E-Paper
Advertisement

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ
Advertisement

Marathi Horror Comedy: త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ పాడుబడిన పాత భవంతిలోకి ఏడుగురు స్నేహితులు అడుగు పెడతారు. అక్కడ ఏదో వింత శక్తి ఉందని తెలిసినా… తమకు ఏమీ కాదులే అనుకుంటారు. కానీ ఓ శపించబడిన నాణెం చేతుల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి తలకిందులు అవుతుంది. దెయ్యాలు, చీకటి శక్తులు వెంటపడుతుంటే భయంతో పరుగులు తీస్తూనే వాళ్లు చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. ఇలా హారర్, కామెడీ కలిపిన ఖతర్నాక్ మూవీ ‘భూతం భయ్యమ్’ (Bhootam Bhayyam). మరి ఇది ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఏడుగురు స్నేహితులు త్వరగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తారు. అందుకోసం సాధారణంగా ఎవరూ వెళ్లడానికి ఇష్టపడని ఓ పాడుబడిన రాణీవాడాను ఎంచుకుంటారు. ఆ ప్రదేశం గురించి కొన్ని భయంకరమైన కథలు వినిపించినా, డబ్బు కోసం రిస్క్ చేయాలని నిర్ణయించుకుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లకు ఓ శపించబడిన నాణెం దొరుకుతుంది. మొదట అది తమ అదృష్టాన్ని మార్చే వస్తువులా అనిపిస్తుంది. కానీ ఆ నాణెం కారణంగా అదృశ్య శక్తులు మేల్కొంటాయని వాళ్లకు తెలియదు.

Advertisement

నాణెం చేతుల్లోకి వచ్చిన తర్వాత ఒక్కో విచిత్రమైన సంఘటన మొదలవుతుంది. కనిపించని శక్తుల ఉనికి వాళ్లకు అర్థమవుతుంది. మొదట తమలో ఎవరో భయపెడుతున్నారని అనుకుంటారు. కానీ పరిస్థితులు మరింత తీవ్రమవుతుండటంతో అసలు విషయం దెయ్యాలకు సంబంధించినదని గ్రహిస్తారు. అక్కడి నుంచి ఏడుగురి అసలు కష్టాలు మొదలవుతాయి. వాళ్లను ఆత్మలు వెంటాడటం మాత్రమే కాదు, ఆ చీకటి శక్తులతో సంబంధం ఉన్న క్షుద్రవాదులు కూడా రంగంలోకి వస్తారు. దీంతో డబ్బు కోసం వచ్చిన వాళ్లకు ఇప్పుడు ప్రాణాలతో బయట పడటమే పెద్ద ఛాలెంజ్ గా మారుతుంది.

భయంతో పారిపోవడానికి ప్రయత్నించే సమయంలో ఒకరి మాట మరొకరు వినకపోవడం, తప్పు నిర్ణయాలు తీసుకోవడం, తమకు తామే కొత్త సమస్యలు తెచ్చుకోవడం వంటి పరిస్థితులు కామెడీని పండిస్తాయి. సినిమాలో దెయ్యాల భయం ఒకవైపు ఉంటే… ఫ్రెండ్స్ చేసే పనులు మరోవైపు నవ్విస్తాయి. ఆ శపించబడిన నాణెం అసలు ఎక్కడి నుంచి వచ్చింది ? ఆ రాణీవాడాకు దానికి ఉన్న సంబంధం ఏంటి ? అక్కడి చీకటి శక్తులు ఎందుకు మేల్కొన్నాయి ? ఏడుగురు స్నేహితులు ఈ దెయ్యాల బారి నుంచి ఎలా బయట పడతారు ? అనేదే సినిమాలో చూసి తెలుసుకోవలసిన విషయం.

ఓటీటీలో తెలుగలో ఉందా ?

Advertisement

ఛాయా కదమ్, కరణ్ సొనావణే, మన్మీత్ పెమ్, పుష్కరాజ్ చిర్పుట్కర్, నీల్ సాలేకర్ తదితరులు నటించిన ఈ మరాఠీ హారర్ కామెడీకి రామ్‌చంద్ర గావ్‌కర్ దర్శకత్వం వహించారు. ZEE5లో మరాఠీ ఆడియోలో సెప్టెంబర్ 25 నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషలలో ఓటీటీలో అందుబాటులో లేదు.

Read Also: మాఫియా సామ్రాజ్యాన్ని మట్టుబెడదాం అనుకుంటే మెంటల్ మాస్ షాక్… క్లాసిక్ క్రైమ్ డ్రామా

Tags

Related News

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

భార్య బిజినెస్‌లో బిజీ… ముగ్గురు పిల్లలతో తండ్రి తిప్పలు… ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామాను డోంట్ మిస్

Big Stories

Advertisement
×