OTT Movie : సినిమాలను ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తుంటారు. అంతవరకూ అయితే బాగానే ఉంటుంది. కానీ కొన్ని సినిమాలు పుకార్లతో హడలెత్తించాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాని చూస్తే మనుషులు చచ్చిపోతారనే ప్రచారం కూడా బలంగా జరిగింది. 1979 లో వచ్చిన ఈ హారర్ మూవీని చూడాలంటేనే వణికిపోయేవాళ్ళు. దాదాపు 86 మంది ఈ సినిమాని చూసేటప్పుడు చనిపోయారని ప్రచారంలో ఉంది. 2018 లో దీనిని ఒక డాక్యుమెంటరీగా తెసుకొచ్చారు. సినిమా గుర్తింపు కోసమే ఇలా ప్రచారం చేశారని ఇందులో చెప్పుకొచ్చారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
మాక్సిన్ అనే మహిళకి ఒరలీ అనే కూతురు, నాథన్ అనే కొడుకు ఉంటారు. ఒక రోజు వీళ్ళ పెంపుడు కుక్క అనారోగ్యంతో చనిపోతుంది. అందుకు గానూ నాథన్ తీవ్ర దుఃఖంలో ఉంటాడు. చనిపోయిన కుక్క స్వర్గానికి వెళ్లలేదని, నరకానికి వెళ్లిందని నాథన్ తో అతని తల్లి ఆటపట్టించడానికి చెప్తుంది. అతను నిజంగా తన కుక్క నరకానికి వెళ్ళిందని బాధపడతాడు. ఈ బాధ నుండి అతనిని ఉపశమనం చేయడానికి, ఒరలీ తన తమ్ముడిని అడవిలోని ‘అంట్రమ్’ అనే ప్రదేశానికి తీసుకెళ్తుంది. అక్కడ ఒక ప్రాంతంలో పెంపుడు కుక్క ఆత్మను రక్షించడానికి, నరకానికి ఒక గొయ్యి తవ్వాలని అనుకుంటారు. వీళ్ళు అడవిలో ఒక గొయ్యి తవ్వడం ప్రారంభిస్తారు. కానీ వారు లోతుగా తవ్వుతున్న కొద్దీ, వింత సంఘటనలు సంభవిస్తాయి. అడవిలో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు కనిపిస్తాయి. దెయ్యాల రూపంలో ఉన్న కొన్ని ఆకారాలు వీళ్ళను భయపెడతాయి. అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా మారుతుంది. చివరికి ఈ పిల్లల్ని దుష్ట శక్తులు ఏం చేస్తాయి ? కుక్క ఆత్మ నిజంగా నరకానికి వెళ్తుందా ? వీళ్ళు తిరిగి ఇంటికి చేరుకుంటారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కెనడియన్ హారర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : మహిళలను మాత్రమే చంపే సీరియల్ కిల్లర్… ట్విస్ట్ లతో పిచ్చెక్కించే కన్నడ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ కెనడియన్ హారర్ మూవీ పేరు ‘అంట్రమ్: ది డెడ్లీయెస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్’ (Antrum : the Deadliest Film Ever Made). 2018 లో వచ్చిన ఈ మూవీకి డేవిడ్ అమిటో, మైఖేల్ లైసిని దర్శకత్వం వహించారు. ఇది రెండు భాగాలుగా తెరకెక్కింది. 1979 లో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. చాలామంది ఈ సినిమాని చూసి చనిపోయారని ప్రచారం జరిగింది. ఒక ప్రమాదకరమైన సినిమా అని, దీనిని చూసిన వారికి ప్రమాదకరమైన పరిణామాలు జరుగుతాయని అప్పట్లో అందరూ భయపడ్డారు. 2018 లో అందులో ఉన్న రహస్యాలను బయటికి తెలియజేయడానికి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని ఒక డాక్యుమెంటరీగా తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.