Lasya Smily: లాస్య స్మైలీ (Lasya Smily) పరిచయం అవసరం లేని పేరు. ఫోక్ డాన్సర్ (Folk Dancer)గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లాస్య స్మైలీ ఇటీవల”ఆగమ్మ ఆగరదే రాధమ్మ”అనే పాటతో మరోసారి ట్రెండ్ అవుతున్నారు. ఇలా నిత్యం ఎన్నో అద్భుతమైన ఫోక్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న లాస్య స్మైలీ తాజాగా “బిగ్ టీవీ” (Big Tv)నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా లాస్య స్మైలీ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇలా డాన్సర్ గా ఇంత మంచి సక్సెస్ అవ్వడం వెనుక కారణం ఏంటి? ఇలా సక్సెస్ అవుతారని ఎప్పుడైనా అనుకున్నారా? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.
శేఖర్ మాస్టర్ కారణంగానే..
ఈ ప్రశ్నలకు లాస్య స్మైలీ సమాధానం చెబుతూ.. నేను ఈ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆది అన్నయ్య తనకు గురువు అని తెలిపారు అలాగే ఫోక్ డాన్సర్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత శేఖర్ వైరస్ మాస్టర్(Sekhar Virus Master) తన సక్సెస్ కి కారణమని తెలిపారు. చాలామంది నువ్వు డాన్స్ చేయలేవు అంటూ నన్ను డిస్కరేజ్ చేశారు కానీ శేఖర్ వైరస్ అన్నయ్య మాత్రం నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వచ్చారు. నువ్వు చేయగలవు అంటూ ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశమే నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిందని శేఖర్ వైరస్ మాస్టర్ గురించి చాలా గొప్పగా వర్ణించారు. ఇక తనకు ఈ డాన్స్ లో చాలామంది ఇన్స్పిరేషన్ గా ఉన్నారని ముఖ్యంగా జాను లిరి నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉందని తెలిపారు.
వెబ్ సిరీస్ లతో బిజీబిజీగా లాస్య…
ఇలా డాన్సర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న లాస్య స్మైలీ త్వరలోనే హీరోయిన్ గా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈమె ఓటీటీ (Ott)కోసం పలు వెబ్ సిరీస్లలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యానని త్వరలోనే ఇవన్నీ కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. హర్రర్ జానర్ తో పాటు లవ్, సోషల్ మెసేజ్ ఉన్న వెబ్ సిరీస్ లలో నటిస్తున్నానని లాస్య స్మైలీ వెల్లడించారు.
ఇలా ఫోక్ డాన్సర్ గా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో అందరినీ మెప్పించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న లాస్య త్వరలోనే హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన కెరీర్ గురించి ఎన్నో విషయాలు తెలియజేయడమే కాకుండా సింగర్ మధుప్రియకు(Madhu Priya) కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈమె మరికొన్ని ఫోక్ సాంగ్స్ ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇటీవల కాలంలో సినిమాలో పాటలకంటే కూడా ఫోక్ సాంగ్స్ ఇష్టపడే వారి సంఖ్య కూడా పెరుగుతోందనే చెప్పాలి . ఇలా లాస్య స్మైలీ హీరోయిన్ గా రాబోతున్నారని విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.
Also Read: Pooja Hegde: మోనిక సాంగ్ కోసం పూజా పాట్లు.. కాళ్లు నొక్కించుకుంటూ, ఎండలో మాడిపోతూ.. ఇదిగో వీడియో!