E-Paper
Advertisement

గాంధీభవన్‌లో కేసీఆర్ అన్నకూతురు.. బీఆర్ఎస్‌లో రగులుతున్న కాక!

గాంధీభవన్‌లో కేసీఆర్ అన్నకూతురు.. బీఆర్ఎస్‌లో రగులుతున్న కాక!
Advertisement

Santosh Rao: స్వేచ్చ బ్యూరో: “నేను, కవిత రోడ్డున పడితే మీకు అనందంగా ఉన్నదా”? అంటూ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కల్వకుంట్ల రమ్యారావు కేసీఆర్ ను ప్రశ్నించారు. సోమవారం ఆమె గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ…తాను కేసీఆర్ సొంత అన్నబిడ్డనని, కవిత కేసీఆర్ సొంత బిడ్డ అని, కానీ తామిద్దరం రోడ్డు మీద పడితే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇందుకు కారణం సంతోషరావేనని నొక్కి చెప్పారు. అక్కలను బయటకు పంపి, సంతోష్​ రావు వేల కోట్లకు పడగలు ఎత్తాడని ఆమె విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణను అడ్డగోలుగా దోచుకున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలనకు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేకనే బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని టీపీసీసీ సీనియర్ నాయకురాలు రమ్య రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను, కేటీఆర్, కవిత..ఆ ఇంటి బిడ్డలమని, కానీ ఎలాంటి సంబంధం లేని జోగినిపల్లి సంతోష్​ రావు కేసీఆర్ ఇంట్లో ఎందుకు ఉంటున్నారని రమ్యారావు ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని సంతోష్​ రావు వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. పైగా నన్ను, కవితను ఇల్లు దాటించి బయటకు పంపించేలా చేసిన సంతోష్ రావు విషయంలో కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? సంతోష్ కేటీఆర్ కు బినామీనా? ఆయనకు ఎందుకు భయపడుతున్నారు?” అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

పట్టాల అక్రమాలు, 200 గజాలు కూడా వదల్లేదు..

సంతోష్ రావు అక్రమాలకు అడ్డు అదుపు లేదన్నారు. 2013లో సంతోష్‌కు క్వారీలో 25 శాతం వాటా మాత్రమే ఉండేదని, 2015 బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుదురుపాక గ్రామం ప్రాజెక్టు ముంపునకు గురైతే, ఆ గ్రామానికి సంబంధం లేని సంతోష్ రావు తనను తాను బీసీగా చూపించుకుని మరీ అక్రమంగా పట్టాలు తీసుకున్నారన్నారు.ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి కుదురుపాకలోనే ఏకంగా 8 ప్లాట్లు పొందినట్లు తెలిపారు. 2018లో రాజ్యసభకు వెళ్లే సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం కేవలం ఒకే ఒక్క ప్లాట్ చూపించి మిగతావి దాచిపెట్టారన్నారు. చివరికి 200 గజాల స్థలాన్ని కూడా వదలకుండా అక్రమాలకు పాల్పడ్డారన్నారు. కుదురుపాక మెయిన్ రోడ్డులోని బాధితుల భూములను సైతం అడ్డగోలుగా కొనుగోలు చేశారని ఆమె ఆరోపించారు.

Advertisement

Also read: డీసీసీబీ స్కామ్‌పై పవన్ కళ్యాణ్‌కు లేఖ.. సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్!

చెప్పులు లేని స్థాయి నుంచి కోట్లకు పడగలు ఎలా…?

కరీంనగర్‌లో ఉన్నప్పుడు వేసుకోవడానికి చెప్పులు కూడా లేని సంతోష్ రావుకు, చివరకు ఇంట్లో పనిచేసే పిల్ల కష్టపడి సంపాదించిన డబ్బులను కూడా గుంజుకున్న వ్యక్తికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? అని రమ్యారావు ప్రశ్నించారు. ‘‘మార్కుక్ గ్రామంలో 9 ఎకరాల భూమి, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఇల్లు, కొండాపూర్, బంజారాహిల్స్‌లలో భారీ ఆస్తులు ఎలా సంపాదించారు? సంతోష్ రావు భార్య రోహిణి పేరిట నానక్‌రామ్‌గూడలో రూ.21.40 కోట్ల విలువైన 21 వేల చదరపు అడుగుల భారీ కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా వచ్చింది? వర్ధపల్లి గ్రామంలో ఆయన తండ్రి రవీందర్ రావు పేరిట ఉన్న 2 ఎకరాల మెయిన్ రోడ్ భూమితో పాటు, బినామీల పేరిట ఉన్న వందలాది ఎకరాల భూములకు సమాధానం చెప్పాలి” అని ఆమె డిమాండ్ చేశారు.

విదేశాల్లోనూ బినామీ సామ్రాజ్యం — ఫామ్‌హౌస్‌లలో డైమండ్స్, డాక్యుమెంట్లు!

Advertisement

సంతోష్ రావుకు విదేశాలలో కూడా భారీగా ఆస్తులు ఉన్నాయని రమ్య రావు వెల్లడించారు. ఆస్ట్రేలియాలో వెయ్యి ఎకరాలలో ‘జేఎస్ రాజ్ ఎస్టేట్’ ఉన్నదని వివరించారు. వెన్నమనేని శ్రీనివాస్ రావు అనే బినామీ ద్వారా హవాలా రూపంలో భారీగా ఆస్తులను దాచిపెట్టారన్నారు. చిన్న షాపూర్ లో ఫామ్‌హౌస్‌తో పాటు అనేక ఆస్తులు ఉన్నాయన్నారు. ఈ ఫామ్‌హౌస్‌ల నేల మాళిగల్లో, భూమి లోపల కీలక పత్రాలు, డైమండ్స్ దాచిపెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వీటిని వెలికితీయక ముందే, వారే స్వచ్ఛందంగా వాటిని ప్రభుత్వానికి అప్పగించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రమ్యారావు కోరారు. కేటీఆర్ తక్షణమే స్పందించి సంతోష్ రావు ఆస్తులను ప్రజలకు అప్పగించాలని కోరారు.

Also read: పార్క్‌లో మొదలైన ప్రేమ… పెళ్లి తర్వాత ఊహించని మలుపులు.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

Tags

Related News

హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు.. 80 గజాల్లో 7 అంతస్తుల భవనం కలకలం!

జూరాల రైతుల అరెస్టులపై హరీష్ రావు ఫైర్.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్!

అక్టోబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు.. ఎందుకో తెలుసా..?

జూరాల ఎడమ కాలువ వద్ద హైటెన్షన్.. ప్రాజెక్టుల వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు!

త్యాగాలకు తగిన గుర్తింపు.. ఉద్యమకారులకు అండగా సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కి డేట్ ఫిక్స్!

నిజాం కంటే.. కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులే ఎక్కువ.. ఎంపీ చామల తీవ్ర ఆరోపణలు!

Big Stories

Advertisement
×