Allu Arjun: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ తెలుగు సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని పెంచారు ఎస్.ఎస్ రాజమౌళి. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు మంచి గుర్తింపు లభించింది. కల్కి సినిమాకి కూడా అదే స్థాయిలో మంచి ఆదరణ వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇంపాక్ట్ మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది.
పుష్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ అన్ స్టాపబుల్ షో కి హాజరయ్యాడు. పుష్ప సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షో లో దీని గురించి ప్రస్తావన వచ్చింది. అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ తెలుగు యాక్టర్ కి నేషనల్ అవార్డు రాకపోవడం అనేది నాకు చాలా బాధ కలిగించిన విషయం. నేను దానిని రౌండ్ చేసి గురి పెట్టాను అంటూ తెలిపాడు. ఇదే మాట నేను దర్శకుడు సుకుమార్ తో షేర్ చేశాను. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మేము నేషనల్ అవార్డును టార్గెట్ పెట్టుకొని సినిమా చేశాం. సుకుమార్ ఈ మాట చెప్పగానే సరే డార్లింగ్ నా శక్తి మేరకు పనిచేసి నేషనల్ అవార్డు వచ్చేలా చేస్తాను అంటూ తెలిపాడు. అయితే ఈ సినిమా షూటింగ్ తరుణంలో ఒక సీన్ అయిపోయిన తర్వాత సుకుమార్ తన దగ్గరకు వచ్చి డార్లింగ్ నేషనల్ అవార్డుకి ఇది సరిపోదు అంటూ చెప్పేవాడట. అయితే ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుంది. అని కాకుండా కేవలం నేషనల్ అవార్డు అనే దానిని మైండ్ లో పెట్టుకొని పనిచేశామంటూ తెలిపాడు.
Also Read : Posani Krishna Murali: నటుడు పోసాని పై రాష్ట్రవ్యాప్తంగా 50 కి పైగా కేసులు నమోదు
ఇప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. కానీ ఏ నటుడికి నేషనల్ అవార్డు ఇప్పటివరకు రాలేదు. అయితే ఇదే అభిప్రాయం అల్లు అర్జున్ కు కూడా ఉంది. ఇక అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ నేషనల్ అవార్డును ప్రతి తెలుగు హీరోకి నేను అంకితం చేస్తున్నాను అంటూ చెబుతూ వచ్చాడు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ ప్రభాస్, ఎన్టీఆర్ తో అల్లు అర్జున్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇక పుష్ప విషయంలో కూడా వీరిద్దరి అభిమానులు అల్లు అర్జున్ ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అంటూ కొంతమంది బలంగా నమ్ముతున్నారు. ఏదేమైనా డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలను సినిమా ఎంత మేరకు అందుకుంటుందో వేచి చూడాలి.