OTT Movie : ఓటీటీ మూవీ లవర్స్ కు అదిరిపోయే వెబ్ సిరీస్ లతో సర్ప్రైజ్ ఇవ్వడంలో ఇప్పుడిప్పుడే తెలుగు దర్శకులు కూడా జోరు పెంచారు. తాజాగా రిలీజ్ అయిన ఏ యూత్ ఫుల్ వెబ్ సిరీస్ ఓటీటీలో గత్తర లేపుతోంది. అందులో కాలేజ్ డేస్ ను మనసుకు హత్తుకునే విధంగా అద్భుతంగా చూపించారు. ఇలాంటి కంటెంట్ ఉన్న కథే కథ మావా మనకు కావలసింది అన్పించేలా ఉన్న ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? ఆ సిరీస్ టైటిల్ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
కథలోకి వెళ్తే…
ఈ సిరీస్ విజయవాడలోని ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) అనే ప్రసిద్ధ ఐఐటీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన ముగ్గురు విద్యార్థులు అర్జున్ (హర్ష్ రోషన్), ఇమ్రాన్ (జయతీర్థ), రాజు (భాను ప్రకాష్)ల చుట్టూ తిరుగుతుంది. ఈ ముగ్గురూ 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత, వారి తల్లిదండ్రుల నిర్ణయంతో ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఈ కఠినమైన కోచింగ్ సెంటర్‌లో చేరతారు. ఇందులో సునీల్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడిగా, సందీప్ రాజ్ కఠినమైన కళాశాల హెడ్‌గా, మరియు చైతన్య రావు ఒక ఉపాధ్యాయుడిగా కనిపిస్తారు. అయితే ఈ ముగ్గురికీ ఈ కోచింగ్‌లో చేరడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. అర్జున్ తన తండ్రి ఒత్తిడి వల్ల, ఇమ్రాన్ తన కలలను సాధించాలనే ఆశతో, రాజు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి ఇక్కడ చేరతారు.
కథ మొదట్లో వీరు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని కఠినమైన నియమాలు, అధిక ఒత్తిడి, చదువు మాత్రమే ఉండే వాతావరణానికి అలవాటు పడటానికి ఇబ్బంది పడతారు. ఈ ఒత్తిడిని ఎదుర్కోవడానికి వారు వాళ్ళు చేసే కామెడీ, అడ్వెంచర్స్ చేస్తారు. అయితే ఒక అనూహ్య సంఘటన వారిని తీవ్రమైన సమస్యలోకి నెట్టివేస్తుంది. ఇంతకీ ఆ సంఘటన ఏంటి? ఈ సమస్యను ఆ ముగ్గురు విద్యార్థులు ఎలా ఫేస్ చేశారు? చివరికి ఏం జరిగింది? అన్నది తెరపై చూడాల్సిన కథ.
Read Also : నలుగురమ్మాయిలు ఉన్న గదిలోకి ఇద్దరు సైకోలు… ఘోరమైన సీన్స్… గుండెల్ని వణికించే క్రైమ్ థ్రిల్లర్
ఏ ఓటీటీలో ఉందంటే?
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సూపర్ హిట్ తెలుగు వెబ్ సిరీస్ పేరు “ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్” (AIR-All India Rankers). జోసెఫ్ క్లింటన్ దర్శకత్వంలో, సందీప్ రాజ్ – సూర్య వాసుపల్లి నిర్మించిన ఈ తాజా తెలుగు యూత్ కామెడీ-డ్రామా వెబ్ సిరీస్ ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హర్ష్ రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ, సునీల్, వైవా హర్ష, చైతన్య రావు మద్ది, జీవన్ కుమార్, సందీప్ రాజ్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఈ 7 ఎపిసోడ్‌ల సిరీస్ లో స్నేహం, మొదటి ప్రేమ వంటి అంశాలతో పాటు కళాశాల జీవితంలోని గుర్తుండిపోయే క్షణాలు కూడా ఉన్నాయి. ఇవి 90ల తరం, హాస్టల్ జీవితాన్ని అనుభవించిన వారికి బాగా కనెక్ట్ అవుతాయి. ఇంకా చూడకపోతే వెంటనే ఈ తెలుగు సిరీస్ ను చూసి ఎంజాయ్ చేయండి.