E-Paper
Advertisement

Anaconda Movie OTT : ఓటీటీలోకి అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ ‘అనకొండ’… తెలుగులోనూ చూడవచ్చు

Anaconda Movie OTT : ఓటీటీలోకి అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ ‘అనకొండ’… తెలుగులోనూ చూడవచ్చు
Advertisement

Anaconda Movie OTT : 1997లో వచ్చిన ‘అనకొండ’ (Anaconda) సినిమాని ఇప్పటికీ మారిచిపోలేము. అందులో ఉండే పెద్ద పాములు సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ సినిమా చాలా ఉత్కంఠంగా సాగుతుంది. అయితే రీసెంట్ గా వచ్చిన ‘అనకొండ’ సినిమా కామెడీ జోనర్ లో తెరకెక్కించారు. ఇది కూడా మంచి వసూళ్లు సాధించింది. ఇందులో ఇద్దరు స్నేహితులు అమెజాన్ అడవుల్లో ‘అనకొండ’ సినిమాను రీమేక్ చేయాలనుకుంటారు. కానీ అక్కడ ఒక భయంకరమైన అనకొండ ఎదురవ్వడంతో పరిస్థితి మారిపోతుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ 

2025 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన యాక్షన్ అడ్వెంచర్ కామెడీ మూవీ ‘అనకొండ’ టామ్ గోర్మికన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇది ‘అనకొండ’ ఫిల్మ్ సిరీస్‌లో ఆరవ భాగం. ఇందులో జాక్ బ్లాక్, పాల్ రూడ్, స్టీవ్ జాన్, థాండివే న్యూటన్, డానియేలా మెల్చియోర్ సెల్టన్ మెల్లో నటించారు. ఈ చిత్రం 1997లో వచ్చిన అసలు ‘అనకొండ’ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్రయత్నించిన చిన్ననాటి స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. దీనిని కొలంబియా పిక్చర్స్ లేబుల్ ద్వారా సోనీ పిక్చర్స్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా $131.2 మిలియన్లను వసూలు చేసింది ఈ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ మూవీ. ఇక ఈ సినిమాలో పాత ‘అనకొండ’ (1997) నటులు ఐస్ క్యూబ్, జెన్నిఫర్ లోపెజ్ కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. ఈ జనవరి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది సినిమా.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డగ్ (జాక్ బ్లాక్), గ్రిఫ్ (పాల్ రడ్) ఇద్దరు ప్రాణ స్నేహితులు. వాళ్ళు తమ చిన్ననాటి కలని నెరవేర్చుకోవడానికి ఒక క్రేజీ ప్లాన్ వేస్తారు. తమకు ఇష్టమైన 1997 నాటి ‘అనకొండ’ సినిమాను అమెజాన్ అడవుల్లో స్వయంగా రీమేక్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఎటువంటి అనుభవం లేకపోయినా, ఒక చిన్న టీంతో కలిసి షూటింగ్ కోసం అడవిలోకి అడుగుపెడతారు. సినిమా కోసం ఒక నకిలీ పామును కూడా తెచ్చుకుంటారు. అక్కడ వీళ్ళు చేసే గందరగోళం వల్ల ఆ సినిమా షూటింగ్ కాస్త కామెడీగా సాగుతుంటుంది.

కానీ అక్కడ అసలు సమస్య నిజంగానే మొదలవుతుంది. ఒక ఆకలితో ఉన్న అతి పెద్ద రాక్షస అనకొండను చూసి వాళ్ళు బెంబేలెత్తిపోతారు. కేవలం కెమెరాలతో, డమ్మీ కత్తులతో వెళ్ళిన వాళ్ళు, ఆ క్రూరమైన పాము నుండి తమ ప్రాణాలను ఎలా కాపాడుకున్నారు ? చివరికి వాళ్ళు తీయాలనుకున్న సినిమా పూర్తయిందా ? అనేదే ఈ చిత్రంలోని మిగిలిన కథ.

Advertisement

Read Also : మొహం మీద మాస్క్ పెట్టి చంపే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్… మైండ్ బెండింగ్ క్లైమాక్స్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×