E-Paper
Advertisement

అక్టోబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు.. ఎందుకో తెలుసా..?

అక్టోబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు.. ఎందుకో తెలుసా..?
Advertisement

El Niño Plan: స్వేచ్ఛ బ్యూరో: ఎల్‌నినో ప్రభావంతో రానున్న కాలంలో ఎదురయ్యే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు అక్టోబర్ 2న అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఎల్ నినో పై యాక్షన్ ప్లాన్ పై తీర్మానాలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 2న నిర్వహించనున్న గ్రామసభలు, ఎల్‌నినో నేపథ్యంలో గ్రామాల వారీగా చేపట్టాల్సిన పనులు, ఈ ఏడాది గ్రామపంచాయతీల్లో అమలు చేయాల్సిన అభివృద్ధి ప్రణాళికపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీలో ఇప్పటికే యాక్షన్ ప్లాన్‌పై చర్చించి తీర్మానం చేశామన్నారు. అక్టోబర్ 2న ప్రతి గ్రామపంచాయతీలో నిర్వహించే గ్రామసభల్లో ఎల్‌నినో యాక్షన్ ప్లాన్‌పై చర్చించి, గ్రామస్థాయిలో అవసరమైన చర్యలపై తీర్మానాలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి గ్రామపంచాయతీకి..

గ్రామానికి అవసరమైన పనులు ఏమిటి? అందుబాటులో ఉన్న నిధులు ఎంత? వచ్చే ఏడాది కాలంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా గ్రామపంచాయతీలకు అందే నిధులు ఎంత? అనే అంశాలపై గ్రామసభల్లో సమగ్రంగా చర్చించి, గ్రామ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను ఆమోదించాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామపంచాయతీకి ఒకే రకమైన అభివృద్ధి ప్రణాళిక కాకుండా గ్రామాల వారీగా ఉన్న అవసరాలు, అందుబాటులో ఉన్న నిధులను బట్టి పనులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు అత్యవసరమైన పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత ఇతర అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు.ఆర్థికంగా, సామాజికంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో శాశ్వత సామాజిక ఆస్తులు సృష్టించేలా పనుల ఎంపిక ఉండాలని మంత్రి అన్నారు.

Advertisement

Also read: నిజాం కంటే.. కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులే ఎక్కువ.. ఎంపీ చామల తీవ్ర ఆరోపణలు!

రూ.6,700 కోట్లు..

ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు రూ.6,700 కోట్లను ఖర్చు చేస్తున్నామని తెలిపారు.దీంతో ప్రతి గ్రామపంచాయతీలో సగటున సుమారు రూ.50 లక్షల విలువైన పనులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.ఉపాధి హామీ పనులు కోరిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఒకవైపు గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించడం, మరోవైపు గ్రామాలకు ఉపయోగపడే శాశ్వత సామాజిక ఆస్తులను సృష్టించడం లక్ష్యంగా పనులు చేపట్టాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జలసిరి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి, గ్రామాల్లో నీటి సంరక్షణ, నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడే పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఎల్‌నినో యాక్షన్ ప్లాన్..

Advertisement

ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.వచ్చే రెండు రోజులపాటు ఈ అధికారులు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించాలని, కింది స్థాయి సిబ్బందికి గ్రామసభలు, ఎల్‌నినో యాక్షన్ ప్లాన్, ఉపాధి హామీ పనులు, జలసిరి కార్యక్రమంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ప్రజలకు ఉపాధి, గ్రామాలకు మౌలిక వసతులు, నీటి భద్రత, శాశ్వత సామాజిక ఆస్తులు కల్పించేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అన్నారు.ఈ సమావేశానికి స్పెషల్ సీఎస్ దానకిషోర్, అడిషనల్ కమిషనర్ పి. రవీందర్తో పాటు శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also read: ఖాతాల్లో రూ.813 కోట్లు పెట్టుకుని ఏం చేస్తున్నారు? కలెక్టర్లపై మంత్రి ఉత్తమ్ ఫైర్!

Tags

Related News

తెలంగాణ పోటీపరీక్షల్లో సిలబస్ మార్పులు.. క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ!

హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు.. 80 గజాల్లో 7 అంతస్తుల భవనం కలకలం!

జూరాల రైతుల అరెస్టులపై హరీష్ రావు ఫైర్.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్!

గాంధీభవన్‌లో కేసీఆర్ అన్నకూతురు.. బీఆర్ఎస్‌లో రగులుతున్న కాక!

జూరాల ఎడమ కాలువ వద్ద హైటెన్షన్.. ప్రాజెక్టుల వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు!

త్యాగాలకు తగిన గుర్తింపు.. ఉద్యమకారులకు అండగా సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కి డేట్ ఫిక్స్!

Big Stories

Advertisement
×