Anupama Paradha OTT Deal Details: టిల్లు స్క్వేర్ మూవీ తర్వాత అనుపమ పరమేశ్వరన్ నటించిన చిత్రం ‘పరదా’. టిల్లు స్క్వేర్ ఫుల్ గ్లామర్ షో చేసిన అనుపమ ఇందులో గ్రామీణ యువతిగా డీ గ్లామర్ రోల్లో నటించింది. ఆమె ప్రధాన పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఎప్పుడో జనవరిలో షూటింగ్ ఫూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ నోచుకోలేదు. పెద్ద సినిమాల రిలీజ్ వల్ల థియేటర్ల దొరక్కపోవడంతో ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యింది.
పరదా రిలీజ్ డేట్ ఫిక్స్
తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగష్టు 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మూవీ టీం ప్రకటించింది.ఇవాళ (జూలై 17) మూవీ లీరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.సతీ సహాగమణం కాన్సెప్ట్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగుతుంది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో మూవీ ఓటీటీ డిటైయిల్స్ సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. అప్పుడే పరదా మూవీ ఓటీటీ డీల్ పూర్తయ్యిందట.
ఓటీటీ పార్ట్ నర్ ఇదే
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైం వీడియో ఫ్యాన్సీ రేట్ కు పరదా రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. రిలీజ్ కు ముందే ఈ మూవీ ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలను కోనేందుకు ఓటీటీలు ముందుకు రావడం లేదు. రిలీజ్ తర్వాత సినిమా రిజల్ట్ బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నాయి. అలాంటిది.. పరదా లాంటి చిన్న సినిమా విడుదలకు ముందే ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడం విశేషం. అదీ రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వకముందే. దాదాపు రూ. 40 కోట్లకు పరదా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు ఇన్ సైడ్ సినీ సర్కిల్లో టాక్. ప్రస్తుతం పరదా ఓటీటీ డీల్ ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చస్తుంది. ఇప్పుడీ నెంబర్ బడా సినిమాలకు రావడమే కష్టంగా ఉంది.
సతీ సహగమనం నేపథ్యం..
కానీ, ఓ చిన్న గ్రామీణ నేపథ్యం చిత్రం ఈ రేంజ్ లో ధర పలకడం చర్చనీయాంశంగా మారింది. కాగా పరదా బలమైన కంటెంట్ తో రూపొందినట్టు అమెజాన్ నమ్మింది. కంటెంట్ పై నమ్మకంతోనే మేకర్స్ డిమాండ్ మేరకు అమెజాన్ అంత మొత్తం ఇచ్చేందుకు అంగీకరించిందట. అదీ కూడా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ కాకముందే మూవీ ఓటీటీ ఒప్పంద కుదిరింది. ఏప్రిల్ లో ఈ సినిమా ఓటీటీ పార్ట్ నర్ లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీని బట్టే తెలుస్తోంది.. పరదా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డ్స్ కొల్లగొడుతుందో అని. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా దుమ్ముదులిపేయడం కాయం అంటున్నారు. మరి ఆగష్టు 22 తర్వాత పరదా బాక్సాఫీసు వద్ద ఎలాంటి సౌండ్ చేస్తుందో చూడాలి.