Ind Vs Eng, 2nd Test: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలిపోయింది. ఇవాళ ఉదయం వర్షం విలన్ గా మారినప్పటికీ… టీమిండియా విజయం దక్కించుకుంది. ఏకంగా 336 పరుగుల తేడాతో… ఇంగ్లాండ్ జట్టుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ ను… 1-1 తేడాతో సమం చేసింది టీమిండియా. ఇక ఈ రెండు జట్ల మధ్య మరో 3 టెస్టులు మిగిలి ఉన్నాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలవగా… ఇప్పుడు టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. బుమ్రా లాంటి భయంకరమైన బౌలర్ లేనప్పటికీ… మహమ్మద్ సిరాజ్, కొత్త బౌలర్ ఆకాష్ దీప్ జట్టును ముందుండి నడిపించారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు విలవిలలాడింది.
దుమ్ము లేపిన సిరాజ్, ఆకాష్ దీప్
టీమిండియా స్టార్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్ అలాగే ఆకాష్ దీప్ ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ దెబ్బకు టీమిండియా 336 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీమిండియా డేంజర్ ఆటగాడు బుమ్రా.. రెండో టెస్ట్ మ్యాచ్లో ఆడకపోయేసరికి గిల్ సేన అసలు గెలవద్దని అనుకున్నారు. కానీ రెండో టెస్ట్ మ్యాచ్ లో… సిరాజ్ భాయ్ అలాగే ఆకాష్ దీప్ ఇద్దరూ బాంబుల్లా రెచ్చిపోయారు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఆకాష్ దీప్ అయితే ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టి… ఇంగ్లాండు నడ్డి విరిచాడు. అటు తెలంగాణ డిఎస్పి మహమ్మద్ సిరాజ్ భాయ్… మొదటి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీయగా రెండో ఇన్నింగ్స్ లో వికెట్ తో పాటు అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ దెబ్బకు టీమిండియా బౌలర్ల చేతికి ఇంగ్లాండ్ బ్యాటర్లు హ్యాండ్ ఓవర్ కావాల్సి వచ్చింది.
మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన క్యాచ్
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో… డీఎస్పీ సిరాజ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ లో వచ్చిన జోష్ టంగ్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే టంగ్ క్యాచ్ను సిరాజ్ అద్భుతంగా అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అంతకుముందు వోక్స్ క్యాచ్ కూడా అందుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో.. 587 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ లో 6 వికెట్లు నష్టపోయి 427 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్ లో 407, రెండో ఇన్నింగ్స్ లో 271 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.
DSP Siraj catching balls like he's catching thieves. pic.twitter.com/UJMhwRqAxx
— Xavier Uncle (@xavierunclelite) July 6, 2025