BigTV English

OTT Movie : మహిళలను మాత్రమే చంపే సీరియల్ కిల్లర్… ట్విస్ట్ లతో పిచ్చెక్కించే కన్నడ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie : మహిళలను మాత్రమే చంపే సీరియల్ కిల్లర్… ట్విస్ట్ లతో పిచ్చెక్కించే కన్నడ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie : ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ప్రతిభాషలోనూ ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి దర్శకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. భాషతో ప్రమేయం లేకుండా ఇటువంటి సినిమాలను, ఓటిటిలలో ఎక్కువగా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, వరుసగా హత్యలు చేసే ఒక కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా చివరి వరకు ఉత్కంఠంగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


స్టోరీలోకి వెళితే

ఒక మంత్రి, కమిషనర్, మరో ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెలు వరుసగా దారుణ హత్యకు గురవుతారు. ఈ వరుస సంఘటనలు సిటీలో కలకలం సృష్టిస్తాయి.  ప్రతి హత్య వద్ద హంతకుడు ఒక క్లూ వదిలి వెళతాడు. పోలీసులకు ఈ సైకో క్లూ రూపంలో ఒక సవాల్ విసురుతాడు.  పోలీసులు, సీబీఐ, డిటెక్టివ్‌లు ఈ కేసును పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తారు. కానీ ఎంత ప్రయత్నించినా హంతకుడిని మాత్రం పట్టుకోలేక పోతారు. ఒక స్పెషల్ ఆఫీసర్ అతన్ని పట్టుకోవడానికి చాలా తలివిగా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తుంది. అయితే అతను అంతకన్నా తెలివిగా తప్పించుకుంటాడు.


‘ద్విపాత్ర’ అనే పేరు కన్నడలో కూడా డబుల్ యాక్టింగ్ అని అర్థం వస్తుంది. కానీ ఈ సినిమాలో ఒకే వ్యక్తిలో రెండు డీఎన్ఏలు ఉంటాయి. స్టోరీ ఈ కాన్సెప్ట్‌ చుట్టూ తిరుగుతూ, హంతకుడు ఎవరనే ప్రశ్నను ఉత్కంఠభరితంగా చూపిస్తుంది. చివరికి ఈ హత్యల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? హంతకుడు దొరుకుతాడా ? అమ్మాయిలను మాత్రమే హంతకుడు ఎందుకు చంపుతున్నాడు ? అక్కడ ఎటువంటి క్లూ వదులుతున్నాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కన్నడ  క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : బ్యాచిలర్ పార్టీలో ఫ్రెండ్ మిస్సింగ్ … కేక పెట్టించే కామెడీ థ్రిల్లర్ … ప్రత్యేక పాత్రలో మైక్ టైసన్ …

 

యూట్యూబ్ (Youtube) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ద్విపాత్ర’ (Dwipatra). 2022 లో వచ్చిన ఈ కన్నడ మూవీకి శ్రీవత్స ఆర్ దర్శకత్వం వహించారు. ఇందులో చందు గౌడ, మాళవికా అవినాశ్, సత్య, పాయల్ చెంగప్ప, అవినాశ్, సుచేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా హ్యూమన్ క్లోనింగ్, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి ఆసక్తికరమైన అంశాల చుట్టూ తిరిగే ఒక మర్డర్ మిస్టరీ. కఠినమైన పోలీసుగా చందు గౌడ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ యూట్యూబ్ (Youtube), జీ 5 (Zee 5) లలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×