BigTV English

OTT Movie : పీడకలల్లో కన్పించే మిస్టీరియస్ అమ్మాయి… మిస్సింగ్ కేసుకు దెయ్యాలతో లింక్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

OTT Movie :  పీడకలల్లో కన్పించే మిస్టీరియస్ అమ్మాయి… మిస్సింగ్ కేసుకు దెయ్యాలతో లింక్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

OTT Movie : జానపద కథలు, సైన్స్-ఫిక్షన్ ను మిక్స్ చేసిన ఒక హారర్ స్టోరీ వెబ్ సిరీస్ రూపంలో ఓటీటీలోకి వచ్చింది. ఈ సరికొత్త సీరీస్ లో ఉత్కంఠభరిత సన్నివేశాలు చాలానే ఉన్నాయి. మొదట ఒక మర్డర్ తో స్టార్ట్ అయ్యే ఈ స్టోరీ, ఊహించని మలుపులు తిరుగుతూ ఒక దుష్ట శక్తి వరకూ వెళ్తుంది. క్లైమాక్స్ అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. హారర్, సైన్స్-ఫిక్షన్, సుపర్‌నాచురల్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. దీని స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘అంధేరా’ (Andhera) ముంబై నగరంలో జరిగే ఒక సైన్స్-ఫిక్షన్ సుపర్‌నాచురల్ హారర్ వెబ్ సిరీస్. రాఘవ్ దర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియా బాపట్, కరణ్‌వీర్ మల్హోత్రా, ప్రజక్తా కోలి, సుర్వీన్ చావ్లా, ప్రణయ్ పచౌరి, వత్సల్ శేత్ నటించారు. ఈ సిరీస్ 2025 ఆగస్టు 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై, IMDbలో 7.3/10 రేటింగ్ సాధించింది. ఎనిమిది ఎపిసోడ్‌లతో, ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివి కలిగిఉంది.


స్టోరీలోకి వెళ్తే

ముంబై నగరంలో బానీ అనే యువతి హఠాత్తుగా అదృశ్యమవుతుంది. ఆతరువాత ఒక శవమై కనిపిస్తుంది. ఆమె మరణం ఆత్మహత్యగా ప్రకటిస్తారు. అయితే ఆమె స్నేహితుడు జయ్ శేత్ అనే వైద్య విద్యార్థి, బానీని ‘తమా’ అనే ఒక సుపర్‌నాచురల్ శక్తి ఇలా చేసిందని నమ్ముతాడు. ఈ సమయంలో జయ్ తన సోదరుడు పృథ్వీతో కలిసి, ఒక కారు ప్రమాదంలో చిక్కుకుంటాడు. దీనివల్ల పృథ్వీ కోమాలోకి వెళ్తాడు. జయ్‌కు బానీ గురించి భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. అతను రూమీ అనే ఒక సుపర్‌నాచురల్ వ్లాగర్, జూడ్ అనే కామిక్ బుక్ అభిమానితో కలసి ఈ మరణం వెనుక అసలు రహస్యం తెలుసుకోవాలనుకుంటాడు. ఇన్‌స్పెక్టర్ కల్పనా కదమ్ బానీ కేసును దర్యాప్తు చేస్తూ, ఆత్మా హీలింగ్ సెంటర్‌కు చేరుకుంటుంది. దీనిని ఐషా నిర్వహిస్తుంటుంది. తమా అనేది భయం, మానసిక బాధలను ఆహారంగా తీసుకునే ఒక పురాతన శక్తి. ఇది మానవ బలహీనతలను ఉపయోగించి లొంగదీసుకుంటుంది.

Read Also : మనుషుల్ని బంకర్లలో దాచి ఇదేం పాడు పని ? దిక్కుమాలిన డెత్ గేమ్స్… బెస్ట్ సర్వైవల్ మూవీ

దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, జయ్, రూమీ, కల్పనా ‘తమా’ ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకుంటారు. ఇది అనైతిక ప్రయోగాల ద్వారా సృష్టించబడింది. దీనిని డాక్టర్ పవన్ సహాయ్ సృష్టించాడు. ఐషా తన స్వంత లాభం కోసం తమాను ఉపయోగిస్తూ, దాని రక్షకురాలిగా వ్యవహరిస్తుంటుంది. ఇక క్లైమాక్స్‌లో, ఐషా తన తండ్రిని, ఒమర్ అనే బాలుడిని బలి ఇవ్వడానికి ఒక ఆచారాన్ని ప్లాన్ చేస్తుంది. ఇదంతా తమాను మరింత శక్తివంతం చేయడానికి చేయాలనుకుంటుంది. జయ్ దీనిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్లైమాక్స్ ఒక భయంకరమైన ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. తమాను జయ్ ఎలా ఎదుర్కొంటాడు ? ఐషా తమాను మరింత శక్తివంతంగా మారుస్తుందా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చుడండి.

Related News

Wednesday season 2 Trailer : ‘వెన్స్ డే ‘ సీజన్ 2 ట్రైలర్.. మతిపోయే ట్విస్ట్.. లేడీ గాగా వచ్చేస్తుందిరోయ్..!

OTT Movie : హోటల్లో పని చేసే అమ్మాయిపై అరాచకం… వచ్చిన ప్రతి ఒక్కడూ అదే పని… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

OTT Movie : అక్క పెళ్లి చేసుకోవాల్సిన వాడితో ఆ పని చేసే చెల్లి… ట్విస్టులతో పిచ్చెక్కించే తమిళ క్రైమ్ డ్రామా

OTT Movie : పౌర్ణమి వచ్చిందంటే పరుగో పరుగు… నవ వధువులు మిస్సింగ్… ఊర్లో జనాల్ని హడలెత్తించే బ్లాక్ మ్యాజిక్

OTT Movie : సిక్కులపై మిలిటెంట్ల ఉక్కుపాదం… ‘ది కాశ్మీరీ ఫైల్స్’ లాంటి మరో రియల్ స్టోరీ… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : పూలమ్మే పిల్ల ప్రాణాలు గాల్లో… ఇరాన్, ఇజ్రాయెల్, ఇండియా మధ్య జరిగే రాజకీయాలు ఇలా ఉంటాయా ?

Big Stories

×