E-Paper
Advertisement

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా
Advertisement

Marathi Family Drama: పిల్లలను చూసుకోవడానికి ఇంట్లోకి ఓ బేబీసిట్టర్‌ను తీసుకొస్తే… కొద్దిరోజుల్లోనే ఆ పిల్లాడికి ఆమెతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. కానీ ఆ పిల్లాడు తల్లిదండ్రుల కంటే ఆమె మాటకే ఎక్కువ విలువ ఇస్తున్నట్టు అనిపిస్తే ? మొదట సహాయం కోసం వచ్చిన ఆ వ్యక్తి క్రమంగా కుటుంబంలోనే ఓ ముఖ్యమైన భాగంగా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఇలాంటి సంఘర్షణనే కళ్ళకు కట్టినట్టుగా చూపించే సినిమా ‘అడ్కిట్టా’ (Adkitta). మరి ఈ సినిమా కథ ఏంటి ? బేబీ సిట్టర్ గా వచ్చినావిడ చేసిన పనేంటి ? సినిమా ఏ ఓటీటీలో ఉంది ? అనేది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే… 

గౌతమ్, కస్తూరి తమ కొడుకు అర్జున్ ను పెంచుకుంటూ ఉద్యోగం, కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇద్దరికీ పనులు ఉండటంతో పిల్లాడిని చూసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా మంగళ్ ను కేర్‌టేకర్‌గా ఇంట్లోకి తీసుకురావాలని నిర్ణయించుకుంటారు. మంగళ్ మొదట కుటుంబానికి అవసరమైన సహాయం మాత్రమే చేస్తుంది. అర్జున్‌ ను చూసుకోవడం, అతనితో సమయం గడపడం, అతడి అవసరాలు తీర్చడం… ఇలా రోజులు గడిచే కొద్దీ మంగళ్‌ కు అర్జున్‌ తో అనుబంధం పెరుగుతుంది.

Advertisement

అర్జున్ కూడా మంగళ్‌ తో బాగా కలిసిపోతాడు. తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో మంగళ్ అతనితో ఎక్కువ సమయం గడపడంతో ఆమె అతని జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా మారుతుంది. మొదట ఈ అనుబంధాన్ని సహజంగానే తీసుకున్న గౌతమ్, కస్తూరికి క్రమంగా అసౌకర్యం మొదలవుతుంది. మంగళ్ కేవలం బేబీసిట్టర్‌ గా కాకుండా ఇంట్లోని విషయాలపై కూడా ప్రభావం చూపుతున్నట్టు అనిపిస్తుంది. అర్జున్ విషయంలో ఆమె మాటలకు ప్రాధాన్యం పెరుగుతుంది. దీంతో కస్తూరికి తన కొడుకుతో ఉన్న బంధం దూరమవుతున్నట్టుగా అనిపిస్తుంది. గౌతమ్ కూడా పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు.

ఇదే సమయంలో ఇంట్లో కొన్ని అనుమానాస్పద సంఘటనలు జరగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. మంగళ్ నిజంగా కుటుంబానికి సహాయం చేయడానికే వచ్చిందా ? లేక ఆమె ఉనికి వెనుక ఇంకేదైనా ఉందా ? అనే సందేహాలు మొదలవుతాయి. గౌతమ్, కస్తూరి ఏ నిర్ణయం తీసుకోవాలి ? అర్జున్‌పై మంగళ్ ప్రభావం ఎంత వరకు వెళ్లింది ? తమ కొడుకును కాపాడుకోవాలనే భయం చివరికి తల్లిదండ్రులను ఎలాంటి నిర్ణయం తీసుకునేలా చేస్తుంది ? అనే అంశాలతో సినిమా భావోద్వేగంగా సాగుతుంది. మరి అసలు కేర్ టేకర్ ఎందుకు పిల్లాడిని అలా ప్రభావితం చేసింది ? చివరికి తల్లి తన పిల్లాడిని సొంతం చేసుకుందా లేదా ? అనేది తెలియాలంటే సినిమాపై ఒక లుక్కేయండి.

ఓటీటీలో ఏ భాషలో ఉందంటే ?

Advertisement

సాయి తంహాంకర్, సిద్ధార్థ్ చాందేకర్, సఖీ గోఖలే నటించిన ఈ మరాఠీ ఫ్యామిలీ డ్రామాకు ఆశుతోష్ నిఖిల్ పరాండ్కర్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 11 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. అధికారికంగా మరాఠీ ఆడియోలో అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషలలో ఆడియో అవైలబుల్ గా లేదు.

Read Also: కోమా నుంచి లేచిన మహిళ జీవితంలో గత ఆరు నెలలు మిస్సింగ్… భర్త కనిపించకపోవడంతో ట్విస్ట్… షాకింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

Tags

Related News

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

భార్య బిజినెస్‌లో బిజీ… ముగ్గురు పిల్లలతో తండ్రి తిప్పలు… ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామాను డోంట్ మిస్

Big Stories

Advertisement
×