండియాలో ఎప్పట్నుంచో ఒకే సంబంధం (మోనోగమీ) ప్రధానంగా ఉంటుంది. కానీ ఆధునిక జీవన విధానం, స్వేచ్ఛ, వ్యక్తిగత ఆశయాలు పెరగడంతో కొంతమంది నాన్ -మోనోగమీ వైపు వెళ్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ మార్పు కేవలం యువతలోనే కాకుండా వివాహితులలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది.
❄ భవిష్యత్తులో ఏం జరుగుతుంది?
ఇలాంటి యాప్‌ల ప్రాచుర్యం సమాజంలో కొత్త డిబేట్స్‌కు దారితీస్తోంది. ఒకవైపు స్వేచ్ఛా భావన, మరోవైపు నైతికతపై ప్రశ్నలు లేవుతున్నాయి. ఈ ధోరణి ఎంతవరకు సానుకూలమో, దాని ప్రభావం సంబంధాలపై ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. మొత్తానికి, కాంచీపురం ఇప్పుడు కేవలం పట్టు చీరలతోనే కాకుండా ఈ వింత రికార్డ్ తో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మెట్రోలను మించి చిన్న పట్టణాలు కొత్త ట్రెండ్స్ సృష్టిస్తున్నాయన్నది ఈ రిపోర్ట్ ద్వారా స్పష్టమైంది.