BigTV English

OTT Movie : బ్రతికుండాగానే ఆర్గాన్స్ కోసేసే సైకో… క్రేజీ క్లైమాక్స్… మతిపోగోట్టే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : బ్రతికుండాగానే ఆర్గాన్స్ కోసేసే సైకో… క్రేజీ క్లైమాక్స్… మతిపోగోట్టే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒక గ్రిప్పింగ్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో దుమ్ము దులుపుతోంది. ఉత్కంఠభరితమైన ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘స్క్విడ్ గేమ్,’ ‘పారాసైట్’ వంటి కొరియన్ సిరీస్ అభిమానులు, తప్పక చూడవలసిన సిరీస్ ఇది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌లో

ఈ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘కర్మా’ (Karma). 2025లో విడుదలైన ఆరు ఎపిసోడ్‌ల సిరీస్ కి లీ ఇల్-హ్యుంగ్ దర్శకత్వం వహించారు. ఇది చోయ్ హీ-సియోన్ రాసిన కాకావ్ వెబ్‌టూన్ ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్‌లో పార్క్ హే-సూ, షిన్ మిన్-ఆ, లీ హీ-జూన్, కిమ్ సంగ్-క్యున్, లీ క్వాంగ్-సూ, గాంగ్ సీయుంగ్-యియోన్ నటించారు. ఇది ఒక భయంకరమైన ప్రమాదం ద్వారా ఆరుగురు వ్యక్తుల జీవితాలతో ముడిపడిన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ Netflix లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ డబ్బింగ్‌లతో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఈ సిరీస్ కి 8.0/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ సిరీస్ సియోల్‌లో ఒక హిట్-అండ్-రన్ ప్రమాదంతో ప్రారంభమవుతుంది. ఇది ఆరుగురు వ్యక్తుల జీవితాలను, విధి ఒక ఉత్కంఠభరితమైన  లూప్‌లో కలుపుతుంది. పార్క్ జే-యంగ్ క్రిప్టోకరెన్సీలో నష్టపోయిన ఒక అప్పుల బాధితుడు. ఇతను భారీగా అప్పులు చేసి ఉంటాడు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక తన తండ్రి పార్క్ డాంగ్-సిక్ ను చంపడానికి జాంగ్ గిల్-ర్యాంగ్ అనే వ్యక్తిని నియమిస్తాడు. ఆ తరువాత వచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బుతో అప్పు తీర్చాలని ఆశిస్తాడు. కానీ గిల్-ర్యాంగ్ ఈ హత్యను ఒక ప్రమాదంగా చిత్రీకరించలేక, శవాన్ని వేరే చోట విసిరివేస్తాడు. ఈ శవం చుట్టూ మిగతా పాత్రల స్టోరీ నడుస్తుంది.

హాన్ సాంగ్-హన్: ఇతను గ్యాంగ్‌నామ్‌లో విలాసవంతమైన క్లినిక్ నడిపే డాక్టర్. లగ్జరీ లైఫ్ ను ఆనందిస్తుంటాడు. తన స్నేహితురాలు లీ యూ-జియాంగ్ తో ఒక ట్రిప్ నుండి తిరిగి వస్తుండగా, డాంగ్-సిక్ శవాన్ని కారుతో ఢీకొంటాడు. ఇది అతని జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.

జాంగ్ గిల్-ర్యాంగ్ : అన్యాయంగా ఉద్యోగం కోల్పోయిన కొరియన్-చైనీస్ వ్యక్తి. జే-యంగ్ ఆఫర్‌ను ఒప్పుకుని హత్య చేస్తాడు. కానీ అతని చర్యలు అనూహ్య పరిణామాలకు దారితీస్తాయి.

లీ యూ-జియాంగ్ : సాంగ్-హన్ స్నేహితురాలు, ఆమె మోసపూరిత చర్యలు కథలో ట్విస్ట్‌లను సృష్టిస్తాయి.

విట్‌నెస్ : ఈ ప్రమాదానికి సాక్షిగా ఉన్న ఏకైక వ్యక్తి. ఈ సంఘటన ద్వారా అతని గత రహస్యాలు కూడా బయటపడతాయి.

ఈ కథ నాన్-లీనియర్ ఫార్మాట్‌లో సాగుతుంది. ఈ ఆరు వ్యక్తుల జీవితాలలో జరిగిన గత సంఘటనలు బయటపడతాయి. అయితే ఈ ప్రమాదం వీళ్ళ జీవితాలను తారుమారు చేస్తుంది. ప్రతి ఎపిసోడ్ షాకింగ్ ట్విస్ట్‌లతో ఆకట్టుకుంటుంది. చివరికి ఈ ఆరుగురి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయి ? ఈ సిరీస్ లో ఎలాంటి ట్విస్టులు వస్తాయి ? అనేది ఈ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : కళ్ళముందే కంటికి కన్పించని శక్తి… చూస్తే డైరెక్ట్ నరకానికి టికెట్… ప్రతి సీనూ క్లైమాక్స్ లా ఉండే మూవీ

Related News

OTT Movie : ట్రిప్పుకెళ్లి టీచర్ తో అర్ధరాత్రి అరాచకం… సైకో ట్రాప్ లో అడ్డంగా బుక్కయ్యే అమాయకురాలు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : విమానంలో వైరస్ లీక్… పిచ్చోడు చేసే మెంటల్ పనికి పైప్రాణాలు పైనే… సీను సీనుకో ట్విస్ట్ మావా

OTT Movie : భర్త చనిపోయాడని చెప్పి భార్యను లాక్కునే ఆఫీసర్… అతను తిరిగొచ్చి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : మనుషుల్ని చూస్తుండగానే మసి చేసే సైకో… ఎవెంజర్స్ ను మించిన శక్తి… ఓటీటీలో గత్తరలేపుతున్న సూపర్ హీరో మూవీ

OTT Movies: దొంగచాటుగా పక్కింటి అమ్మాయిని ‘అలా’ చూస్తాడు.. తర్వాత వాడికి నరకమే, సినిమా మొత్తం అలాంటి సీన్లే!

OTT Movie : ట్రాప్ చేసి పాడు పనులు… ఈ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే… దిమాక్ ఖరాబ్ చేసే రియల్ రివేంజ్ స్టోరీ

Big Stories

×