Satyabhama Today Episode November 15 th : నిన్నటి ఎపిసోడ్.. సత్య క్రిష్ ను అడ్డుపెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు తీసుకొని వస్తుంది. అటు హర్ష వాళ్ళ ఇంట్లో మైత్రి కావాలంటే పది లక్షలు కట్టమని అంటున్నారు అని అంటారు.. దాని గురించి ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడుతారు. కిడ్నాపర్ల నుంచి మరోసారి హర్షకి కాల్ వస్తుంది. అంత డబ్బు అడిగితే ఎందుకు లిఫ్ట్ చేస్తాడు అని అంటుంది. దాంతో రౌడీ మళ్లీ కాల్ చేస్తే హర్ష లిఫ్ట్ చేస్తాడు. గంటలో పది లక్షలు తీసుకొని రైల్వే స్టేషన్కి రమ్మంటాడు. గుర్తు పెట్టుకో గంటలో పది లక్షలు ఎలా అని అందరూ తల పట్టుకుంటారు. విశాలాక్షి తన నగలు ఇచ్చి మైత్రిని విడిపించుకొని రమ్మంటుంది. విశ్వనాథ్ కూడా ఆడ పిల్ల ఉసురు వద్దు నగలు కుదువ పెట్టి మైత్రిని విడిపించుకొని తీసుకురమ్మని అంటాడు. హర్ష నగలు తీసుకొని వెళ్తాడు. సత్యను హాస్పిటల్ కు తీసుకొని వెళ్తాడు. అక్కడ కాంపౌండర్ తో గొడవ పెట్టుకుంటాడు. అమ్మగారు అడిగింది ఇవ్వకుంటే నా చేతుల్లో చస్తావని బెదిరిస్తాడు. అతని చెప్పడంతో సత్య క్రిష్ ను బయటకు పంపి వెళ్లి వెతుకుతుంది. అక్కడ చక్రవర్తి, మహాదేవయ్య పేర్లు మాత్రమే ఉంటాయి. దాంతో షాక్ అవుతుంది. అక్కడితో ఆ ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. లోపలికి వెళ్లిన సత్య ఫైల్స్ ను తిరగేసి వెతుకుతుంది. అయితే ఆ రోజు డెలివరీ అయిన వారిలో ఇద్దరు మాత్రమే ఉన్నారు అని షాక్ అవుతుంది సత్య.. ఇదెలా సాధ్యం అని ఆలోచించి బయట సెక్యూరిటీని అడుగుతుంది. క్రిష్ బయట నుంచి దేవుడికి దండం పెట్టుకుంటాడు. సత్య అనుకున్నది జరగాలని సత్య ముఖంలో సంతోషం చూడాలి అనుకుంటాడు. ఇక సత్య క్రిష్ పుట్టిన రోజున మహదేవయ్య, చక్రవర్తి ఇద్దరి పేర్ల మీద డెలివరీ ఉండటం చూస్తుంది. ఆ రోజు మొత్తంలో రెండు డెలివరీలేనా మరి లేవా అని కంగారు పడి కాంపౌండర్ని ప్రశ్నిస్తుంది. ఇంకేమైనా అయ్యావా అని అడుగుతుంది.. కానీ అదే అంటాడు.. రెండే జరిగితే ఎక్కడ మార్పు జరిగిందని అడుగుతుంది.. ఇక సెక్యూరిటీ తెలియదని చెప్పడంతో బయటకు వచ్చేస్తుంది. బయట క్రిష్ ఏమైంది సత్యం ఆ నిద్ర మొహం గాడు నీకు ఇవ్వలేదా చెప్పు అని అడుగుతాడు.. కానీ అతను ఇచ్చాడు.. ఆ నిజం తెలుసుకొనేందుకు ఇంకాస్త టైం పట్టేలా ఉందని అంటుంది.. అప్పుడే మహాదేవయ్య ఫోన్ చేస్తాడు.
ఏంటి కోడలా ఎక్కడకు వెళ్ళావు.. హాస్పిటల్కు వెళ్ళావు.. అక్కడ నీకు కావాల్సింది దొరకలేదా.. మీకు ఎలా తెలుసు అనుటుంది. ఇక దానికి మహాదేవయ్య నిన్న ఫాలో అవుతున్న కదా అంటాడు. నన్ను ఫాలో అవుతున్నారంటే మీరు ఓడిపోయినట్టే అనేసి సత్య మహదేవయ్యతో అంటుంది. ఓడిపోయినట్లు ఎందుకనుకోవాలి నీ మీద నిగా పెట్టినట్లు అందుకోవచ్చు కదా అనేసి మహాదేవ సత్యను అంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నా గురించి నిజం తెలుసుకోలేవని సత్యను ఎగతాళిచేసి మహదేవయ్య మాట్లాడతాడు.. దానికి సత్య మీ ఆటలు సాగవు మీకు రోజులు చెల్లిపోయాయి అసలు నిజం ఏంటో అతి త్వరలోనే బయటకు పడుతుంది దీని గురించి నిజం తెలుసే అంతవరకు నేను నిద్ర పోను అని సత్య అంటుంది. నిన్నటి వరకు నేనొక్కదాన్నే నిజం తెలుసుకోవాలనుకున్నాను ఇప్పుడు మీ కొడుకు కూడా జాయిన్ అయ్యాడు ఇద్దరం కలిసి జంటగా అసలు నిజాన్ని బయటపెడతాం అనేసి సత్య మహదేవయ్యకు వార్నింగ్ ఇస్తుంది.
ఇక క్రిష్ ఎవరు ఫోన్ చేసింది అని అడుగుతాడు. మామయ్య ఫోన్ చేశాడు ఎక్కడున్నారని కంగారు పడుతున్నాడండి అని సత్య క్రిష్ తో అంటుంది. మా బాపుకి కళ్ళ ముందు కనిపించుకుంటే ఎంత టెన్షన్ పడతాడో తెలిసిందా నా ఫోన్ పని చేస్తూనే ఉంది కదా నీకు ఫోన్ చేశాడు ఏంటి అని అంటే మీ ఫోన్ కి సిగ్నల్ రావట్లేదు అంట అందుకే నాకు ఫోన్ చేసి అడిగాడు అని సత్యం అంటుంది.. ఇక రేణుక వంట గదిలో అన్ని సర్దుతూ ఉంటుంది. భైరవి వచ్చి ఇంకా సరిపోలేదా ఇంత మెల్లగా చేస్తున్నావేంటి అని గట్టిగా అడుగుతుంది. మీ మామయ్య టైంకి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు ఏం చెప్పను అనేసి బైరవి అంటుంది. పిల్ల పిచ్చా నీకేముంది ఇంకా మొగుణ్ణి ఏమో జైలుకు పంపించావు కనీసం పనులు అన్నా చక్కగా చేయలేవా అనేసి అనగానే రేణుక అలాంటి మాటలు మాట్లాడొద్దు అత్తమ్మ మనసు ఘోషిస్తుంది అనేసి బాధపడుతూ వెళ్ళిపోతుంది. నీకు అప్పుడే పంకజం వంటగదిలోకి వస్తుంది. మీరన్న మాటలకి బాధపడిందా మిమ్మల్ని స్టెపించిందా అర్థం కావట్లేదు అమ్మ ఇప్పుడు మీ లిస్టులో ఇద్దరు చేరినట్లు అనిపిస్తుంది అనేసి పంకజం అంటుంది. భైరవి ఇద్దరెవరే అని అడుగుతుంది. చిన్న కోడలు పెద్ద కోడలు చిన్న కోడలు వెండి కంచంలో ఉంటే పెద్ద కోడలు స్టీల్ కంచంలో తింటుందా అని పుల్లలు పెడుతుంది.
ఇక మైత్రి టెన్షన్ పడుతుంది. ఎందుకు అక్క టెన్షన్ పడుతున్నావ్ అని ఒక రౌడీ అడుగుతాడు.. దానికి డబ్బులు తీసుకొని రాగానే నన్ను కొట్టి పారిపోండి అండి అంటుంది. అప్పుడే హర్ష అక్కడకు రాగానే మైత్రి డ్రామాను మొదలు పెడుతుంది. ఇక లోపలికి రాగానే డబ్బులు తీసుకొని వెళ్తానని అనగానే డబ్బులు ఇచ్చి హర్ష మైత్రి కోసం చూస్తాడు. మైత్రి ని రౌడీ తీసుకొని వెళ్తాడు. ఇక మైత్రిని తీసుకొని హర్ష వెళ్ళిపోతాడు. ఇక క్రిష్, సత్య ఇద్దరు రొమాంటిక్ గా మాట్లాడతారు. సత్య ఉదయం ఎదురైనా పరిస్థితి గురించి చెబుతాడు. దానికి సత్యకు ఒక ఐడియా ఇస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..