E-Paper
Advertisement

‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ‘ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ‘ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!
Advertisement

Epic First Semister OTT: ఇటీవల కాలంలో ఒక కొత్త సినిమా థియేటర్లో విడుదల అయింది అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలైన సినిమాలన్నీ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda)వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ (Epic first semister). 90 s సిరీస్ కొనసాగింపుగా ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అక్టోబర్ 9 ఎపిక్ ఓటీటీ స్ట్రీమింగ్..

బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ మరోసారి ఎపిక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా థియేటర్లలో ప్రేక్షకులను నిరాశపరిచిన ఈ సినిమా త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతోంది ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీ నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుందని తెలుస్తోంది.

బేబీ స్థాయి హిట్ కొట్టలేకపోయిన ఎపిక్…

Advertisement

ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, మలయాళ, హిందీ భాషలలో కూడా అందుబాటులోకి రాబోతోంది.థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఎలాంటి ఆదరణ పొందుతుందనేది తెలియాల్సి ఉంది. ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సూపర్ హిట్ సినిమా తర్వాత మరోసారి అదే కాంబినేషన్లో ఎపిక్ సినిమా విడుదల అయింది. ఈ సినిమాకు మాత్రం బేబీ సినిమా రేంజ్ లో ఆదరణ లభించలేదని చెప్పాలి.

ఈ సినిమా కథ విషయానికి వస్తే..

వనపర్తికి చెందిన ఆదిత్య (ఆనంద్ దేవరకొండ)కు సినిమాలలో డైరెక్టర్ అవ్వాలంటే చాలా ఇష్టం చదువు అంటే ఇష్టం లేకపోయినా తన తండ్రి బలవంతంతో లండన్ వెళ్లి ఉన్నత చదువులు చదువుతుంటారు. ఆ సమయంలోనే అక్కడ కడలి (వైష్ణవి చైతన్య) తో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి లివింగ్ ఇన్ రిలేషన్ వైపు దారితీస్తుంది. ఇలా ప్రేమలో ఉన్న వీరిద్దరీ జీవితాలలో అనుకోని సమస్యలు వస్తాయి ఈ సమస్యలను ఎలా అధిగమించారు? వీరిద్దరి ప్రేమ ఫలిస్తుందా? తమ రిలేషన్ విషయంలో వీరిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ఈ ఎపిక్ సినిమా.

Advertisement

Also Read: కేసీఆర్ పాత్ర అద్భుతంగా చేశావు.. ప్రియదర్శిని సత్కరించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే!

Related News

ఏకంగా 6 పెళ్ళిళ్ళు… అతన్ని పెళ్లి చేసుకున్న మహిళలంతా చనిపోతారు… ట్విస్టులతో మతిపోగొట్టే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ

చనిపోతూ ఫ్రెండ్ ఇచ్చే భారీ కుక్క… వదిలించుకోడానికి నానాతంటాలు… క్లైమాక్స్ చూస్తే కన్నీళ్ళు ఆగవు

చేతిలో చిన్న పడవ… ముందేమో అంతులేని సముద్రం… ఓటీటీలోకి తెలుగులో అదిరిపోయే అడ్వెంచర్ సిరీస్

టాక్సిక్ ఓటీటీలో బిగ్ ట్విస్ట్?

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×