OTT Movie : కొన్ని సపెన్స్ థ్రిల్లర్ సినిమాలు గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. ఈ జానర్ లో సినిమాలను తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. అందులోనూ ఇటువంటి మలయాళం సస్పెన్స్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఫహాద్ ఫాజిల్ తన నటనతో ఆకట్టుకున్నాడు. చివరి వరకూ ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
ఆహా (aha) ఓటీటీలో
ఈ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘అపరాధి’ (Aparadhi). ఈ సినిమాకి నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించారు. ఇది నెట్‌ఫ్లిక్స్ Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఫహాద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్, దర్శనా రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ మూడు పాత్రల చుట్టూ, ఒకే ఇంట్లో జరిగే సస్పెన్స్‌ఫుల్ ఘటనలతో మొదలవుతుంది. ఆహా (aha) ఓటీటీలో ఈ మూవీ అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
అలెక్స్ పరాయిల్ (సౌబిన్ షాహిర్) అనే వ్యక్తి వ్యాపారం చేస్తూ, రచనలు కూడా చేస్తుంటాడు. ఒక రోజు తన ప్రియురాలు అర్చనా పిళ్ళై (దర్శనా రాజేంద్రన్) తో వీకెండ్ ట్రిప్‌కు బయలుదేరుతాడు. వీళ్ళు సెల్‌ఫోన్‌లను ఉపయోగించకుండా, రిలాక్స్‌డ్ టైమ్ గడపాలని ప్లాన్ చేస్తారు. అంతే కాకుండా అలెక్స్, అర్చనాకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావిస్తాడు. అయితే ఈ ప్రయాణంలో, రాత్రి సమయంలో వీళ్ళ కారు వర్షంలో బ్రేక్ డౌన్ అవుతుంది. సమీపంలో ఉన్న ఒక ఇంటిలో ఆశ్రయం తీసుకోవాలని అక్కడికి వెళతారు. ఆ ఇంటి యజమాని, ఉన్ని (ఫహాద్ ఫాజిల్) వీళ్ళకు వెల్కమ్ చెప్తాడు. ఫోన్ లైన్ వర్షం కారణంగా పనిచేయడం లేదని, రాత్రి అక్కడే ఉంటామని చెప్తారు. ఈ ముగ్గురూ కలిసి మాట్లాడుతున్న సమయంలో, ఉన్ని ఒక వింత వ్యక్తిగా కనిపిస్తాడు. అతను అలెక్స్ రాసిన నవల ఇరుళ్ గురించి మాట్లాడుతాడు. ఇది ఐదు మంది మహిళలను దారుణంగా చంపిన ఒక రియల్-లైఫ్ సీరియల్ కిల్లర్ ఆధారంగా రాయబడింది.
అదే సమయంలో, ఉన్నట్టుండి ఇంట్లో విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. ఉన్ని, అలెక్స్ పవర్ స్విచ్ ఆన్ చేయడానికి బేస్‌మెంట్‌కు వెళతారు. అక్కడ వీళ్ళు ఒక మహిళ శవాన్ని చూస్తారు. ఈ షాకింగ్ ట్విస్ట్ తో స్టోరీ సస్పెన్స్‌లోకి మారుతుంది. ఈ శవం ఎవరిది? ఆ మర్డర్ చేసింది ఎవరు? అలెక్స్, అర్చనా, ఉన్ని మధ్య అనుమానాలు పెరుగుతాయి. అలెక్స్ తన నవలలో రాసిన ఘటనలు, ఈ ఇంట్లో జరుగుతున్నట్లు గమనిస్తాడు. దీంతో అతను భయాందోళనకు గురవుతాడు. అర్చనాకు అలెక్స్ గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఉన్ని గురించి కూడా రహస్యమైన విషయాలు బయటపడతాయి. చివరికి అలెక్స్, అర్చనా ఈ సైకో నుంచి బయటపడతారా ? అర్చనా వీళ్ళ గురించితెలుసుకున్న రహస్యాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : భర్త మిస్సింగ్… మరొకరితో భార్య… దిమ్మతిరిగే ట్విస్టులున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్