OTT Movie : రియల్ సంఘటనల ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ జానర్ సినిమాలు ప్రేక్షకులకు ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, 2012 ఇజ్రాయెల్ దౌత్యవేత్తలపై జరిగిన బాంబు దాడి నుండి ప్రేరణ పొందింది. జాన్ అబ్రహం ఇందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా రాజకీయ ఉద్రిక్తతలు, గూఢచర్యం వంటి థీమ్స్ తో ఉత్కంఠభరిత కథను అందిస్తుంది. రీసెంట్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఏ ఓటీటీలో ఉందంటే
‘టెహ్రాన్’ (Tehran) ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అరుణ్ గోపాలన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో జాన్ అబ్రహం, నీరు బజ్వా, మానుషి ఛిల్లర్, హదీ ఖంజన్‌పూర్, మధురిమా తులి, అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ZEE5లో విడుదలై, IMDbలో 7.2/10 రేటింగ్ సాధించింది. 118 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుంది.
కథలోకి వెళ్తే
డీసీపీ రాజీవ్ కుమార్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ అధికారి. ఢిల్లీలో ఒక భయంకరమైన బాంబు దాడి జరుగుతుంది. ఈ దాడిలో అతని కళ్ళముందే ఒక పూలు అమ్మే పిల్ల చనిపోవడంతో, రాజీవ్ వ్యక్తిగతంగా ఈ కేసును తీసుకుంటాడు. ఈ బాంబు దాడి వెనుక ఇరాన్, ఇజ్రాయెల్, భారత్ మధ్య పొలిటికల్ ఉద్రిక్తతలు ఉన్నాయని తెలుస్తుంది. రాజీవ్ తన బృందంలోని సబ్-ఇన్‌స్పెక్టర్ దివ్య రానా, దౌత్యవేత్త శీలజ సహాయంతో ఈ కేసును దర్యాప్తు చేస్తాడు. CCTV ఫుటేజ్ ద్వారా హౌసాంగ్ అఫ్సర్ అనే ఇరానియన్ ఉగ్రవాదిని గుర్తిస్తాడు. అతను ఇరాన్ సైన్యంతో సంబంధం కలిగి ఉంటాడు. భారత ప్రభుత్వం, ఇరాన్‌తో ఓ ఆయిల్ ఒప్పందం కారణంగా ఈ దర్యాప్తును నిలిపివేయాలని ఆదేశిస్తుంది. కానీ రాజీవ్ ఈ ఆదేశాలను ధిక్కరిస్తాడు.
Read Also : ఐదుగురు మనుషులతో 30 రోజులు అదే పని… బ్లడీ డెత్ గేమ్… థ్రిల్లింగ్ మలుపులు, ఊహించని సర్ప్రైజులు
రాజీవ్, దివ్య, శీలజ, అబు ధాబి నుండి టెహ్రాన్‌కు ఒక ప్రమాదకర మిషన్‌లోకి వెళ్తారు. ఇక్కడ రాజీవ్‌ను ఇరాన్ టార్గెట్ చేస్తుంది. ఈ మిషన్‌లో, రాజీవ్ భయంకరమైన సంఘటనలను ఎదుర్కొంటాడు. ఇప్పుడు రాజీవ్ లక్ష్యం, అఫ్సర్‌ను ఎదుర్కోవడం. క్లైమాక్స్‌లో ఈ కథ హింసాత్మక ట్విస్ట్‌తో ముగిస్తుంది. రాజీవ్ తన మిషన్ ను పూర్తి చేస్తాడా ? అఫ్సర్ ఏమవుతాడు ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ పొలిటికల్ యాక్షన్ సినిమాను మిస్ కాకుండా చుడండి.