Gundeninda GudiGantalu Today episode june 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి శృతి తో కలిసి బిర్యానీ తిని రాత్రంతా ఇబ్బందులు పడుతుంది. కడుపు ఉబ్బరం సంగతి ఏమోగానీ సత్యం మాత్రం దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ ఇస్తాడు. శృతితో పోటీ పడి మరితిన్న బిర్యానీ అరగక అవస్థతో ప్రభావతి హాల్లోకి వస్తుంది. అప్పుడే మూడ్‌లోకి వచ్చిన బాలు ప్రభావతి విజిల్ కొట్టుకుంటూ రావడంతో ఆగిపోతాడు. హాల్లో ప్రభావతి నడుస్తూ ఉంటుంది. దాంతో మొత్తానికి బాలు మీనా ఫస్ట్ నైట్ ప్లాన్ చెడిపోతుంది. ప్రభావతి అటు ఇటు నడుస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. బాలు ఏమైందో చెప్పు అని అడుగుతాడు. ప్రభావతి మండిపడుతుంది ఇక పరిస్థితిని అర్థం చేసుకున్నా మీనా వేడి నీళ్లు జిలకర ఇవ్వడానికి వంట గదిలోకి వెళుతుంది. రాత్రంతా అజీర్తి సమస్యతో ప్రభావతి బాధపడుతూ ఉంటుంది. ఉదయం లేవగానే అందరూ ప్రభావతి చుట్టూ చేరి గ్యాస్ సమస్యను ఎలా పోగొట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. బాలు చేసిన రోకలి చిట్కా వల్ల ప్రభావతి సమస్య నుంచి బయటపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నల్లపూసలు గుచ్చే వేడుకనే గ్రాండ్‌గా అందరిని పిలిచి చేయాలని అనుకుంటున్నాం అని శోభన చెబుతుంది. శృతి, రోహిణి నల్లపూసలు గుచ్చి ఇస్తే బాగుంటుందేమో అని ప్రభావతి అంటుంది. ఇద్దరికి ఒకేసారి ఆ వేడుక జరిపించేద్దాం అని శోభన అంటుంది. శృతితో పాటుగా రోహిణికి కూడా శోభన నల్లపూసల వేడుక చేయిస్తానని చెబుతుంది. అనంతరం మరోసారి ఇంటికి వచ్చిన శోభన బాలు ఈ ఫంక్షన్‌కు రాకూడదు అని చెబుతుంది.. ఈ కండిషన్ ఒప్పుకుంటేనే ఈ ఫంక్షన్ జరుగుతుందని శోభా అంటుంది.
ఇక బాలు ఉంటే ఎక్కడ గొడవలు జరుగుతాయని ప్రభావతి వెంటనే ఒప్పేసుకుంటుంది. ఈ విషయాన్ని బాలు తో ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. శృతి వాళ్ళ అమ్మ నల్లపూసల గుచ్చే కార్యక్రమాన్ని గ్రాండ్గా చేయాలని అనుకుంటుందండి అని ఉంటుందండి అని ప్రభావతి సత్యంతో అంటుంది. వాడు వస్తే ఖచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుతుంది. అందుకే రాకపోవడమే మంచిది అని అంటుంది. వాడు ఫంక్షన్ లో ఉంటే ఎంత గొడవ జరుగుతుందో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు అందుకే పని వద్దని చెప్పారు అని ప్రభావతి అంటుంది. తన ఇంటి పరువుని ఎందుకు బాలు తీస్తాడు నువ్వెందుకు వేరేలా ఆలోచిస్తున్నావు అని సత్యం క్లాస్ పీకుతాడు.. ప్రభావతి ఎంత చెప్పినా కూడా సత్యం మాత్రం ప్రభావతి మాట వినడు..
ఇక ప్రభావతి చేసేది ఏమీ లేక నిల్చుని ఉంటుంది. ప్రభావతికి దిమ్మతిరిగి పోయేలా సత్యం షాక్ ఇస్తాడు. బాలు ఈ ఫంక్షన్ కి రాకుంటే నేను కూడా ఈ ఫంక్షన్ కి రాను నేను రాకుంటే మీనా కూడా ఈ ఫంక్షన్ కి రాదు అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శృతి మా అమ్మతో నేను మాట్లాడతాను. మీనా అంకుల్ లేకుండా ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుంది అని అంటుంది. ఇక మొత్తానికి ప్రభావతి చేసేది ఏమీ లేక సరే అంటుంది. ఈ విషయాన్ని శోభనతో చెప్తుంది. గొడవ జరక్కుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని శోభా అంటుంది.
Also Read :బన్నీ నుంచి ‘ఐకాన్ ‘ ఔట్.. రేసులోకి మరో హీరో..!
మొత్తానికి శోభ ప్లాను గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మీనా వంట గదిలో వంట చేసుకుంటే ప్రభావతి వెళ్లి తన అక్కను వెళ్లి కక్కేస్తుంది. మీరు భర్త లేకుండా వెళ్తారేమో కానీ నేను మాత్రం నా భర్త లేకుండా ఎక్కడికి వెళ్ళను అని మీనా తెగేసి చెప్పేస్తుంది. నా భర్తను అక్కడ ఎవరైనా ఏమైనా అంటే ఇటుక తీసుకుని కొడతాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అటు రోహిణి మాత్రం తన ఫంక్షన్ కి డబ్బులు కావాలని అరేంజ్ చేసుకోవడానికి నానా తిప్పలు పడుతూ ఉంటుంది. చివరికి వాళ్ళ అమ్మ డబ్బులు ఇస్తానని అనడంతో టెన్షన్ ఫ్రీ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..రేపటి ఎపిసోడ్ లో బాలుకి గొడవ చేయొద్దని మీనా చెప్తుంది. మౌనికను పిలవడానికి వెళ్తే సంజయ్ అవమానించి పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.