BigTV English

OTT Movie : అతుక్కుని పుట్టే అక్కాచెల్లెళ్ళు… ఒక్కడితోనే ట్రయాంగిల్ లవ్… ఊహించడానికే భయమేసే హర్రర్ థ్రిల్లర్

OTT Movie : అతుక్కుని పుట్టే అక్కాచెల్లెళ్ళు… ఒక్కడితోనే ట్రయాంగిల్ లవ్… ఊహించడానికే భయమేసే హర్రర్ థ్రిల్లర్

OTT Movie : హారర్ జానర్ లో వచ్చే సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను భయపెట్టే విధంగానే తెరకెక్కుతుంటాయి. ఓటీటీలో ఈ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ సినిమాలో , బిపాషా బసు ట్విన్ రోల్ పోషించింది. మంచి కంటెంట్ ఉన్న ఈ స్టోరీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ స్టోరీ క్లైమాక్స్ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్ 

ఈ హారర్-థ్రిల్లర్ సినిమా పేరు ‘అలోన్’ (Alone).  ఈ సినిమాకి భూషణ్ పటేల్ దర్శకత్వం వహించారు.  ఇందులో బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్, జాకీర్ హుస్సేన్, నీరా బజ్వా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీజనవరి 16, 2015న థియేటర్లలో విడుదలైంది.  ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ZEE5 లలో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

సంజనా, అంజనా అనే కవల పిల్లలకు ఒక వింత సమస్య వస్తుంది. వీళ్ళ తలలు పుట్టుకతోనే అతుక్కుని ఉంటాయి. జన్యు లోపం వల్ల వీళ్ళు అలా పుడతారు. అయినా కూడా , ఒకరితో ఒకరు సంతోషకరమైన బంధాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ అమ్మాయిల వ్యక్తిత్వాలు వ్యతిరేకంగా ఉంటాయి. సంజనా ధైర్యవంతమైన స్వభావం కలిగి ఉంటే, అంజనా సిగ్గుపడే స్వభావం కలిగి ఉంటుంది. ఈ జంట అమ్మాయిలు ఒకరినొకరు విడిపోకుండా జీవించలేరని భావిస్తారు. కానీ వీళ్ళు తమ ఆరోగ్యం కోసం, ఒక శస్త్రచికిత్స ద్వారా విడిపోవాల్సి వస్తుంది. ఈ శస్త్రచికిత్స సమయంలో, అంజనా దురదృష్టవశాత్తూ చనిపోతుంది. సంజనా మాత్రం బతికి ఉంటుంది. అంజనా మరణం సంజనాను ఎక్కువగా బాధపెడుతుంది. ఆమె తన సోదరి ఇక లేదన్న విషయం తెలిసి భరించలేకపోతుంది. ఇలా ఉండగా, కొంత కాలం తరువాత సంజనా, కబీర్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుంది.  ఈ జంటకేరళలోని ఒక ఇంట్లో కాపురం పెడుతుంది.

అయితే ఈ ఇంట్లో సంజనా అతీంద్రియ సంఘటనలను ఎదుర్కుంటుంది. ఇవి అంజనా ఆత్మతో సంబంధం కలిగి ఉన్నాయని ఆమె అనుమానిస్తుంది.  అంజనా ఆత్మ సంజనాకు హాని చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ అతీంద్రియ భయాలు సంజనా, కబీర్ జీవితాలను తలకిందులు చేస్తాయి. కథ ముందుకు సాగే కొద్దీ, గతంలో అంజనా మరణం వెనుక ఉన్న ఒక సీక్రెట్ బయట పడుతుంది. ఇప్పుడు సంజనా తన సోదరి ఆత్మ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.  కబీర్ ఆమెను  రక్షించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అంజనా మరణం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి ? సంజనా తన సోదరి ఆత్మని ఎలా ఎదుర్కుంటుంది ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : మెంటల్ ఎబిలిటీ సరిగ్గా లేని పోలీస్… ఒక్కో కేసులో ఊహించని ట్విస్టులు… అదిరిపోయే సర్ప్రైజులు

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×