E-Paper
Advertisement

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ
Advertisement

Kannada Horror Comedy: రోజూ పని, బాధ్యతలతో బిజీగా ఉండే ఎనిమిది మంది ఫ్రెండ్స్‌ కు ఒక్కటే ఆలోచన… అన్నీ మర్చిపోయి ఓ ట్రిప్‌ కు వెళ్లి ఫుల్‌ గా ఎంజాయ్ చేయాలి. కానీ వాళ్లు ఎంచుకున్న ప్రదేశంలో మనుషుల కంటే దెయ్యాలే ఎక్కువగా ఉంటాయి. అక్కడికి వెళ్లకూడదు అనే హెచ్చరికలు విన్నా, పట్టించుకోకుండా అడవిలోకి వెళ్లిన ఈ గ్యాంగ్‌ కు… ఒక్కో అడుగు ముందుకు వేసిన కొద్దీ పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. భయపెట్టడంతో పాటు నవ్వించే మూవీ పేరే ‘బాయ్స్ నెవర్ కాంప్రమైజ్’ (Boys Never Compromise). అసలు ఈ సినిమా తెలుగులో ఉందా ? ఓటీటీలోకి ఎప్పుడు వచ్చింది ? అంటే…

కథలోకి వెళ్తే…

ఎనిమిది మంది స్నేహితులు తమ రోజువారీ జీవితంలోని ఒత్తిడిని పక్కన పెట్టి ఓ మౌంటెన్ రోడ్ ట్రిప్‌ కు బయలుదేరుతారు. బాధ్యతలు, పని, టెన్షన్ అన్నింటినీ మర్చిపోయి… మందు, మ్యూజిక్, సరదాతో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్లకు ఆ ట్రిప్ ఓ చిన్న బ్రేక్‌ లా అనిపిస్తుంది. కానీ వాళ్లు వెళ్లే ప్రాంతం సాధారణ ప్రదేశం కాదు. అక్కడి అడవుల్లో వింత శక్తులు ఉన్నాయని స్థానికులు హెచ్చరిస్తారు. రాత్రి సమయంలో అక్కడ తిరగడం ప్రమాదమని చెబుతారు. అయితే ఈ ఫ్రెండ్స్ మాత్రం ఆ హెచ్చరికలను సీరియస్‌ గా తీసుకోరు. పైగా దెయ్యాలు, భూతాలు అంటూ భయపెట్టే వాళ్లనే ఆటపట్టిస్తూ ముందుకు సాగుతారు.

Advertisement

అడవిలోకి వెళ్లిన తర్వాత మొదట చిన్న చిన్న వింతలు కనిపిస్తాయి. చుట్టూ ఏదో తెలియని శక్తి ఉందనే అనుభూతి కలుగుతుంది. అయినా వాళ్లు దాన్ని సరదాగా తీసుకుంటారు. కానీ కొద్దిసేపటికే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. వాళ్ల చుట్టూ జరుగుతున్న విషయాలకు కారణం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. పారిపోవాలని ప్రయత్నించినా దారి కనిపించదు. ఒకరికి కనిపించిన విషయం మరొకరికి కనిపించదు. కంటికి కనిపించే వాటిలో ఏది నిజం ? ఏది భ్రమ ? అనే విషయం కూడా అర్థం కాకుండా పోతుంది. దాంతో ఫ్రెండ్స్ మధ్య భయం పెరుగుతుంది. ఇంతకాలం సరదాగా ఉన్న వాళ్లు ఇప్పుడు ఒకరినొకరు వదిలి పక్కకు కూడా వెళ్లలేని పరిస్థితిలో పడతారు.

మరి ఆ అతీంద్రియ శక్తులు వాళ్లను ఎందుకు వెంటాడుతున్నాయి ? ఈ అడవికి అసలు రహస్యం ఏంటి ? ఎనిమిది మంది స్నేహితులు అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడగలరా ? అనే ప్రశ్నలతో కథ హారర్, కామెడీ మిక్స్‌లో సాగుతుంది. మీకు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమాను మిస్ అవ్వకుండా చూసేయండి.

తెలుగులో ఉందా ?

Advertisement

సమ్రాట్, సుప్రీత్ కాటి, సీతారామ్, సిద్ధు మండ్య, ఉమేష్ కిన్నాల్ తదితరులు నటించిన ఈ సినిమాకు హరీష్ జల్గెరె దర్శకత్వం వహించారు. ఈ కన్నడ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, మరాఠీ భాషల్లో రూపొందింది. జూలై 10 థియేట్రికల్ గా రిలీజ్ అయ్యింది. ఇక తాజాగా ఓటీటీలోనూ అడుగు పెట్టింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: చనిపోయిన వ్యక్తి బాడీకి కాపలాగా వెళ్తే తెల్లారేసరికి శవం మాయం… క్రేజీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

Related News

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

భార్య బిజినెస్‌లో బిజీ… ముగ్గురు పిల్లలతో తండ్రి తిప్పలు… ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామాను డోంట్ మిస్

ఒక్క రాత్రి బేబీసిట్టింగ్ అనుకుంటే ఊహించని తలనొప్పి… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ

చనిపోయిన వ్యక్తి బాడీకి కాపలాగా వెళ్తే తెల్లారేసరికి శవం మాయం… క్రేజీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

గెలుపు కోసం జరిగే పోటీ కాస్తా ప్రాణాల మీదకు వస్తే ? బ్లడీ స్పోర్ట్స్ హారర్

Big Stories

Advertisement
×